DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఉపాధి లభించిన వేళ - ఆనందం వెల్లివిరిసింది 

(DNS రిపోర్ట్ : SV  à°†à°šà°¾à°°à±à°¯à±à°²à±,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ ). .

శ్రీకాకుళం, సెప్టెంబర్ 29, 2019 (డిఎన్‌ఎస్‌):   రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ,

వార్డు సచివాలయాలకు చేపట్టిన నియామకాలు వేలాది కుటుంబాల్లో ఆనందాన్ని వెల్లివిరుస్తోంది. మహాత్మా గాంధీజీ కన్న గ్రామ స్వరాజ్యం నెలకొనాలని రాష్ట్ర ప్రభుత్వం

తీసుకున్న చర్యల్లో భాగంగా గ్రామ,వార్డు సచివాలయాల ఏర్పాటు అక్టోబరు 2వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం జరుగుతున్న నేపధ్యంలో ఉద్యోగ నియామకాలు చేపట్టడం

జరిగింది. ఇందులో భాగంగా ఈ నెల 30వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నియామక పత్రాల జారీ కార్యక్రమం జరుగుతుండగా జిల్లాలో సైతం ఘనంగా నిర్వహించుటకు 80 అడుగుల రహదారిలోగల

ఆనందమయి ఫంక్షన్ హాల్ లో ఏర్పాట్లను జిల్లా యంత్రాంగం చేపట్టింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ జె నివాస్ అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేసారు. జిల్లాలో నియామకాల

ప్రక్రియ దిగ్విజయంగా జరిగిందని, అదే స్ఫూర్తితో మిగిలిన ప్రక్రియ పూర్తి కావాలని ఆయన పేర్కొన్నారు. 30వ తేదీ ఉదయం 10 గంటల నుండి ఉద్యోగాలకు ఎంపికైన యువతకు నియామక

పత్రాలను జారీ చేయనున్నారు. జిల్లాలో చేపట్టిన నియామక ప్రక్రియపై యువత, తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేసారు. వేలాది కుటుంబాలకు వెలుగు నింపిందని తల్లిదండ్రులు

అభిప్రాయపడ్డారు. తక్కువ సమయంలో భారీ నియామక ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టి విజయవంతంగా పూర్తి చేయడం సాధారణ విషయం కాదని పేర్కొన్నారు. పొందూరు మండలం

తోలాపి ఒక్క గ్రామం నుండి వివిధ పోస్టులకు దాదాపుగా 20 మంది వరకు యువత ఉద్యోగాలను సాధించడం అటువంటి గ్రామాల్లో పండగ వాతావరణం నెలకొంది. ఉద్యోగాలు పొందిన వారిలో

పోస్టులకు నిర్ణయించిన కనీస అర్హతలుగల సాధారణ అభ్యర్ధులతోపాటు ఎం.టెక్, అగ్రికల్చర్ ఎం.ఎస్.సి పి.హెచ్.డి వంటి ఉన్న చదువులు చదివిన యువత ఉండటం విశేషం. శ్రీకాకుళం

శాంతినగర్ కు చెందిన వావిలాపల్లి ప్రదీప్ కుమార్ నాయుడు ఎం.ఎస్సీ మాథ్స్, ఎం.ఎస్సీ కంప్యూటర్ సైన్స్, బి.ఎడ్ డిగ్రీ అర్హతలు కలిగి ఇంత వరకు వివిధ ఉద్యోగాల

పరీక్షలను వ్రాస్తూ, ప్రైవేటు రంగంలో ఉద్యోగం నిర్వహిస్తూ ప్రస్తుతం విద్య మరియు డేటా ప్రాసెసింగు అధికారి పోస్టుకు ఎంపికయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామ

సచివాలయ నియామకాలను పెద్ద ఎత్తున చేపట్టి తక్కువ కాలంలో ప్రక్రియ పూర్తి చేయడం ఆనందంగా ఉందన్నారు. నా అర్హతకు తగిన ఉద్యోగం సాధించడం గొప్ప అనుభూతిని

ఇచ్చందన్నారు. గ్రూప్ 2, కేంద్రీయ విద్యాలయ వంటి పరీక్షలకు సైతం సిద్ధమయ్యానని ఈ దశలో నియామక ప్రక్రియ అత్యంత పారదర్శకంగా, నిజాయితీగా జరగడం మా అదృష్టమన్నారు. ఎం.ఏ

(ఎడ్యుకేషన్), ఎం.ఏ(పాలిటిక్స్) విద్యార్హతగల వి.సుమన అనే మహిళ మహిళా పోలీసుగా ఎంపిక కావడం ఆనందాన్ని వ్యక్తం చేసారు. స్లెట్ పరీక్షలో సైతం ఉత్తీర్ణత సాధించి గ్రామ

సచివాలయ పోస్టుల పరీక్షను వ్రాసారు. పారదర్శకంగా నియామక ప్రక్రియ జరిగిందని పేర్కొంటూ దీర్ఘకాలికంగా పోటీ పరీక్షలకు సిద్ధమౌతున్నామని ఈ తరుణంలో సచివాలయ

ఉద్యోగం పొందడం గొప్ప ప్రేరణ కలిగిందన్నారు. ఆమదాలవలస కొత్తకోట వారి వీధికి చెందిన బెహర స్వాతి వార్డు ఎమినిటీస్ కార్యదర్శిగా ఎంపికయ్యారు. స్వాతి బి.టెక్

విద్యార్హత కలిగి ఇంజనీరింగు ఉన్నత చదువులు అభ్యసించుటకు గేట్ పరీక్షకు సిద్ధం కావడం జరుగుతుంది. కుటుంబ ఆర్ధిక పరిస్ధితులు కారణంగా ఉద్యోగమా, చదువా అనే

ఆలోచనలో ఉన్న సమయంలో గ్రామ సచివాలయం పోస్టు ఆదుకుందన్నారు. వై.యస్.ఆర్ ప్రవేశపెట్టిన ఫీజు రీఇంబర్సుమెంటుతో స్వాతి, స్వాతి అక్క మాధురి బి.టెక్ లు పూర్తి

చేసుకోవడం జరిగింది. మాధురి హైదరాబాదులో సాప్ట్ వేర్ ఇంజినీరుగా పనిచేస్తుండగా జగన్ మోహన రెడ్డి ఆలోచనల నుండి ఉద్భవించిన గ్రామ, వార్డు సచివాలయాల పోస్టులతో

స్వాతి భవిష్యత్తుకు భరోసా లభించిందని స్వాతి తండ్రి వెంకట భాస్కర రావు తెలిపారు. రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఫీజు రీఇంబర్సుమెంటు, జగన్ మోహన్ రెడ్డి ఉద్యోగ

కల్పన మా కుటుంబాన్ని ఆదుకుందని సంతోషం వ్యక్తం చేసారు. పొందూరు మండలం తోలాపి గ్రామానికి చెందిన అగ్రికల్చర్ బి.ఎస్.సి చదివిన బోనంగి రవళి వ్యవసాయ సహాయకులు

పోస్టునకు ఎంపికైంది. బ్యాంకు పరీక్షలు, ఇతర పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్నానని, గ్రామ సచివాలయం పోస్టుకు ఎంపిక కావడం గర్వకారణంగా ఉందన్నారు. అదే గ్రామానికి

చెందిన పి.అప్పల నరసమ్మ బి.ఎస్.సి, బి.ఎడ్ విద్యార్హత కలిగి విద్యా సహాయకులుగా ఎంపికయ్యారు. డి.ఎస్.సికి తీవ్ర స్ధాయిలో సిద్ధం అవుతున్నానని ఈ దశలో గ్రామ సచివాలయంలో

ఒక గ్రామ అభివృద్ధికి అవసరమగు పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం అందులో సేవ చేసే అవకాశం కలగడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర

ప్రభుత్వం పారదర్శకంగా నియామకాలు చేపట్టగా జిల్లా యంత్రాంగం దానిని యజ్ఞంలా పూర్తి చేసిందని ఆమె పేర్కొన్నారు. ఏ.ఎన్.ఎం పోస్టుకు ఎంపికైన పైడి సుజాత 2006

సంవత్సరంలో ఎం.పి.హెచ్.డబ్ల్యు శిక్షణ పొంది 2007వ సంతవర్సంలో ఎన్.ఆర్.హెచ్.ఎంలో భాగంగా ఆర్.సి.హెచ్ -2లో పనిచేస్తున్నారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రభుత్వ ఉద్యోగం

పొందుటకు నియామకాలకు ఎదురు చూస్తూ 12 సంవత్సరాలు గడిచిందని గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటుతో ప్రభుత్వ ఉద్యోగం పొందగలిగానని ఆనందం వ్యక్తం చేసారు. పప్పల

ఉషాకుమారి డిగ్రీ పూర్తి చేసి డి.ఎడ్ శిక్షణ పొంది ఉపాధ్యాయ పోస్టును పొందుటకు డి.ఎస్.సి పరీక్షకు గత కొంత కాలంగా సిద్ధం కావడమే కాకుండా ప్రభుత్వంలో ఇతర

ఉద్యోగాలలోనైనా ఎంపిక కావాలనే ధృడసంకల్పం మహిళా పోలీసుగా ఎంపికతో కల సాకారం అయిందన్నారు. నాకు వ్యక్తిగతంగాను, నా భర్త, కుటుంబ సభ్యులు ఎంతో సంతోషంగా ఉన్నారని

ఆమె పేర్కొన్నారు. బొడ్డపాటి లక్ష్మీనారాయణ అంతంత మాత్రంగా ఆర్థిక స్ధితి కలిగిన కుటుంబం. వ్యవసాయ విభాగంలో పాలిటెక్నిక్ డిప్లమో పూర్తి చేసి నైరా కళాశాలలో

అగ్రికల్చర్ బి.ఎస్.సి సీటు పొందారు. అదే సమయంలో గ్రామ సచివాలయ పోస్టులలో వ్యవసాయ సహాయకునిగా ఎంపిక కావడంతో ఆర్ధిక పరిస్ధితి రీత్యా అగ్రికల్చర్ బి.ఎస్.సి

కోర్సును వదులుకుని వ్యవసాయ సహాయకునిగా కొనసాగుటకు సిద్ధపడ్డారు. కుటుంబ ఆర్ధిక పరిస్ధితులు నిలదొక్కుకొనుటకు ఈ ఉద్యోగం దోహదం చేస్తుందని, ఎటువంటి సిఫారసులు

లేకుండా ఉద్యోగం పొందడం గొప్ప విజయాన్ని సాధించిన స్ఫూర్తి కలిగిందని అన్నారు. వి.మాధవీ లత డిగ్రీతోపాటు డి.ఎడ్ పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగంలో చేరాలనే

చిరకాలవాంఛతో అనేక పోటీ పరీక్షలను రాస్తు చివరకు మహిళా పోలీసుగా ఎంపికయ్యారు. మహిళా పోలీసుగా ఎంపికకావడం ఆనందంగా ఉందని ఆమె పేర్కొన్నారు. సమాజానికి మంచి

సేవలు అందించుటకు తన వంతు కృషి చేస్తానని ఆమె తెలిపారు. తోలాపి గ్రామానికి చెందిన రవళి తండ్రి రమణ మూర్తి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య మంత్రి జగన్ మోహన్

రెడ్డి ఆలోచన మేరకు పారదర్శకంగా గ్రామ, వార్డు సచివాలయ పోస్టుల భర్తీని పూర్తి చేసిందన్నారు. జిల్లాలో అనేక కుటుంబాలకు చెందిన పేద, మద్యతరగతి, ఉన్నత తరగతి వంటి

హోదాలు లేకుండా అన్ని వర్గాల యువత ఎంపికయ్యారని ఆయా కుటుంబాలలో ఆనందం నెలకొందని అన్నారు. కొన్ని కుటుంబాలలో ఇద్దరు పిల్లలు కూడా ఉద్యోగాలు పొందడం గమనార్హమని,

అటువంటి కుటుంబాలకు ఈ నియామక ప్రక్రియ మధుర స్మృతిగా ఉంటుందని పేర్కొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam