DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఇకపై ఆంధ్రా లో ప్రభుత్వ సారాయే అమ్మ బడును  

ప్రభుత్వ ఆధ్వర్యంలో 3,448 దుకాణాలు ప్రారంభం 

ప్రయివేట్ షాపుల మూసి వేతకు చర్యలు  

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి) : . . .

అమరావతి,

 à°¸à±†à°ªà±à°Ÿà±†à°‚బర్ 30, 2019 (డిఎన్‌ఎస్‌) : ఇక పై ఆంధ్ర లో కేవలం ప్రభుత్వ సారాయి అమ్మబడుతుందని ప్రభుత్వం ప్రకటించేసింది. దీనికి తగిన ఏర్పాట్లు కూడా చేసేసింది. ప్రభుత్వ

అధికారులే దుకాణాలు అద్దెకు తీసుకుని మరీ సారాయి విక్రయాలు మొదలు పెడుతోంది. 
రాష్ట్ర రాజకీయాలను.. ప్రభుత్వ ఖజానాను ప్రభావితం చేసిన మద్యం అమ్మకాల్లో ఇకపై

సమూల మార్పులు రానున్నాయి. ప్రైవేటు మద్యం షాపులు కనుమరుగై.. వాటి స్థానంలో ప్రభుత్వ దుకాణాలు ఏర్పాటు కానున్నాయి. ప్రైవేటు మద్యం దుకాణాలకు సెప్టెంబరు 30వ తేదీ

అంటే సోమవారమే చివరి రోజు. మంగళవారం (1వ తేదీ) నుంచి ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహించనుంది. సరుకునంతా విక్రయించేసి షాపులను ఖాళీచేసే పనిలో ప్రైవేటు మద్యం

వ్యాపారులు బిజీగా ఉండగా, ఎక్సైజ్‌ శాఖ అద్దెకు తీసుకున్న దుకాణాల్లో సరుకు నింపి.. సిబ్బందిని సమకూర్చుకుని.. కొత్తగా అమ్మకాలు ప్రారంభించేందుకు అధికారులు

ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ సంధి కాలంలో కొన్ని ప్రాంతాల్లో మద్యం దొరక్క.. దొరికినా ఇష్టమైన బ్రాండు లభించక మందు బాబులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం

రాష్ట్రంలో 4,380 ప్రైవేటు మద్యం షాపులు ఉన్నాయి. మద్య నిషేధాన్ని దశలవారీగా అమలు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న 4,380 షాపుల్లో 20 శాతం తగ్గించి.. 3,448

ప్రభుత్వ మద్యం దుకాణాలు ఏర్పాటు చేస్తోంది.
 
ప్రైవేటు మద్యం వ్యాపారం 1995 సంవత్సరంలో మద్య నిషేధం సమయంలో మాత్రమే ఆగింది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత పూర్తిగా

ప్రైవేటు మద్యం రద్దవుతోంది. నేటితో లైసెన్సులు అయిపోతున్నందున ప్రైవేటు వ్యాపారుల సరుకును దాదాపుగా ఇప్పటికే ఖాళీ చేశారు. ఆదివారమే అనేక షాపుల్లో మద్యం

అమ్మకాలు ఆగిపోయాయి. కేవలం షాపుల్లో మిగిలిపోయిన బ్రాండ్లు మాత్రమే అమ్ముతున్నారు. గతంలో పాలసీ గడువు ముగిసినా మళ్లీ ప్రైవేటు వ్యాపారులే వస్తారు కాబట్టి, పాత

వ్యాపారులు సరుకును కొత్తవారికి ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ప్రభుత్వ షాపుల వల్ల ఆ అవకాశం లేదు. దీంతో ప్రైవేటు మద్యం షాపులన్నీ ఖాళీ చేస్తున్నారు. మిగిలిపోయిన

మద్యాన్ని ఎక్సైజ్‌ తీసుకుని, అందుకు నగదు ఇవ్వదు కాబట్టి జాగ్రత్త పడుతున్నారు. దీనివల్ల రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మద్యం కొరత ఏర్పడింది. అయితే à°ˆ ప్రభావం

పడకుండా.. ఎక్సైజ్‌ శాఖ ఇప్పటికే ప్రభుత్వ షాపులకు సరుకును చేర్చింది. ఒక్కో షాపునకు రూ.లక్ష నుంచి రూ.2లక్షల విలువైన మద్యాన్ని చేర్చింది. షాపుల్లో సిబ్బంది

నియామక ప్రక్రియను పూర్తిచేసి, వారికి శిక్షణ ఇచ్చింది. 1వ తేదీ నుంచి ఎలాంటి అవాంతరాలు లేకుండా అన్ని షాపులను అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు

ప్రయత్నిస్తున్నారు. మొత్తం 3,500 షాపుల్లో 3,200 వరకూ మంగళవారం ప్రారంభం కావొచ్చని, మిగిలినచోట్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయని అంటున్నారు. ప్రైవేటు షాపుల తరహాలోనే

ప్రభుత్వ షాపుల్లోనూ అన్ని రకాల బ్రాండ్లు అందుబాటులో ఉంచుతున్నారు.
 
బీర్ల అమ్మకాలపై అస్పష్టత : . . .

లిక్కర్‌ వరకూ అన్ని బ్రాండ్లూ ప్రభుత్వ దుకాణాల్లో

అందుబాటులో ఉంచుతున్నా.. బీర్ల విషయంలో భిన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ షాపుల్లో పర్మిట్‌ రూమ్‌లు ఉండవు కాబట్టి బీర్ల కూలింగ్‌కు షాపుల్లో

ఫ్రిడ్జ్‌లు ఏర్పాటు చేయడం లేదని à°“ వైపు చెబుతూ, అవకాశం ఉన్నచోట ఫ్రిడ్జ్‌లు ఏర్పాటు చేస్తామని మరో మాట చెబుతున్నారు. ఫ్రిడ్జ్‌à°² కొనుగోలు తలకుమించిన ఆర్థిక

భారం కావడం వల్లే వెనకడుగు వేస్తున్నట్టు ఎక్సైజ్‌ వర్గాల్లో చర్చ సాగుతోంది. దీనివల్ల బీర్ల అమ్మకాలు పడిపోతే ఏంచేయాలనే దానిపై అధికారులు ఇంతవరకూ ఏ నిర్ణయం

తీసుకోలేదని తెలుస్తోంది. షాపులో బీర్లు కొని ఇంటికి తీసుకెళ్లి కూలింగ్‌ పెట్టుకుని తాగేవారి సంఖ్య అతి స్వల్పంగా ఉంటుందని, అప్పటికప్పుడు తాగేవారే

ఎక్కువగా ఉంటారని, ప్రభుత్వ నిర్ణయం వల్ల బీర్ల అమ్మకాలు  à°¦à°¾à°°à±à°£à°‚à°—à°¾ పడి పోతాయని అధికార వర్గాలే చెబుతున్నాయి.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam