DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బ్యాంకు ఖాతాలు ఆధార్ తో అనుసంధానం కావాలి 

రైతు భరోసాకు తప్పని సరి : కలెక్టర్ డాక్టర్ నివాస్ 

జిల్లాలో 835 గ్రామ, వార్డు సచివాలయాలు :

వై.యస్.ఆర్ వాహన మిత్రకు 10,654 మంది : . .

10 నుండి వై.యస్.ఆర్ కంటి

వెలుగు : . . .

(DNS రిపోర్ట్ : SV  à°†à°šà°¾à°°à±à°¯à±à°²à±,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚) :  . . .

శ్రీకాకుళం, అక్టోబర్ 01, 2019 (డిఎన్‌ఎస్‌):  à°°à±ˆà°¤à± భరోసా కార్యక్రమంలో ప్రభుత్వం అందించే

ఆర్ధిక సహాయానికి రైతుల బ్యాంకు ఖాతాలు, ఆధార్ తో అనుసంధానం కావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్  à°œà±† నివాస్ అన్నారు. అక్టోబరు 15à°µ తేదీన జరిగే వై.యస్.ఆర్ రైతు భరోసా

కార్యక్రమంపై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంగళ వారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో పలు వివరాలను జిల్లా కలెక్టర్ తెలిపారు. ఆధార్ తో

అనుసంధానం చేసిన బ్యాంకు ఖాతాల వివరాలను అందించాలని ఆయన స్పష్టం చేసారు. ఆధార్ తో అనుసంధానం కాని బ్యాంకు ఖాతాలు సమర్పిస్తే ప్రభుత్వం అందించే సహాయం ఖాతాలలో జమ

కాదని ఆయన పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఆధార్ లో నమోదు కాని రైతులు వెంటనే ఆధార్ లో నమోదు కావాలని కోరారు. ఇందుకు తహశీల్దారు కార్యాలయాల్లో ప్రత్యేక ఆధార్

కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వై.యస్.ఆర్ రైతు భరోసా కార్యక్రమం క్రింద ఆర్ధిక సహాయం పొందుటకు భూమిని సాగు చేస్తున్న రైతులు అర్హులని చెప్పారు.

అయితే ప్రభుత్వ ఉద్యోగులు, వ్యవసాయేతర భూమి కలిగిన వారు, పి.యం కిసాన్ లో అర్హత పొందిన వారు ఇందుకు అర్హులు కారని ఆయన స్పష్టం చేసారు. ఇటీవల భూమిని కొనుగోళు చేసిన

రైతులు వెబ్ ల్యాండ్ లో పేరు లేకపోయినా అర్హులేనని చెప్పారు. ఆర్.ఓ.ఎఫ్.ఆర్ (అటవీ హక్కుల చట్టం) క్రింద, దేవదాయ శాఖ భూములను లీజ్ క్రింద సాగు చేస్తున్నవారు, ఇనాం

భూములు సాగుచేస్తన్నవారు  à°…ర్హులని కలెక్టర్ నివాస్ వివరించారు. 1.25 ఎకరాలకు తక్కువగా ఉన్న భూములను కౌలుగా పరిగణించడం లేదని స్పష్టం చేసారు. రైతు భరోసా

కార్యక్రమానికి దరఖాస్తు చేయని అర్హులైన రైతులు 3వ తేదీ లోగా దరఖాస్తు చేయవచ్చని కలెక్టర్ అన్నారు. గ్రామాల్లో 5వ తేదీన జాబితాను ప్రదర్శించడం జరుగుతుందని

అందులో పరిశీలించాలని కోరారు. కౌలుదారులు, భూయజమానులు పంట సాగుదారు హక్కుల చట్టం (క్రాప్ కల్టివేషన్ రైట్స్ ఏక్ట్)కు అనుగుణంగా 11 నెలల ఒప్పందం కుదుర్చుకోవాలని

వివరించారు. ఈ ఒప్పంద పత్రంపై యజమాని, కౌలుదారు, వి.ఆర్.ఓ సంతకం చేయాలని తెలిపారు. భూ యజమానికి ఎటువంటి నష్టం జరగదని అండగల్ లోగాని, 1(బి)లోగాని ఎటువంటి నమోదు జరగని

తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు పి.యం కిసాన్ క్రింద 2,87,305 మంది నమోదు చేసుకున్నారని, 24,285 మంది వివిధ కారణాల వలన అనర్హులుగా గుర్తించడం జరిగిందని చెప్పారు. రైతు భరోసాకు

కొత్తగా 82,145 మంది నమోదు చేసుకున్నారని చెప్పారు. 10,482 మంది కౌలుదారులు నమోదు అయ్యారని తెలిపారు. ఈ నెల 15వ తేదీన రైతు భరోసా క్రింద రూ.12,500 ఆధార్ తో అనుసంధానం చేసిన బ్యాంకు

ఖాతాలలో జమ అవుతుందని చెప్పారు.

జిల్లాలో 835 గ్రామ, వార్డు సచివాలయాలు : . . . 

  జిల్లాలో 835 గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసామని జిల్లా కలెక్టర్ నివాస్

చెప్పారు. మహాత్మా గాంధీ జయంతి అక్టోబరు 2వ తేదీన 38 మండలాల్లో 38 గ్రామ సచివాలయాల ఏర్పాటుతోపాటు పది నియోజకవర్గాల్లో ఒక్కొ మోడల్ సచివాలయాన్ని ఏర్పాటు

చేస్తున్నామని చెప్పారు. అక్టోబరు 3వ తేదీ నుండి సచివాలయాలకు ఎంపికైన అభ్యర్ధులకు కౌన్సిలింగు నిర్వహిస్తున్నామని తెలిపారు. అభ్యర్ధులకు సొంత గ్రామంలో

నియామకం ఉండదని కలెక్టర్ స్పష్టం చేసారు.

వై.యస్.ఆర్ వాహన మిత్రకు 10,654 మంది : . . 

వై.యస్.ఆర్ వాహన మిత్రకు జిల్లాలో 10,654 మంది దరఖాస్తు చేసుకున్నారని కలెక్టర్

తెలిపారు. అక్టోబరు 4వ తేదీన ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో నిర్వహించే కార్యక్రమంలో సొంత ఆటో, టాక్సి కలిగిన వారికి ఆర్ధిక సహాయం అందజేయడం జరుగుతుందని

చెప్పారు.

10 నుండి వై.యస్.ఆర్ కంటి వెలుగు : . . .

వై.యస్.ఆర్ కంటి వెలుగు కార్యక్రమంను 10వ తేదీన ప్రారంభిస్తున్నామని తెలిపారు. అక్టోబరు 10 నుండి 16వ తేదీ వరకు

జిల్లాలో గల 3, 894 ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్ధలలోగల విద్యార్ధులకు నేత్ర పరీక్షలు నిర్వహించి, తీవ్రమైన నేత్ర సమస్యలుగల వారికి నవంబరు 1వ తేదీ నుండి డిశంబరు 31వ

తేదీ వరకు నేత్ర చికిత్సలు చేయించడం, అవసరమయ్యే కళ్ళద్దాలు అందించడం జరుగుతుందని తెలిపారు. 20 వేల మంది వరకు నేత్ర సమస్యలతో బాధపడుతుండవచ్చని అంచనా

వేస్తున్నామని కలెక్టర్ పేర్కొన్నారు. ఫిబ్రవరి నెలలో ప్రజలందరికి కంటి పరీక్షలు నిర్వహిస్తామని, గ్రామాల వారీ శిబిరాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు.

       

  జాయింట్ కలెక్టర్ à°¡à°¾.కె.శ్రీనివాసులు మాట్లాడుతూ జిల్లాలో 191 మద్యం దుకాణాలను ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. మీడియా ప్రతినిధుల

సమావేశంలో జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి జి.చక్రధర రావు, వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు బి.జి.డి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam