DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సౌత్ జోన్ అంతర్ వర్సిటీ ఖోఖో పోటీలు ప్రారంభం 

(DNS రిపోర్ట్ : SV  à°†à°šà°¾à°°à±à°¯à±à°²à±,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ ). .

శ్రీకాకుళం, అక్టోబర్ 03, 2019 (డిఎన్‌ఎస్‌): సౌత్ జోన్ అంతర్ విశ్వవిద్యాలయ ఖోఖో పోటీలు గురు వారం ఘనంగా

ప్రారంభం అయ్యాయి. రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణ దాస్ , రాష్ట్ర యువజన సర్వీసులు, క్రీడలు, సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ లు

శ్రీకాకుళంలోగల డా.బి.ఆర్.అంబేద్కర్ విశ్వవిద్యాలయం క్రీడా మైదానంలో పోటీలను ప్రారంభించారు. డా.బి.ఆర్.విశ్వవిద్యాలయం సౌత్ జోన్ అంతర్ విశ్వవిద్యాలయ ఖోఖో

మహిళా ఛాంపియన్ షిప్ పోటీలకు ఆతిధ్యం ఇస్తోంది. మంత్రులు క్రిష్ణదాస్, ముత్తంశెట్టి శ్రీనివాస్ జాతీయ పతాకాన్ని, డా.బి.ఆర్.అంబేద్కర్ విశ్వవిద్యాలయ పతాకాన్ని,

క్రీడా పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ క్రీడలలో ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్నాటక, కేరళ, పాండిచ్చేరి రాష్ట్రాలకు చెందిన 57 విశ్వవిద్యాలయాల నుండి 8 వందలకు

పైగా మహిళా క్రీడాకారులు పాల్గొంటున్నారు. క్రీడాకారులు మార్చ్ ఫాస్ట్ నిర్వహించారు.

          à°ˆ సందర్బంగా రాష్ట్ర యువజన సర్వీసులు, క్రీడలు, సాంస్కృతిక శాఖ

మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ క్రీడలు దేశ సమైఖ్యతకు దోహదం చేస్తున్నాయన్నారు. దేశ భక్తిని పెంపొందించడంలో క్రీడలు ప్రముఖ పాత్ర

పోషిస్తాయన్నారు. క్రీడలు కుల,మతాలకు అతీతమని క్రీడాకారులకు దేశం యావత్తు అండగా నిలుస్తుందని అన్నారు. క్రీడాకారులు అపారమైన ఆత్మస్ధైర్యాన్ని, విశ్వాసాన్ని

కలిగి ఉంటారని పేర్కొన్నారు. యువత క్రీడల్లో రావాలని తద్వారా దేశ భవితకు గట్టి పునాదులు పడతాయని యన్నారు. క్రీడల వలన శారీరక, మానసిక ఆరోగ్యం కలుగుతుందని మంత్రి

అన్నారు. రాష్ట్రంలో క్రీడలకు పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నామని పేర్కొంటూ అదే స్ధాయిలో ప్రామాణికమైన విద్యను అందించుటకు కృషి చేస్తున్నామన్నారు. జాతీయ

స్ధాయి క్రీడలలో బంగారు పతకాలను పొందిన వారికి రూ.5 లక్షలు, రజత పతాకాలు పొందిన వారికి రూ.3 లక్షలు, కాంస్య పతాకాలు పొందిన వారికి రూ.2 లక్షలు చొప్పున పారితోషికం

అందించుటకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. శ్రీకాకుళం జిల్లాలో జాతీయ, అంతర్జాతీయ స్ధాయి క్రీడాకారుల అనేక మంది ఉన్నారని చెప్పారు.

          రాష్ట్ర

రహదారులు, భవనాల శాఖ మంత్రి ధర్మాన క్రిష్ణదాస్ మాట్లాడుతూ క్రీడాకారులు గెలుపు ఓటములకు ప్రాధాన్యత ఇవ్వకుండా క్రీడలలో పాల్గొనడమే ప్రత్యేక ధ్యేయంగా

ఉండాలన్నారు. శ్రీకాకుళం జిల్లా క్రీడలలో ప్రముఖ స్ధానంలో ఉందన్నారు. క్రీడలకు పుట్టినిల్లు శ్రీకాకుళం అన్నారు. జిల్లా మంచి సాంప్రదాయం, సంస్కృతి, కళలు కలిగిన

జిల్లా అన్నారు. జిల్లా నుండి చక్కని ఆతిధ్యం పొంది మధుర స్మృతులతో వెళ్ళాలని ఆయన ఆకాంక్షించారు. జిల్లాలో కొద్ది రోజులలోనే సి.యం కప్ రాష్ట్ర స్ధాయి వాలీబాల్

ఛాంపియన్ షిప్, సబ్ జూనియర్ బాడ్మింటన్ టోర్నమెంటు, వెటరన్ స్విమ్మింగు ఛాంపియన్ షిప్ పోటీలు నిర్వహించామన్నారు.

  పార్లమెంటు సభ్యులు బెల్లాన చంద్రశేఖర

రావు మాట్లాడుతూ యువతకు, సమాజానికి క్రీడలు, విద్య అవసరమన్నారు.

 à°¶à°¾à°¸à°¨ సభ్యులు గొర్లె కిరణ్ కుమార్ మాట్లాడుతూ క్రీడలు ఎచ్చెర్ల నియోజకవర్గంలో మంచి క్రీడలు

నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు.

జిల్లా కలెక్టర్ జె శ్రీనివాస్ మాట్లాడుతూ క్రీడా స్ఫూర్తి అవసరమన్నారు. క్రీడా ప్రతిభతో చక్కని వాతావరణంలో పాల్గొనాలని

ఆకాంక్షించారు.

విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొ.కూన రాంజీ మాట్లాడుతూ విశ్వవిద్యాలయంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నామని, అందులో భాగంగా

క్రీడలను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నామన్నారు. సౌత్ జోన్ అంతర్ విశ్వవిద్యాలయ ఖోఖోలకు ఆతిధ్యం ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో

విశ్వవిద్యాలయ ఆర్ట్స్, సైన్స్ కళాశాలల ప్రధాన ఆచార్యులు ప్రొ.కామరాజు, ప్రొ.సుజాత, జిల్లా ఒలింపిక్ సంఘం కార్యదర్శి పి.సుందర రావు, వివిధ విశ్వవిద్యాలయాల

అధికారులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Apr 4, 2025

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam