DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆంధ్రా లో ఉన్నది అసమర్థ పాలన, పోలీసు రాజ్యం : కన్నా లక్ష్మీనారాయణ

విజయవాడ, జూన్ : ఆంధ్ర ప్రదేశ్ లో ప్రస్తుతం నడుస్తున్నది చంద్రబాబు నాయుడు అసమర్ధ పాలన, అమలు లో ఉన్నది  à°–ాకీ రాజ్యం అని బీజేపీ ఆంధ్ర ప్రదేశ్ అధ్యక్షులు కన్నా

లక్ష్మీనారాయణ అన్నారు. ఆదివారం అయన విజయవాడ లోని బీజేపీ ప్రధాన కార్యాలయం లో ఆంధ్ర ప్రదేశ్ బీజేపీ అధ్యక్షునిగా పదవి భాద్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా అయన

మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ లో ప్రస్తుతం నడుస్తున్నది అవినీతి, అసమర్ధ పాలన నడుస్తున్నాయని, ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ వ్యవహారం లో కీలకపాత్ర వహిస్తున్నారన్నారు.

మంత్రుల నుంచి, కార్యకర్తల వరకూ అధిక శాతం మంది పూర్తిగా అవినీతి లో మునిగిపోయి ఉన్నారన్నారు. 

న్యాయం చేయాలని కోరుతూ ఎవరైనా బయటకు వస్తే వారిని అధికార

పార్టీ ప్రతినిధులు బెదిరిస్తున్నారని, న్యాయం కోసం పోలీస్ స్టేషన్ కు వెళితే ఫిర్యాదీ మీదే కేసులు పెట్టి ప్రత్యక్ష నరకం చూపిస్తున్న, చంద్రబాబుకు పట్టింపు

లేదన్నారు. పైగా జన్మభూమి కమిటీల పేరుతో ప్రజా ధనాన్ని కార్యకర్తలకు దోచి పెడుతున్నారు, ఈ రాష్ట్రం లో ప్రతిపక్ష పార్టీల ప్రజా ప్రతినిధులకు కనీసం ఎవ్వరూ విలువ

ఇవ్వడం లేదన్నారు. 

తెలుగుదేశం ప్రజాప్రతినిధులు నియోజకవర్గాల వారీగా మట్టి, ఇసుక, భూకబ్జా మాఫియాలకు పాల్పడుతున్నారని, అడ్డు అయిపూ లేకుండా పోతున్నాయని

మండిపడ్డారు. 

ఆంధ్ర రాష్ట్ర అపరిచితుడు మాటలను నమ్మవద్దు. ఆయన చరిత్ర మొత్తం మోసపూరితం, కుట్ర పూరితం, వెన్నుపోటు చరిత్ర ఉన్నవాడు చంద్రబాబేనన్నారు. 

à°ˆ

దేశంలో ఏ రాష్ట్రం అయినా కేంద్రం తమని మోసం చేసిందని చెప్పిందా?  à°…యితే కేంద్రం లో భాగస్వామ్యం లో ఉంటూ చంద్రబాబు ఎన్నో కుట్ర లు చేసి తిరిగి బిజెపి పై బురద

జల్లుతున్నాడు, కనీసం మిత్ర పక్ష ధర్మం కూడా పాటించడం చేతకాని వాడన్నారు. ఇప్పడికే ఒకటి రెండు తప్ప విభజన బిల్లులో చాలా అంశాలను కేంద్రం అమలు

చేసింది

ప్రత్యేక హోదా లో లభించేవాటికన్నా ప్యాకేజీ వల్లే ఎపికి ఎక్కువ మేలు జరిగిందని తెలిపారు. 

సొమ్ము ఒకడిది, సోకు ఒకడిది అన్నట్లుగా కేంద్రం

ఇచ్చే పధకాలు, నిధులు వాడుకుంటూ వాటికి చంద్రబాబు తన పేరు పెట్టుకున్నాడన్నారు. చంద్రన్న భీమా పధకానికి వచ్ఛే నిధులన్నీ  à°•à±‡à°‚ద్రం ఇచ్చేవేనన్నారు. కేంద్రం

ఇచ్చే నిధులు వాడుకుంటూ తిరిగి బీజేపీ పైనే దుష్ప్రచారం చేస్తున్న ఆషాఢ భూతి చంద్రబాబే నన్నారు. 

ఈ నాలుగేళ్లలో పలు పార్టిల మద్య అక్రమ సంబంధాలబు అంటకడుతూ

తమ పబ్బం గడుపుకుంటున్న ఘనత ఇతనికే దక్కుతుందన్నారు. 

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam