DNS Media | Latest News, Breaking News And Update In Telugu

శ్రీకాకుళంలో మొదటిసారి డ్వాక్రా బజార్ ప్రదర్శన

గిరిజన ఉత్పత్తుల ప్రదర్శనకు అనూహ్య స్పందన

(DNS రిపోర్ట్ : SV  à°†à°šà°¾à°°à±à°¯à±à°²à±,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚) : .  .

శ్రీకాకుళం, అక్టోబర్ 06, 2019 (డిఎన్‌ఎస్‌): గిరిజన

ఉత్పత్తుల ప్రదర్శనకు అనూహ్యమైన స్పందన లభించింది. ఈ నెల 4 వ తేదీ నుండి 6వ తేదీ వరకు 3 రోజుల పాటు గిరిజన ఉత్పత్తుల ప్రదర్శన జరిగింది. ఆదివారం ముగిసిన ఈ ప్రదర్శనను

శుక్రవారం స్ధానిక పి.ఎస్.ఎన్.à°Žà°‚.హైస్కూలు మైదానంలో సిక్కోలు డ్వాక్రా బజార్ -2019  à°¨à± రాష్ట్ర రహదారులు భవనాల  à°¶à°¾à°–ామాత్యలు ధర్మాన కృష్ణదాస్, జిల్లా కలెక్టర్

 à°œà±†.నివాస్ తో కలసి  à°ªà±à°°à°¾à°°à°‚భించారు.  à°ˆ ప్రదర్శన 3 రోజుల పాటు సాగింది. ప్రభుత్వం మొట్టమొదటిసారిగా శ్రీకాకుళంలో డ్వాక్రా బజార్ ప్రదర్శనను ఏర్పాటు చేయడం

జరిగింది. డ్వాక్రా సంఘాలు, మెప్మా స్వయంశక్తి సంఘాలు స్వయంగా చేసిన వస్తువులను ప్రదర్సించారు. 38 స్టాల్స్ లో 50 రకాల ఉత్పత్తులు ప్రదర్శనలో వుంచారు. కొర్రలు, సామలు,

రాగులు, జొన్నలు వంటి ఆరోగ్యకరమైన గిరిజన ఉత్పత్తులు ప్రదర్శించారు. మంచి నాణ్యతతోను, పరిశుభ్రతతోను తయారుచేసిన గిరిజన ఉత్పత్తులు  à°¡à±à°µà°¾à°•à±à°°à°¾ బజారులో వుంచారు.

కార్పోరేట్ ఉత్పత్తులకు ధీటుగా ఇవి వున్నాయని ప్రజలు కొనియాడారు. విరివిగా వాటిని కొనుగోలు చేసారు.  à°¸à±à°§à°¾à°¨à°¿à°•à°‚à°—à°¾ దొరికే ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం

కలిగించి, తాము తయారు చేసిన వస్తువులకు మంచి అమ్మకం జరిగినందుకు డ్వాక్రా సంఘాల సభ్యులు చాలా సంతోషించారు. జిల్లాలో ప్రసిధ్ది అయిన పలాస జీడిపప్పు, మందస కోవా,

ఉంగరాడ అప్పడాలు, బుడితి ఇత్తడి సామాన్లు ఈ ప్రదర్శనలో ప్రదర్శించారు. చిన్నయ ఆదివాసీ సంఘం, ఆర్ట్స్ సంస్థ, బెజ్జిపురం యూత్ క్లబ్ వారు తయారు చేసిన వివిధ

వస్తువులను ప్రదర్శించారు. ఇకపై ఇటువంటి ప్రదర్శనలు ప్రతీ ఏటా నిర్వహిస్తే  à°ªà±à°°à°œà°²à°•à± మంచి ఆరోగ్యంతో పాటు గిరిజన ఉత్పత్తులకు ప్రోత్సాహం కలుగుతుంది.

మిల్లెట్లతో వివిధ రకాల తినుబండారులను తయారు చేసి ఫుడ్ కోర్టులో ప్రతీ రోజూ అమ్మకం చేసారు.  à°°à±à°šà°¿à°•à°°à°®à±ˆà°¨, ఆరోగ్యకరమైన తినుబండారాలను ప్రజలకు పరిచయం చేయడం విశేషం.

మంత్రితో పాటు, జిల్లా కలెక్టరు జె.నివాస్ కూడా ఫుడ్ కోర్టులోని ఆహార పదార్ధాలను రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేసారు.  à°†à°¦à°¿à°µà°¾à°°à°‚ సెలవు రోజు కావడంతో ప్రజలు ఎక్కువ

మంది à°ˆ ప్రదర్శనలోని వస్తువులను కొనుగోలు చేసారు.  à°ªà±à°°à°¦à°°à±à°¶à°¨à°²à±‹ పాల్గొన్న సభ్యులందరికీ మెమెంటోలు అందచేసారు. ఇటువంటి ప్రదర్శనల ద్వారా  à°—ిరిజనుల

జీవనప్రమాణాలను మెరుగుపడతాయని ఆశించడంలో అతిశయోక్తి లేదు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam