DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కరువు జిల్లా అనంతను అభివృద్ధి చేయాలని విన్నపం

ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అధఃపాతాళానికి నెట్టిన చంద్రబాబు

▪టీడీపీ హయాంలో ఒక్క ఎకరా ఆయకట్టుకు నీరివ్వలేని దౌర్భాగ్యం

▪హంద్రీనీవాను 10 వేల

క్యూసెక్కులకు వెడల్పు చేయండి

▪సీఎం వైఎస్‌ జగన్‌ను కోరిన ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి

▪అనంతపురం పార్లమెంట్‌ పరిధిలో పరిశ్రమలు

నెలకొల్పండి

â–ª‘అమ్మ à°’à°¡à°¿’తో ప్రతి బిడ్డను అక్కున చేర్చుకుంటున్న వైఎస్‌ జగన్‌

▪120 రోజుల్లోనే సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం

చుట్టాం

â–ª"వైఎస్సార్ à°•à°‚à°Ÿà°¿ వెలుగు" బహిరంగ సభలో ఎమ్మెల్యే అనంత 

(DNS రిపోర్ట్ : మనోహర్, spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ , అనంతపూర్) 

అనంతపురం , అక్టోబర్ 10 , 2019  (DNS ) : చంద్రబాబు

నాయుడు తన ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అధఃపాతాళానికి నెట్టారని అనంతపురం అర్బన్‌ ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి అన్నారు. à°ˆ నేపథ్యంలోనే ప్రజల కష్టాలు

తెలుసుకునేందుకు ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సుదీర్ఘ పాదయాత్ర చేశారని గుర్తు చేశారు. నవరత్నాలతో రాష్ట్రాన్ని సుభిక్షం చేస్తానని

చెప్పిన జగన్‌.. ప్రజల ఆశీర్వాదంతో అధికారంలోకి వచ్చిన 120 రోజుల్లోనే అన్ని పథకాలను ఆచరణలోకి తీసుకొచ్చినట్లు చెప్పారు. అనంతపురంలోని జూనియర్‌ కళాశాల మైదానంలో

‘వైఎస్‌ఆర్‌ à°•à°‚à°Ÿà°¿ వెలుగు’ పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం ప్రారంభించారు. à°ˆ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో అనంతపురం అర్బన్‌

ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి మాట్లాడారు. ముఖ్యమంత్రి అయ్యాక మొదటి సారిగా అనంతపురం జిల్లాకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి జిల్లా ప్రజల తరఫున సాదర స్వాగతం

పలుకుతున్నామని, ‘వైఎస్‌ఆర్‌ à°•à°‚à°Ÿà°¿ వెలుగు’ పథకం à°“ మహత్తర ఘట్టమని అన్నారు. రాష్ట్రంలో 5 కోట్ల మందికి à°•à°‚à°Ÿà°¿ వెలుగు ద్వారా ఆరు దశల్లో పరీక్షలు నిర్వహించి అవసరమైన

వారికి కంటి ఆపరేషర్లు, అద్దాలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. మొదటి, రెండు దశల్లో 70 లక్షల మంది విద్యార్థులకు కంటి పరీక్షలను ప్రభుత్వం నిర్వహించనున్నట్లు

చెప్పారు. వైద్యం ఖరీదైన à°ˆ తరుణంలో à°ˆ పథకం పేదల జీవితాల్లో వెలుగు నింపుతుందని అన్నారు. పేద, మధ్య తరగతి కుటుంబాలకు చదువు భారం కాకుండా ఉండేందుకు త్వరలో ‘అమ్మ

à°’à°¡à°¿’ పథకానికి సీఎం జగన్‌ శ్రీకారం చుట్టనున్నారని, ప్రతి బిడ్డను అక్కున చేర్చుకుంటున్నట్లు చెప్పారు. ఆరోగ్య శ్రీ అందరికీ అందాలన్న లక్ష్యం

మహోన్నతమైనదన్నారు. ఈనెల 15వ తేదీన రైతులకు భరోసా ఇస్తున్నామని, ప్రతి రైతుకు రూ.12500 అందజేయనున్నట్లు తెలిపారు.

టీడీపీ హయాంలో ఒక్క ఎకరాకూ నీరివ్వని

దౌర్భాగ్యం

అనంతపురం అత్యంత వెనుకబడిన జిల్లా అని, వర్షపాతం కూడా తక్కువేనని ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి తెలిపారు. ఈ జిల్లా అన్నా.. ఇక్కడి ప్రజలన్నా

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డికి ఎనలేని ప్రేమ అని అన్నారు. జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు అహర్నిశలు కృషి చేశారని గుర్తు చేశారు. జిల్లాలో 3.50 లక్షల

ఎకరాలకు నీరు అందించడమే కాకుండా అన్ని చెరువులకు నీరివ్వాలన్న లక్ష్యంతో వైఎస్‌ పని చేశారన్నారు. జిల్లాకు 2012 నుంచి కృష్ణా జలాలు వస్తున్నాయని, ఏటా 30 టీఎంసీలకు

పైగా వస్తున్నట్లు తెలిపారు. తెలుగుదేశం పార్టీ హయాంలో ఒక్క ఎకరాకు కూడా నీరివ్వని దౌర్భాగ్య పరిస్థితి ఉండేదన్నారు. జిల్లాకు తుంగభద్ర నీరు వస్తున్నా

సాగునీరు అందించలేకపోయారని విమర్శించారు.  


హంద్రీనీవాను 10 వేల క్యూసెక్కులకు వెడల్పు చేయండి

జిల్లాను సస్యశ్యామలం చేయడం కోసం హంద్రీనీవా కాలువను

10 వేల క్యూసెక్కులకు వెడల్పు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి సభావేదికపై నుంచే కోరారు. à°ˆ విషయంలో

ముఖ్యమంత్రి ఇప్పటికే ఆలోచన చేస్తున్నారని, పనులు త్వరితగతిన చేసేలా చర్యలు తీసుకోవాలని విన్నవించారు. అన్ని చెరువులకు నీరు అందించాలన్నారు.


అనంతపురం

పార్లమెంట్‌ పరిధిలోనూ పరిశ్రమలు నెలకొల్పండి

గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకురావడం ద్వారా ఒక్క అనంతపురం జిల్లాలోనే 10 వేల మందికి పైగా శాశ్వత ఉద్యోగాలు

కల్పించినట్లు ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి తెలిపారు. జిల్లాలో నిరుద్యోగం ఎక్కువగా ఉందని, పరిశ్రమలు తీసుకురావడం ద్వారా నిరుద్యోగ సమస్యను

తీర్చవచ్చన్నారు. బెంగళూరుకు సమీపంలోనే కాకుండా అనంతపురం పార్లమెంట్‌ పరిధిలో కూడా పరిశ్రమలు నెలకొల్పాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కోరారు. అత్యంత

వెనుకబడిన జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని కోరారు.  

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam