DNS Media | Latest News, Breaking News And Update In Telugu

చంద్రబాబు జీవితమంతా తాత్కాలికమే : మంత్రి  బొత్స 

బాబు విశాఖ ప్రెస్ మీట్ పై కౌంటర్ కామేంట్స్

(DNS రిపోర్ట్ : రాజా. పి, spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ , అమరావతి) : . . .
 
అమరావతి , అక్టోబర్ 11 , 2019  (DNS ) :  à°šà°‚ద్రబాబు హయాంలో చేసిన ప్రతి పనీ

తాత్కాలికమేనని, ఆయన జీవితం లో చేసిన ప్రతి పనీ తాత్కాలికంగానే ఉందని రాష్ట్ర మునిసిపల్ శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం విశాఖ లో చంద్రబాబు

చేసిన వ్యాఖ్యలపై ఆయన కౌంటర్ సమాధానం ఇచ్చారు. విశాఖ లో చంద్రబాబు మాట్లాడుతూ కంటి వెలుగు కార్యక్రమాన్ని మేమే తీసుకువచ్చామని, సచివాలయాల వ్యవస్థని మేమే

తీసుకువచ్చాము అంటున్నారు. మీరు తీసుకు వచ్చానన్న సచివాలయానికి ఈ సచివాలయానికి అసలు సంబంధం లేదు అన్నారు. అమరావతి లో కట్టిన టెంపరరీ సచివాలయo లాంటిది కాదు మేము

పెట్టినవి అని, పెట్టిన కార్యక్రమాల్లో ఏమైనా లోటు పాట్లు ఉంటే చెప్పాలి కానీ మేమే à°ˆ పథకాలు పెట్టామంటే ఎలాగా అని ప్రశ్నించారు. 
 
మీ హయాం లో మీ పార్టీకి

చెందిన ఒక్క శాసనసభ్యుని మీదైనా కేసు పెట్టారా ? తప్పు చేస్తే మా mla అని కూడా ఊపేక్షించకుండా కేసు పెట్టారు అని తెలిపారు. 

గత ప్రభుత్వంలో తీసుకున్న అప్పులు

కట్టక పోవటం వలనే ఇప్పుడు బ్యాంక్ లు లోన్లు ఇవ్వటానికి ముందుకు రావడం లేదు. రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయల అప్పులు ఉన్నది నిజం కాదా ? గత ప్రభుత్వానికి

సంబంధించి డిపార్టుమెంట్ల వారీగా ఉన్న అప్పులు బయట పెట్టడానికి సిద్ధం అని తెలిపారు. హుద్ హుద్ తుఫాన్ వచ్చింది ఒకచోట అయితే ఇంకో చోట రికార్డ్ లు మాయం

అయ్యాయన్నారు. ఇదంతా మీ హయాం లో జరిగింది కాదా.  à°¸à°šà°¿à°µà°¾à°²à°¯à°¾à°²à°•à°¿ వైసీపీ రంగులు వేశారు అంటున్నారు..మీరు బహిర్భూమికి వెళ్లే చోట పసుపు రంగులు వేయలేదా  à°…ని

ప్రశ్నించారు. నవరత్నాలు అమలు చేయకూడదు అని శాపనార్థాలు పెట్టె స్థితికి వచ్చారు. సేకరించిన భూమి 32 వేల ఎకరాలు  à°…యితే...వారికి అక్కడ లే అవుట్లు వేయటానికి 30 వేల

కోట్లు ఖర్చు అవుతుంది. ఏమన్నా అంటే జీడీపీ ,పర్ క్యాపిటా తగ్గింది అంటారు. దొంగ లెక్కలు వేస్తే జీడీపీ పర్ కాపిటా పెరుగుతుంది..మేము అలాంటి లెక్కలు వేయమన్నారు.

జే టాక్స్ ఏ రకంగా వసూల్ చేస్తున్నామో చెప్పాలన్నారు. బెల్ట్ షాప్ లు లేకుండా చేసాము..Mrp కంటే ఎక్కువ ఎక్కడ అమ్ముతున్నామో చెప్పాలి. ఆర్థిక వ్యవస్థ బాగోలేదు అని

ఇంటి దగ్గర కూర్చోలేము కదా. అన్నిటినీ సరిగా చూసుకుంటూ అన్ని పథకాలు సక్రమంగా ప్రజలకి అందేలా చూడాలి..అదే ప్రభుత్వ పరిపాలన. అవినీతికి అలవాటు పడిపోయిన టీడీపీ

తిమింగలాలని పట్టుకోవటానికే మా యంత్రాగానికి సగం టైం అయిపోతుందన్నారు. సినిమా చూడమని చిరంజీవి సీఎం ని ఆహ్వానిస్తే తప్పేముంది. గతం లో కూడా చాలామంది సినీ

ప్రముఖులు సీఎం ని కలిసారు కదా అన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam