DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రాజమహేంద్రవరాన్ని అగ్రగామిగా మారుద్దాం: ఎంపీ మార్గాని భరత్

స్మార్ట్ సిటీ జాబితాలో రాజమండ్రికి చోటు      

క్రికెట్, ఇండోర్  à°¸à±à°Ÿà±‡à°¡à°¿à°¯à°‚ లకు à°ˆ ఏడాది శంకుస్థాపన

కంబాల చెర్వు పార్క్ లో అధునాతన మల్టీ   à°•à°²à°°à±

ఫౌంటెన్

టూరిజానికి అగ్ర పీఠం- పర్యాటక కేంద్రంగా హేవలాక్ బ్రిడ్జి

గోదావరి పరిశుభ్రత, రోడ్లు, డ్రైనేజీ à°² మరమ్మత్తు కై చర్యలు  

ఫ్లయ్ ఓవర్

బ్రిడ్జా , బైపాస్ రోడ్డు విస్తరణ అనేది తేల్చాలి

గౌతమి జీవకారుణ్య సంఘాన్ని ఆధునీకరించాలని యోచన  

గోదావరి తీరంలో ఉష్ణోగ్రతలపై అధ్యయనం

చేయిస్తాం

గోదావరిలో ఇసుక మేటల తొలగింపు కోసం ప్రయత్నిస్తా

మీట్ ది ప్రెస్ లో రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl

 à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి): . . . 

అమరావతి,  à°…క్టోబర్ 14, 2019 (డిఎన్‌ఎస్‌) :  à°Žà°¨à±à°¨à°¿à°•à°² సందర్బంగా ఇచ్చిన హామీలను దీర్ఘకాలిక,స్వల్పకాలిక ప్రణాళికలుగా రూపొందించుకుని

వాటి అమలుకోసం కసరత్తు చేస్తున్నామని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ చెప్పారు. టూరిజం హబ్ గా, ఇండస్ట్రియల్ హబ్ గా, సాంస్కృతిక నగరంగా తీర్చిదిద్దడానికి

చర్యలు చేపడ్తున్నామన్నారు.  
క్రికెట్ స్టేడియం ను నిర్మించడానికి గతంలో పరిశీలించిన సెంట్రల్ జైలు స్థలాన్ని పరిశీలిస్తున్నామని,జైలు తరలించి అక్కడ

స్టేడియం నిర్మిస్తే,  à°šà±à°Ÿà±à°Ÿà±‚ కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం కూడా చేపట్టవచ్చని ,దీనివలన ఆదాయ వనరులు వస్తాయని అన్నారు. ఈదిశగా ప్రయత్నాలు

చేస్తున్నామని,అయితే ఫారెస్ట్ ల్యాండ్ ని కూడా పరిశీలిస్తామని à°’à°• ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.  à°°à°¾à°œà°®à°‚డ్రి ఎయిర్ పోర్ట్ ని ఇంటర్ నేషనల్ ఎయిర్ పోర్ట్ à°—à°¾

మలచడానికి కృషిచేస్తున్నామని ఆయన చెబుతూ ప్రస్తుతం ఎయిర్ ట్రాఫిక్ దృష్ట్యా టికెట్ రేట్స్ భారీగా ఉంటున్నాయని,దసరా పండుగల్లో రాజమండ్రి నుంచి హైద్రాబాద్

వెళ్ళడానికి పాతిక వేల రూపాయలు చెల్లించాల్సి వచ్చిందన్నారు. 

    à°•à°‚బాల చెర్వు పార్క్ లో మల్టీ à°•à°²à°°à± ఫౌంటెన్ ఏర్పాటుచేయడం ద్వారా టికెట్ పెట్టి ఆహ్లదకర

వాతావరణం కల్పించాలని భావిస్తున్నామని ఎంపీ భరత్ చెబుతూ రెండు మూడు నెలల్లో కార్యరూపం దాలుస్తుందని సూచించారు. దీనిద్వారా సినిమాలు కూడా వీక్షించవచ్చన్నారు.

రాజమండ్రిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణం చేయడంతో పాటు రోడ్ల పటిష్టానికి చర్యలు తీసుకుంటామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. పర్యాటక రంగానికి అగ్ర

తాంబూలం ఇవ్వాలని యోచిస్తున్నామని ఆయన చెబుతూ ముఖ్యంగా హేవలాక్ బ్రిడ్జిని కార్పొరేషన్ కి బదలాయించే ప్రక్రియపై చర్చించామని అయితే ఇందుకోసమే రైల్వే వారికి

కొవ్వూరులో స్థలం అడిగారని, ఈ విషయమై పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ తో చర్చించామని ఆయన తెలిపారు. వాకింగ్ ట్రాక్ ఏర్పాటుచేసి,గోదావరి లంకను అభివృద్ధి చేయడం

ద్వారా పర్యాటకంగా హేవలాక్ బ్రిడ్జిని అభివృద్ధి చేయాలన్నది ఆలోచనగా చెప్పారు. ఇంపోర్టెడ్ సైకిల్స్ పెడితే వాకింగ్ ట్రాక్ మీదుగా వెళ్తారని

సూచించారు.

   à°°à°¾à°œà°®à°‚డ్రిని స్మార్ట్ సిటీ జాబితాలో చేర్చాలని కోరుతున్నామని ,దీనివలన 500కోట్ల రూపాయల నిధులు వస్తాయని తద్వారా నగరాభివృద్ధి వేగం

పుంజుకుంటుందని ఎంపీ భరత్ చెప్పారు. 

 à°¨à°®à°¾à°®à°¿ à°—à°‚à°— ప్రాజెక్ట్ మాదిరిగా ప్లాస్టిక్ ని , గోదావరిలో వ్యర్ధపదార్ధాలను ఏరివేయడంతో పాటు నీటిని పరిశుభ్రంగా

ఉంచేలా చేయడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాజమండ్రిలో ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరిగిపోవడంపై అధ్యయనం చేయించడంతో పాటు,పిచ్చుకల్లంక పక్కన లంకల్లో ఇసుక

మేటలను తొలగించడానికి కృషిచేయనున్నట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు. ఇసుక మేటలను తొలగిస్తే, నాలుగైదు టిఎంసిల నీళ్లు కూడా నిలువ ఉంటాయని ఆయన అన్నారు.

ఇలా చేస్తే ఉష్ణోగ్రతలు కూడా తగ్గుతాయన్నారు. మోరంపూడి దగ్గర అలాగే వివిధ జంక్షన్స్ లో ఫ్లయ్ ఓవర్ నిర్మాణం చేయాలనీ గతంలో నిర్ణయించారని,అయితే దీనివలన

సాంకేతిక ఇబ్బందులు వస్తున్నాయని ఆయన అన్నారు. అందుకే ఒకే ఫ్లయ్ ఓవర్ à°—à°¾ నిర్మించాలని భావిస్తున్నామని,  à°¦à±€à°¨à°¿à°•à°¿ ఖర్చు ఎక్కువ అవుతుందని అందుకే

ప్రత్యామ్నాయంగా దివాన్ చెరువు దగ్గర బైపాస్ రోడ్డు విస్తరణ చేయడం గురించి దృష్టి పెట్టమని , వీటిలో ఏది ఉత్తమమో పరిశీలించి తగు చర్యలు తీసుకునేలా చూస్తామని

చెప్పారు.

 à°¶à±à°°à±€ గౌతమి జీవకారుణ్య సంఘానికి 14ఎకరాల స్థలం ఉందని అయితే వృద్ధుల శరణాలయం సరిగ్గా లేదని, à°’à°• గోశాల కూడా నడుపుతున్నారని అలాగే గోదావరి గట్టున

అనాధ శరణాయలయం ఉందని ఎంపీ భరత్ చెబుతూ అయితే వీటన్నింటిని ఒకే కాంప్లెక్స్ లో ఉండేలా ఆధునీకరించాలని యోచిస్తున్నామన్నారు. ఎండోమెంట్స్ డిపార్ట్ మెంట్ తో

మాట్లాడుతామని, అవసరమైతే ఎంపీ లాడ్స్ నుంచి నిధులు కేటాయించడంతో పాటు స్వచ్చంద సంస్థల ప్రతినిధుల సహకారం కూడా తీసుకుని పక్కాగా ఎండోమెంట్స్ నిర్వహణలో సాగేలా

చూడాలన్నదే తమ ఆలోచనగా చెప్పారు. ఇక హితకారిణి సమాజాన్ని నన్నయ్య యూనివర్సిటీలో విలీనం చేయాలా, ప్రభుత్వం తీసుకోవాలా అనేదానిపై చర్చిస్తున్నామని ,ఎందుకంటే

హితకారిణి విద్యా సంస్థలలో విద్యా ప్రమాణాల మెరుగుకోసం ఇది అవసరమన్నారు.  à°°à°¾à°œà°®à°‚డ్రి ప్రధాన రేల్వే స్టేషన్ లో భవిష్యత్ అవసరాల దృష్ట్యా  à°ªà±à°²à°¾à°Ÿà± ఫార్మ్స్

సంఖ్య పెంచాలా ,ప్రస్తుతం ఉన్నవి సరిపోతే కమర్షియల్ à°—à°¾ కూడా అభివృద్ధి పరచాలా అనే విషయమై రైల్వే అధికారులతో చర్చిస్తున్నామన్నారు. 

రాజమండ్రి ప్రెస్ క్లబ్

ఆధ్వర్యాన సోమవారం ఏర్పాటుచేసిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కుడుపూడి పార్ధసారధి అధ్యక్షత వహించారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam