DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రైతుకుటుంబాల్లో జీవన వెలుగు రైతు భరోసా 

(DNS రిపోర్ట్ : SV  à°†à°šà°¾à°°à±à°¯à±à°²à±,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ ). .

శ్రీకాకుళం, అక్టోబర్ 15, 2019 (డిఎన్‌ఎస్‌):  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ జిల్లాలో రైతు భరోసా కార్యక్రమం పండగలా

జరిగింది. జిల్లా వ్యాప్తంగా రైతులందరూ ఉత్సాహంగా పాల్గొనగా విజయవంతంగా సాగింది. జిల్లాలో నియోజకవర్గాల వారీగా కార్యక్రమాన్ని భారీ ఎత్తున జిల్లా యంత్రాంగం

చేపట్టింది. జిల్లా స్ధాయి కార్యక్రమాన్ని ఆమదాలవలసలో ఏర్పాటు చేయగా శాసన సభాపతి తమ్మినేని సీతారాం, రాష్ట్ర రహదారులు, భవనాల శాఖా మంత్రి ధర్మాన క్రిష్ణ దాస్, ఇన్

ఛార్జ్ కలెక్టర్ డా.కె. శ్రీనివాసులు హాజరు కాగా, నరసన్నపేట నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమంలోనూ రహదారులు, భవనాల శాఖ మంత్రి క్రిష్ణదాస్ పాల్గొన్నారు. మిగిలిన

నియోజకవర్గాల్లో స్ధానిక శాసన సభ్యులు హాజరయ్యారు. ఆమదాలవలసలో జరిగిన జిల్లా స్ధాయి రైతు భరోసా కార్యక్రమానికి శాసన సభాపతి సీతారాం, మంత్రి క్రిష్ణదాస్ జ్యోతి

ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.దివంగత వై.యస్.రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

శాసన సభాపతి తమ్మినేని సీతారాం

మాట్లాడుతూ రైతు పండగ జరుగుతోందన్నారు. వ్యవసాయం దండగ కాదు పండగ అని ముఖ్యమంత్రి నిరూపితం చేస్తున్నారని చెప్పారు. భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తికి

వ్యవసాయంతోను రైతుతోను సంబంధం ఉందని పేర్కొన్నారు. నిరుపేద నుండి కోటీశ్వరుడు వరకు వ్యవసాయంతో ప్రత్యేకంగా, పరోక్షంగా అనుబందమేనని చెప్పారు. ఉద్యోగులు తమకు

జీతాలు చెల్లించక పోతే ధర్నాలు, సమ్మెలు చేస్తారు లేదా వేరే సంస్థలకు వెళతారు కాని అదే పని రైతన్నలు చేస్తే ప్రపంచమే ఆకలితో అలమటిస్తుందని అన్నారు. రైతన్నను

ఆదుకోవాలని, రైతన్నలను ఆదుకొనుటకు రూ.4 వేల కోట్లు, ధరల స్థిరీకరణకు రూ.3 కోట్లు బడ్జెట్ లోనే కేటాయింపు చేయడం జరిగిందన్నారు. రైతన్న గొప్ప శాస్త్రవేత్త. ఎప్పుడు

దున్నాలి, ఎప్పుడు విత్తనాలు వేయాలో తెలిసిన వ్యక్తి రైతు అన్నారు. పండించే వారు తగ్గుతున్నారు. తినే వారు పెరుగుతున్నారు అన్నారు. ఇది భవిష్యత్తుకు మంచి సంకేతం

కాదని అన్నారు. బావి తరాలకు ఆస్తిగా ఏమి ఇస్తున్నాం అనేది ఆలోచించాల్సిన తరుణమని పిలుపునిచ్చారు. భూ విస్తీర్ణం తగ్గుతుంది. భవనాలు పెరుగుతున్నాయని ఇది సరైన

పరిణామం కాదని శాసన సభాపతి అన్నారు. రానున్న రోజుల్లో వ్యవసాయం చరిత్రలోనే నిలిచిపోయే పరిస్థితి ఏర్పడుతుందని దీనిని ఆవేదన వ్యక్తం చేసారు. వ్యవసాయంను

కొనసాగించాలని తద్వారా జనాభాకు అన్నం వస్తుందని అన్నారు. విద్యలో వ్యవసాయం ఒక అంశంగా ఉండాలని, దీనిని సిఫారసు చేస్తున్నామని, ముఖ్యమంత్రి ఆ ప్రయత్నంలోనే

ఉన్నారని తెలిపారు. తమ్మినేని సీతారాం సభాపతి కాదు. రైతు, రైతు బిడ్డ అన్నారు. రైతు భయబ్రాంతులతో బ్రతుకుతున్నాడు. గిట్టుబాటు ధరలు లేవు, పెట్టుబడులు పెడితే

పెట్టుబడికి తగిన ఉత్పత్తి వస్తుందో లేదో తెలియని స్ధితి, వర్షం ఎప్పుడు కురుస్తుందో తెలీదు, ప్రకృతి వైపరీత్యాలతో ఏ సమయానికి ఏమి జరుగుతుందో తెలియని స్ధితిలో

కొట్టుమిట్టాడుతున్నాడని అన్నారు. రైతుకు ధర రావడం లేదు. మధ్య దళారీలు బాగుపడుతున్నారని చెప్పారు. ప్రతి మండలానికి ఒక గిడ్డండి ఏర్పాటుకు చర్యలు చేపట్టామని

తద్వారా గిట్టుబాటు ధరలు వచ్చే వరకు గిడ్డంగులలో నిల్వ ఉంచవచ్చని ఆయన చెప్పారు. రైతుల స్ధితిగతులు తెలుసుకుని వారికి చేయూతను అందించుటకు ముఖ్య మంత్రి అన్ని

కార్యక్రమాలు చేపడుతున్నారని పేర్కొన్నారు. రైతు భరోసాకు అర్హుల ఎంపిక ప్రక్రియ సులభతరం చేయడం జరిగిందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ రైతు భరోసా అందుతుందని

చెప్పారు. జాబితాలో ఉన్న రైతు మరణిస్తే అతని కుటుంబ సభ్యులకు అందించడం జరుగుతుందని సీతారాం చెప్పారు. కష్టాల్లో ఉన్నరైతు మరణిస్తే రూ.7 లక్షలు నష్టపరిహారం

చెల్లించుటకు ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. గ్రామ సచివాలయాలతో ఉద్యోగాల సునామీ సృష్టించిన రాష్ట్రం మనదేనని ఆయన పేర్కొన్నారు. త్వరలో అనేక ఉద్యోగాలకు

నోటిఫికేషన్ లు రానున్నాయని చెప్పారు. నవరత్నాల కార్యక్రమంలో భాగంగా అమ్మ ఒడి, వెయ్యి విలువ దాటిన వైద్యానికి ఆరోగ్య శ్రీ సౌకర్యం కల్పించడం జరిగిందని

చెప్పారు. మంచి వైద్యం ఎక్కడైనా అందించుటకు రాష్ట్ర ప్రభుత్వం భరోసా కల్పిస్తుందని చెప్పారు. వాలంటీర్లకు వేతనం రూ.5 వేల నుండి రూ.8 వేలకు పెంపు చేస్తున్నారని,

 à°¶à°¾à°¶à±à°µà°¤ ఉద్యోగులు అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఆశా, అంగన్వాడీ, హోమ్ గార్డ్స్ తదితరులకు వేతనాలు పెంచడం జరిగిందని తెలిపారు. అర్హత ఆధారంగానే

లబ్ధిదారులను ఎంపిక చేయడం జరుగుతుందని తెలియజేస్తూ వై. యస్. ఆర్ వాహన మిత్ర, వై. యస్.ఆర్ రైతు భరోసా ఏ పథకం అయినా నిజమైన లబ్ధిదారులకు వర్తిస్తుందని చెప్పారు.

సచివాలయంలో కొత్తగా ఉద్యోగులు చేరారని వారితో పాటు ఇప్పటికే పనిచేస్తున్న ఉద్యోగులకు సహకరించాలని,దురుసుగా ప్రవర్తించవద్దు అని ప్రజలకు పిలుపునిచ్చారు.

ప్రభుత్వ యంత్రాంగం కూడా సమస్య పరిష్కారానికి సహకరించాలని ఉద్యోగులకు హితవు పలికారు. ఆమదాలవలస నియోజకవర్గంలో రైతు భరోసా క్రింద 24,254 మందికి రూ.74.12 కోట్లు పంపిణీ

జరిగిందని అన్నారు.

రాష్ట్ర రహదారులు, భవనాల శాఖా మంత్రి ధర్మాన క్రిష్ణ దాస్ మాట్లాడుతూ వై యస్ ఆర్ ఆలోచనలకు అనుగుణంగా ముఖ్యమంత్రి జగన్ రైతులకు అండగా

ఉన్నారన్నారు. 63 శాతం పైగా జనాభా వ్యవసాయం పై ఆధారపడి ఉన్నారని చెప్పారు. వ్యవసాయాన్ని ఆదుకుంటేనే జనాభాకు అండగా ఉండగలమనే విశ్వాసంతో ముఖ్య మంత్రి మంచి

కార్యక్రమాలను అమలు చేస్తున్నారని తెలిపారు. రూ.67,500 ఏడాదికి అందించే కార్యక్రమం రైతు భరోసా అన్నారు. ప్రతి ఏటా రూ.13,500 అందించే కార్యక్రమంమని, మొదటి విడతగా ఖరీఫ్

పంటకు ఉపయోగపడే విధంగా రూ.7,500, రబీ సమయంలో రూ.4 వేలు, పంట ఇంటికి చేరే సమయంలో జనవరి నెలలో రూ.2 వేలు చొప్పున పంపిణీ చేయుటకు నిర్ణయించడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి

జగన్ కు జగనే సాటి అన్నారు. ప్రజల మనోభావాలు, ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన సాగిస్తున్నారని చెప్పారు. నాలుగు నెలల్లో 4 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసిన ఘనత జగన్ ది

అన్నారు. రూ.3 వేల కోట్లతో రైతులను ఆదుకునేందుకు ప్రత్యేక నిధి ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.

జాయింట్ కలెక్టర్ à°¡à°¾. కె. శ్రీనివాసులు  à°®à°¾à°Ÿà±à°²à°¾à°¡à±à°¤à±‚

అర్హులైన అందరికి రైతు భరోసా అందుతుందన్నారు. గ్రామాల్లో అర్హులు, అనర్హుల జాబితాలను స్పష్టంగా ప్రదర్శించామన్నారు. అర్హుల ఎంపిక కార్యక్రమం నవంబర్ 15వ తేదీ

వరకు జరుగుతుందని అన్నారు. జిల్లాలో 2.57 లక్షల కుటుంబాలకు రూ.207 కోట్లను రైతు భరోసాగా పంపిణీ చేయడం జరుగుతుందని వివరించారు. రైతులు సహాయ సహకారాలు అందించి అర్హులైన

ప్రతి ఒక్కరికి అందేటట్లు తోడ్పడాలని కోరారు. ఉగాది నాటికి ఇళ్ల స్థలాలకు అర్హులైన జాబితాను సైతం గ్రామాల్లో ప్రదర్శించామని వాటిని పరిశీలించి తప్పొప్పులు

తెలియజేయాలని కోరారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - Apr 4, 2025

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam