DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రాష్ట్రంలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు స్థాపన

చోడవరం రైతు భరోసా లో మంత్రి భరోసా. . .  

పర్యాటక శాఖ మంత్రి ఎం శ్రీనివాసరావు

(DNS రిపోర్ట్ : సత్య గణేష్, స్టాఫ్ రిపోర్టర్,  à°µà°¿à°¶à°¾à°–పట్నం) : .  . .

విశాఖపట్నం,

అక్టోబర్ 14, 2019 (డిఎన్‌ఎస్‌): విశాఖపట్నం  à°œà°¿à°²à±à°²à°¾à°²à±‹ 2 లక్షల 77వేల 651 రైతు కుటుంబాలకు రూ.222.41 కోట్లను రైతు భరోసా క్రింద ఇస్తున్నట్లు పర్యాటక క్రీడలు యువజన సర్వీసుల శాఖ

మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు. మంగళవారం చోడవరంలో ఏర్పాటు చేసిన రైతు భరోసా సభను ఆయన జ్యోతి వెలిగించి ప్రారంభించారు. మాడుగుల, చోడవరం నియోజక

వర్గాలలో ఎస్సి జడ్ ఏర్పాటుచేసి వ్యవసాయ ఆధారిత పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తామన్నారు.  à°®à±à°–్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రలో  à°°à±ˆà°¤à±à°² కష్టాలను

స్వయంగా చూసి నందున రైతు భరోసా గా రూ.13500 లను అందిస్తున్నారు అన్నారు. ఈ సొమ్ము మొత్తం సంక్రాంతి నాటికి అందరికీ పూర్తిగా వారి ఖాతాలో జమ అవుతుందని తెలిపారు.

రైతులందరికీ గిట్టుబాటు ధర ను కల్పించారని, ఆత్మహత్య చేసుకున్న రైతులకు పరిహారం ఏడు లక్షలకు పెంచారని, నియోజకవర్గానికి ఒక రిగ్గును మంజూరు చేసి అడిగిన

వారందరికీ బోరు వేస్తున్నారని చెప్పారు. రూ.175 కోట్ల నష్టం తో ఉన్న గోవాడ చక్కెర కర్మాగారానికి త్వరలోనే నిధులు మంజూరు చేస్తారని చెప్పారు. కళ్యాణపు లోవ

అభివృద్ధికి రూ. 25 లక్షలు, కొండసంత, కొమరవోలు రిజర్వాయర్లు పూర్తి చేస్తామని చెప్పారు.

జాయింట్ కలెక్టర్ ఎల్ శివ శంకర్ మాట్లాడుతూ జిల్లాలో అర్హతగల ప్రతి

రైతుకి రైతు భరోసా అందుతుందన్నారు. సగం మందికి మాత్రమే భరోసా అందుతుందని చెప్పడం నిజం కాదని, నిన్నటి రోజు కి అన్ని అర్హతలు కలిగి, ప్రజాసాధికారిక సర్వే, వెబ్

ల్యాండ్ లలో భూమి, ఖాతా, లబ్ధిదారుడు రిజిస్టరై ఉన్నవారికి ఈ రోజు ఖాతాలో సొమ్ము జమ అవుతుంది అన్నారు. మిగిలినవారికి లోపాలను సరిదిద్దిన తరువాత భరోసా సొమ్ము

పూర్తిగా జమ అవుతుందని వివరించారు.  à°¸à°°à±à°µà±‡à°²à±‹, రికార్డులలో నమోదు కావడం లో ఉన్న లోపాలను సరిదిద్దేందుకే కొంత గడువు ఇవ్వడం జరిగిందన్నారు. అర్హులైన వారికి

వ్యవసాయ శాఖ, రెవెన్యూ అధికారులు పూర్తి సహాయ సహకారాలు అందించడం జరుగుతుందన్నారు. మన రాష్ట్రంలో మాత్రమే సాగు దారులకు రైతు భరోసా ఇస్తున్నట్లు వెల్లడించారు.

మొదటిసారిగా లబ్ధి పొందుతున్న వారికి 7500, పాత వారికి 11500, ఆర్ ఓ ఎఫ్ ఆర్ పట్టా వారికి 9500 మొదట ఖాతాలో నమోదు కాబడతాయని, తరువాత మిగిలిన సొమ్ము జమ చేయబడుతుందని

చెప్పారు.

సభకు అధ్యక్షత వహించిన చోడవరం శాసనసభ్యులు కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమాజంలోని అన్ని వర్గాల వారికి మేలు చేసే

విధంగా నవరత్నాలను ప్రకటించడమే కాకుండా రికార్డు సమయంలో వాటిని అమలు చేస్తున్నట్లు వివరించారు. ఇచ్చిన హామీల లో 95% నాలుగు నెలల్లోనే పూర్తి చేశారని, ఎవరూ ఎక్కడా

ఊహించనంతగా నాలుగు లక్షల ఉద్యోగాలను కల్పించారని, అనుభవం కంటే మనసుంటే మనుషులకు ఏమైనా చేయొచ్చని జగన్మోహన్ రెడ్డి నిరూపించారు అన్నారు. వి ఎం ఆర్ డి ఏ చైర్మన్

ద్రోణంరాజు శ్రీనివాస్ మాట్లాడుతూ పేదవాడి గుండె చప్పుడు తెలిసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. పార్లమెంటు సభ్యురాలు డా బీవీ సత్యవతి.

మాట్లాడుతూ వ్యవసాయాన్ని లాభసాటిగా చేసేందుకు కృషి చేయాలన్నారు. ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని మండలానికి ఒక శీతల గిడ్డంగి ఏర్పాటు చేయాలని

కోరారు.  à°°à±ˆà°¤à± భరోసా పొందిన రావికమతం మండలం కళ్యాణ లోవ గ్రామ గిరిజన రైతు వంజరి గంగరాజు, చోడవరం మండలం లక్ష్మీపురం రైతు భూతనాథం రామారావు ఆనందం వ్యక్తం  à°šà±‡à°¸à±à°¤à±‚

ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేశారు. తరువాత మంత్రి రైతు భరోసా చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ ప్రతిష్ట మాజీ మంత్రి దాడి

వీరభద్రరావు పాయకరావు పేట శాసనసభ్యులు గొల్ల బాబురావు మంత్రి రాజశేఖర్ వ్యవసాయ శాఖ జె.డి. మల్లికార్జున రావు, ఆర్డి వో సీతారామారావు తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam