DNS Media | Latest News, Breaking News And Update In Telugu

చంద్రబాబుకు దేవుడంటే నమ్మకం, భక్తి లేదు. . .

భూములు, ఆస్తులు దోచాడు, ఆలయాలు కూల్చాడు  

టిడిపి హయాంలో కూల్చిన ఆలయాలను పుననిర్మిస్తాం.

భక్తుడు దేవుడికి ఇచ్చిన భూములను

పరిరక్షిస్తాం.

దేవదాయ ధర్మదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస రావు.

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి): . . . 

అమరావతి,  à°…క్టోబర్ 18, 2019

(డిఎన్‌ఎస్‌) : చంద్రబాబు నాయుడు నిబంధనలకు విరుద్ధంగా తన బినామీలకు ఇచ్చిన భూముల లీజును రద్దు చేస్తామని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు

పేర్కొన్నారు. శుక్రువారం వన్ టౌన్ బ్రాహ్మణ విది జమ్మిచెట్టు వద్దనున్న దేవదాయ శాఖ కార్యాలయ సముదాయంలో మంత్రి అధ్యక్షతన దేవదాయ శాఖ ఉన్నత అధికారుల సమావేశం

జరిగింది, ఈ సమావేశంలో దేవదాయ శాఖ కమిషనర్ పద్మ, అదనపు కమిషనర్లు (ఎ డిసి వన్, టూ) చంద్ర కుమార్, రామ చంద్ర మోహన్ మరియు ఎస్టేట్ అధికారి ఆజాద్ అర్ జే సిలు వన్, టూ పూర్ణ

చంద్ర రావు, బ్రమరాంబ డిప్యూటీ కమిషనర్లు మరియు పదమూడు జిల్లాల సహాయ కమిషనర్లు పాల్గొన్నారు.ఈ సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ..

వై యస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు ప్రభుత్వం చిత్తశుద్ది తో పని చేస్తుందన్నారు. దేవదాయ శాఖ లో రాజకీయాలకు తావు లేకుండా

పారదర్శక పాలన సాగిస్తున్నమన్నరు, భక్తులు, పూర్వీకులు మంచి అసయం తో దేవుడికి దూప దీప నైవేద్య నిమిత్తం ఇచ్చిన భూములను పరిరక్షిస్తామన్నరు, దేవ దాయ భూముల

పరిరక్షణ కోసం దేవాలయాల అభివృద్ది కి, పరిశుభ్రత కు ప్రాధాన్యత ఇస్తూ అధికారులకు ఆదేశాలు ఇవ్వటం జరిగిందన్నారు. దేవదాయా భూము లు అన్యాక్రాంతం కాకుండా చర్యలు

చేపట్టడం ప్రజల్లో ఉన్న అపోహలు తొలగించటం, అదేవిధంగా రాజకీయ ఒత్తిళ్ళకు లోను కాకుండా పని చేయాలన్నారు, దేవదయ భూములు పరిరక్షణకు పోలీసు వారి సహాయం తీసుకుంటామని

ఒక ఐపిఎస్ స్థాయి ఉన్నత అధికారిణి భూముల పరిరక్షణ కమిటీలో నియమించమని ముఖ్యమంత్రి గారిని కొరతామన్నరు. చరిత్ర లో ఎన్నడూ లేని విధంగా దేవాదాయ శాఖ కు దూప దీప

నైవేద్య నిమిత్తం బడ్జెట్ లో 234 కోట్ల రూ ను కేటాయించటం జరిగిందని గుర్తు చేశారు, త్వరలో దేవధాయ శాఖ లో ఉద్యో గాలను భర్తీ చేస్తామన్నారు. నవంబర్ ఒకటి నుంచి డిసెంబర్

ఆకరి వరకు 13 జిల్లాల లోని జిల్లాల వారీగా దేవాలయాల అభివృద్ది పై దేవాలయ భూముల పరిరక్షణ చర్యల పై సమీక్ష సమావేశం నిర్వహిస్తామన్నారు, అర్చకులకు ఇళ్ళు నిర్మించి

ఇవ్వాలని సిఎం జగన్ మోహన్ రెడ్డి గారు నిర్ణయించారని అందుకు అనుగుణంగా దేవదాయ శాఖ సర్వే చేపట్టిందన్నారు, ప్రతి భక్తుడికి దేవాలయాల్లో సౌకర్యం ఉండే విధంగా గా

చర్యలు చేపడతాం అన్నారు.

గత టిడిపి ప్రభుత్వం అడ్డ గొలుగా ఇచ్చిన జీవోలను రద్దు చేస్తాం అన్నారు, ఇందుకు ఉదాహరణ గా కృష్ణా జిల్లా సూరయ్య పాలెం లో పది ఎకరాల

దేవాలయ భూములను నిబంధనలకు విరుద్ధం గా బాబు బినామీలకు దారా దత్తం చేశారన్నారు, ఇటువంటి నిబంధనలకు విరుద్దం గా బాబు బినామీలకు ఇచ్చిన లిజులను రద్దు

చేస్తామన్నారు.
టిడిపి హయాంలో కూల్చిన దేవాలయాలను పుణ నిర్మిస్తామని తెలిపారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam