DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పోలీసులు - ప్రజల మధ్య సహకారం పెరగాలి : డిజిపి సవాంగ్ 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి) 

అమరావతి,  à°…క్టోబర్ 19, 2019 (డిఎన్‌ఎస్‌) : చాలా దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌

తెలిపారు. పోలీసులు, ప్రజల మధ్య సహకారం ఇంకా పెరగాలని ఆకాంక్షించారు. ఇటీవల పోలీసులపై ఓ రాజకీయ పార్టీ చేసిన ఆరోపణలపై తాము స్పందించబోమని తెలిపారు. విజయవాడలో

ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... తెదేపాకి చెందిన ఎమ్మెల్యేలు వచ్చిన సమయంలో ఇతర కార్యక్రమాల్లో ఉండటం వల్ల వారిని కలవలేకపోయానన్నారు. అయినా

వారిచ్చిన ఫిర్యాదు.. మీడియాతో పాటు సామాజిక మీడియా ద్వారా తన వద్దకు ముందే వచ్చిందని వెల్లడించారు.  à°¤à°¾à°¨à± వినయపూర్వకమైన à°“ ప్రభుత్వ ఉద్యోగిని మాత్రమేనని, తనకు

తెలిసిందల్లా ఉద్యోగిగా ప్రజలకు సేవ చేయడమేనని డీజీపీ వ్యాఖ్యానించారు. రాజకీయ ఆరోపణలతో తనకు సంబంధం లేదని, అందులో తనకు పాత్ర కూడా లేదని గౌతమ్‌ సవాంగ్‌

స్పష్టంచేశారు.

ప్రజా సేవ కోసమే పోలీసులు
అక్టోబర్ 21వ తేదీ పోలీసు సంస్మరణ దినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు

నిర్వహించినట్టు చెప్పారు.  à°°à°¹à°¦à°¾à°°à°¿ భద్రత, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, పోలీసులు వినియోగించే ఆయుధాల ప్రదర్శన చేశామన్నారు. ప్రదర్శనను తిలకించేందుకు మొత్తం 2,511

పాఠశాలల నుంచి 1.84 లక్షల విద్యార్థులు వచ్చారని, 10583 యూనిట్ల రక్తాన్ని పోలీసులు దానం చేశారని సవాంగ్‌ తెలిపారు.  à°ªà±à°°à°œà°¾ సేవకోసమే పోలీసులు ఉన్నారనే విషయాన్ని అంతా

గుర్తించాలన్నారు. పోలీసు సంస్మరణ దినాన్ని ఈ నెల 21న విజయవాడ ఇందిరా గాంధీ స్టేడియంలో నిర్వహించబోతున్నట్లు తెలిపారు. సీఎం వైఎస్ జగన్ ఈ కార్యక్రమనికి

హాజరవుతారని చెప్పారు.

పోలీస్, హోమ్ గార్డులకు నైపుణ్యం పెంచేందుకు స్కిల్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ సహకారాన్ని తీసుకుంటున్నట్లు సవాంగ్‌ తెలిపారు.

పోలీసుల శారీరక దారుఢ్యాన్ని కొనసాగించేలా త్వరలోనే హెల్త్ మేనేజ్‌మెంట్ సిస్టంను తీసుకొస్తామన్నారు. ప్రభుత్వం ప్రారంభించిన స్పందన కార్యక్రమం బాగుందని,

ఇప్పటి వరకు 14 స్పందన కార్యక్రమాలు జరిగాయని తెలిపారు. ఇందులో 37 వేల 773 ఫిర్యాదులు వస్తే 31, 119 పరిష్కరించామని, 7442 ఫిర్యాదులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని అన్నారు.


Latest Job Notifications

Panchangam - Dec 3, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam