DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జాతీయ బ్యాంకు ల్లో ప్రత్యేక రుణ సదుపాయ మేళా

24 నుంచి రెండు రోజుల పాటు అవగాహనా   

ఆంధ్రా బ్యాంకు జోనల్ మేనేజర్ పి.కృష్ణయ్య 

(DNS రిపోర్ట్ : SV  à°†à°šà°¾à°°à±à°¯à±à°²à±,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚): .

.

శ్రీకాకుళం, అక్టోబర్ 20, 2019 (డిఎన్‌ఎస్‌): కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు à°ˆ నెల 24 మరియు 25 తేదీలలో శ్రీకాకుళం జిల్లాలో ప్రత్యేక రుణ సదుపాయ సమావేశాలను

ఏర్పాటుచేస్తున్నట్లు జిల్లా బ్యాంకుల సమన్వయ కమిటీ కన్వీనర్ మరియు ఆంధ్రాబ్యాంకు జోనల్ మేనేజర్ పి.కృష్ణయ్య పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఆంధ్రా బ్యాంకు

జోనల్ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని అన్ని బ్యాంకుల సహకారంతో వ్యవసాయ మరియు వ్యవసాయ అనుబంధ

రంగాలకు రూ. 113.54 కోట్ల రుణాలను,  à°¸à±‚క్ష్మ, లఘు, చిన్న తరహా పరిశ్రమల రంగాలకు రూ.61.85 కోట్లు, రిటైల్ రంగాలకు రూ. 122.13 కోట్లు, ఇతర రంగాలలో రూ.61.85 కోట్ల రుణాలను ఇచ్చేందుకు సిద్ధం

చేయడం జరిగిందని వివరించారు. à°ˆ కార్యక్రమంలో జిల్లాలోని  à°œà°¾à°¤à±€à°¯ బ్యాంకులతో పాటు ప్రైవేటు బ్యాంకులు కలిపి మొత్తం 35 బ్యాంకులు పాల్గొని రుణాలను

మంజూరుచేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ నెల 1వ తేదీ నుండి ప్రత్యేక రుణ సదుపాయాల కల్పన ప్రారంభించడం జరిగిందని, ఇప్పటివరకు మంజూరుచేసిన వాటితో పాటు 24,25 తేదీల్లో

దరఖాస్తు చేసుకున్న వారికి కూడా రుణాలను మంజూరుచేయనున్నట్లు ఆయన తెలిపారు. ఇందుకు అన్ని బ్యాంకులు సంసిద్ధంగా ఉన్నాయని అన్నారు. 
    à°ˆ నెల 24à°¨ శ్రీకాకుళం సన్

రైజ్ హోటల్ నందు మరియు 25న పలాసలోని యస్.యం.సి ఫంక్షన్ హాలు నందు రుణ సదుపాయాల సదస్సులను ఏర్పాటుచేస్తున్నామని, దీనికి జిల్లా కలెక్టర్ గారు ముఖ్యఅతిథిగా

పాల్గొంటారని ఆయన వివరించారు. రుణ సదుపాయాల సదస్సులో వివిధ బ్యాంకుల స్టాళ్లు ఉంటాయని, ఖాతాదారుల అభిరుచి మేరకు వారికి నచ్చిన బ్యాంకుల నుండి రుణాన్ని

పొందవచ్చన్నారు. ఖాతాదారుల సేవా మహోత్సవాల నిర్వహణలో భాగంగా అన్నిరకాల వస్తు, వాహన, వ్యవసాయ, విద్యా, సూక్ష్మ, లఘు, చిన్న తరహా పరిశ్రమలకు, స్వయం శక్తి మహిళా సంఘాలకు ,

పిఎంజెడివై ఓవర్ డ్రాఫ్ట్ మరియు ముద్ర రుణాలను అందించడం జరుగుతుందని ఆయన స్పష్టం చేసారు. కావున అన్ని వర్గాల ఖాతాదారులు , ప్రజలు వారి అర్హతల మేరకు రుణ సదుపాయాలను

పొందాలని ఆయన పిలుపునిచ్చారు. 
    à°à°ªà°¿à°œà°¿à°µà°¿à°¬à°¿ రీజనల్ మేనేజర్ గురునాథరావు మాట్లాడుతూ తమ బ్యాంకుకు సంబంధించి జిల్లాలో 94 బ్రాంచ్ లు ఉన్నాయని, వీటిద్వారా సుమారు 60

కోట్ల రుణాలను మంజూరుచేయనున్నామని పేర్కొన్నారు. ఏ  à°¬à±à°°à°¾à°‚చ్ లోనైనా రుణాలను ఇచ్చేందుకు నిరాకరించినట్లయితే తమ దృష్టికి తీసుకురావాలని, తక్షణమే రుణాలను

మంజూరుచేయడం జరుగుతుందని వివరించారు. 
    à°¯à°¸à±.బి.ఐ చీఫ్ మేనేజర్ జి.వి.సుబ్బారావు మాట్లాడుతూ జిల్లాలో 65 శాఖలు పనిచేస్తున్నాయని, వీటిద్వారా 40 కోట్ల రుణాలను

మంజూరుచేయనున్నట్లు తెలిపారు. అలాగే డిసిసిబి ఆధ్వర్యంలోని 19 శాఖల ద్వారా రూ.3.50 కోట్ల రుణాలను, కెనరా బ్యాంకుకు సంబంధించి 11 శాఖల ద్వారా రూ.20 కోట్ల రుణాలను

మంజూరుచేయనున్నట్లు తెలిపారు. రుణాల కొరకు వచ్చేవారి సంఖ్య అధికంగా ఉంటే అదనంగా రుణాలను మంజూరుచేయడం జరుగుతుందని బ్యాంకు అధికారులు స్పష్టం చేసారు. కావున

జిల్లా ప్రజలు à°ˆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బ్యాంకు అధికారులు à°ˆ సందర్భంగా కోరారు. 
    à°ˆ సమావేశంలో ఆంధ్రా బ్యాంక్ ఏజిఎం కె.వెంకటరాజు, లీడ్ బ్యాంకు

మేనేజర్ బి.వి.బి.డి. హరిప్రసాద్, ఆర్ సేటి డైరక్టర్ యస్.బి.శ్రీనివాస్, డిసిసిబి ముఖ్యకార్యనిర్వహణ అధికారి సత్యనారాయణ, కెనరా బ్యాంకు మేనేజర్ రూపేశ్, ఇండియన్

బ్యాంక్ మేనేజర్ రాజేంద్రప్రసాద్,  à°…లహాబాద్ బ్యాంకు మేనేజర్ రామారావు, బ్యాంక్ ఆఫ్ బరోడా మేనేజర్ శాంతారాజ్, జిల్లాలోని అన్ని బ్యాంకుల మేనేజర్లు, అధికారులు

తదితరులు పాల్గొన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam