DNS Media | Latest News, Breaking News And Update In Telugu

శ్రీకూర్మం, పొగిరి గ్రామాలకు జాతీయ పురస్కారాలు

జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవ వేడుకలు  

దేశ రాజధాని ఢిల్లీలో అవార్డుల ప్రధానోత్సవం

శ్రీకూర్మం కు నానాజీ దేఖ్ ముఖ్, పొగిరి కు దీన్ దయాళ్ అవార్డు

 

(DNS రిపోర్ట్ : SV  à°†à°šà°¾à°°à±à°¯à±à°²à±,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ ). .

శ్రీకాకుళం, అక్టోబర్ 22, 2019 (డిఎన్‌ఎస్‌): శ్రీకాకుళం జిల్లాలోని రాజాం మండలం పొగిరి గ్రామ

పంచాయతీక, గార మండలం శ్రీకూర్మం గ్రామ పంచాయతీ జాతీయ స్ధాయి అవార్డులకు ఎంపికయ్యాయి. ఈ నెల 23వ తేదీన న్యూఢిల్లీలో జరగనున్న పంచాయతీరాజ్ దినోత్సవ వేడుకల్లో

గ్రామ పంచాయతీ కార్యదర్శులు ఈ అవార్డులను స్వీకరించనున్నారు. కేంద్ర ప్రభుత్వ పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సశక్తికరణ్ పురస్కార్,

నానాజీ దేఖ్ ముఖ్ రాష్ట్రీయ గౌరవ్ గ్రామ సభ పురస్కార్, చైల్డ్ ఫ్రేండ్లీ గ్రామ పంచాయత్ అవార్డులకు గ్రామ పంచాయతీలను ఎంపిక చేస్తుంది. ఇందులో భాగంగా 2019

సంవత్సరానికి పొగిరి గ్రామ పంచాయతీని దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సశక్తికరణ్ పురస్కార్ కు ఎంపిక చేయగా, నానాజీ దేఖ్ ముఖ్ రాష్ట్రీయ గౌరవ్ గ్రామ సభ పురస్కార్ కు

శ్రీకూర్మం పంచాయతీని ఎంపిక చేసింది. 2017-18 సంవత్సరాన్ని ఆధార సంవత్సరంగా తీసుకుని ఆ సంవత్సరంలో గ్రామ పంచాయతీలు చేపట్టిన పనులను విశ్లేషించి పురస్కారాలకు ఎంపిక

చేసింది. పొగిరి పంచాయతీని పారిశుధ్య నిర్వహణ, చెత్త నుండి సంపద తయారీ కేంద్రం నిర్వహణ, మరుగుదొడ్ల నిర్మాణం వంటి స్వచ్ఛత అంశాలను పరిగణనలోనికి తీసుకుని ఆ

విభాగంలో అందించే దీన్ దయాళ్ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపిక చేయగా., ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా నిర్ధేశిత తేదీల్లో గ్రామ సభలను నిర్వహించడమే కాకుండా

అర్ధవంతమైన చర్చలు నిర్వహించి గ్రామ పంచాయతీ అభివృద్ధికి బాటలు వేయడం, మహాత్మా గాంధీ కలలుగన్నగ్రామ స్వరాజ్యం సాధించే దిశగా అడుగులు వేయడానికి కృషి

చేస్తున్నందుకు అందించే నానాజీ దేఖ్ ముఖ్ రాష్ట్రీయ గౌరవ్ పురస్కార్ కు ఎంపికైంది. దీన్ దయాళ్ ఉపాధ్యాయ అవార్డుకు రాష్ట్రం నుండి 11 గ్రామ పంచాయతీలు ఎంపిక కాగా

అందులో పారిశుధ్య నిర్వహణలో 4 గ్రామ పంచాయతీలు ఎంపికయ్యాయి. నానాజీ దేశ్ ముఖ్ అవార్డుకు రాష్ట్రంలో ఎంపికైన ఏకైక గ్రామ పంచాయతీ శ్రీకూర్మం కావడం విశేషం. పొగిరి

పంచాయతీ పారిశుధ్యంపై పెద్ద ఎత్తున చర్యలు చేపట్టడమే కాకుండా చెత్త నుండి సంపద తయారీ కేంద్రంలో గ్రామ, మండల, జిల్లా స్ధాయి వరకు అధికారులు, సిబ్బందికి శిక్షణా

కార్యక్రమాలు, క్షేత్ర స్ధాయి పర్యటనలకు అవకాశం కల్పించింది. ఇంటింటా చెత్త సేకరణచేస్తూ చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని ప్రశంసా పూర్వకంగా నిర్వహించడం

జరిగింది. గ్రామ పంచాయతీలో సి.సి రహదారుల నిర్మాణం, మరుగుదొడ్ల నిర్మాణం, వినియోగంలో ప్రత్యేక శ్రద్ధ వహించడం జరిగింది.

          నానాజీ దేశ్ ముఖ్ అవార్డుకు

ఎంపికైన శ్రీకూర్మం పంచాయతీ ప్రభుత్వం నిర్ధేశించిన ప్రకారం జనవరి 2, ఏప్రిల్ 14, జూలై 1, అక్టోబరు 3వ తేదీలలో విధిగా గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుంది. గ్రామ సభలను

నిర్ధేశిత తేదీలలో పక్కాగా నిర్వహించమే కాకుండా గ్రామ పంచాయతీకి అవసరమయ్యే అంశాలపై ప్రత్యేక సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది. గ్రామ సభల్లో గ్రామ

పంచాయతీకి విడుదలైన 14వ ఆర్ధిక సంఘం నిధులతోపాటు ఇతర నిధులపై చర్చించి వాటిని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు పక్కాగా వినియోగించకొనుటకు అవసరమైన ప్రణాళికలను

రూపొందించుకోవడం జరుగుతుంది. ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను ఉపయోగించుకుంటూ గ్రామ స్వరాజ్యం దిశగా అడుగులు వేయుటకు ఆర్ధికంగా ప్రగతి సాధించే ఉద్దేశ్యంతో

ఇంటి పన్ను, మార్కెట్ ఆశీల్ల వసూలులో ప్రత్యేక చొరవ కనబరచడం, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధీ హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకుని గ్రామ పంచాయతీలో ప్రజోపయోగపనులను

చేపట్టడమేకాకుండా ఎక్కువ మందికి పని దినాలు  à°•à°²à±à°ªà°¿à°‚à°šà°¡à°‚ వంటి చర్యలు చేపట్టడం జరిగింది. పంచాయతీలో ప్రజలకు ప్రభుత్వం అందించే గృహ వసతి, రేషన్ కార్డులు, విద్య,

వైద్యం, పౌష్టికాహారం, పి.యం కిసాన్ యోజన, పి.యం ఆవాస్ యోజన, పి.యం ఉజ్జ్వల్ యోజన వంటి ప్రాథమిక అంశాలు అందేవిధంగా సభల్లో చర్చించి ఆదర్శంగా నిలిచింది. స్వచ్ఛతా

కార్యక్రమాలు చేపట్టడం, ప్లాస్టిక్ నిర్మూలన దిశగా అడుగులు వేయడం ఇందుకు దోహదం చేసింది. ఎస్.సి,ఎస్.à°Ÿà°¿ వర్గాల అభ్యున్నతికి బాటలు వేసింది.  à°ˆ అంశాలను పరిగణనలోకి

తీసుకుని కేంద్ర బృందం నిశితంగా పరిశీలించి అవార్డులకు గ్రామ పంచాయతీలను ఎంపిక చేసింది.
         à°œà°¿à°²à±à°²à°¾à°•à± చెందిన పొగిరి, శ్రీకూర్మం గ్రామ పంచాయతీలు జాతీయ

స్ధాయి అవార్డులకు ఎంపికైనందుకు జిల్లా కలెక్టర్ జె నివాస్ ఆనందం వ్యక్తం చేసారు. గ్రామ సభల నిర్వహణలో రాష్ట్రంలోనే ఏకైక గ్రామ పంచాయతీగా శ్రీకూర్మం ఎంపిక

కావడం సంతోషంగా ఉందన్నారు. పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా బుధ వారం న్యూఢిల్లీలో కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ అవార్డులను ప్రధానం చేస్తుందని వీటిని

స్వీకరించుటకు ఆయా గ్రామ పంచాయతీల కార్యదర్శులు న్యూఢిల్లీ వెళ్లారని చెప్పారు. సంతబొమ్మాళి మండలం నౌపడ గ్రామ కార్యదర్శి కూడా పంచాయతీ రాజ్ దినోత్సవంలో

పాల్గొనుటకు పంపిస్తున్నామని తెలిపారు. జిల్లాలో అన్ని గ్రామ పంచాయతీలు మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం దిశగా అడుగులు వేయాలని, పల్లెలు దేశానికి

పట్టుగొమ్మలు అనేది నిరూపించాలని పిలుపునిచ్చారు. పంచాయతీలు విద్య, వైద్యం, వ్యవసాయం, పారిశుధ్యం, రహదారులు, మురుగు నీటి కాలువల నిర్వహణ, విద్యుత్ తదితర ప్రాధమిక

అంశాలపై దృష్టి సారించి విజయం సాధించాలన్నారు. పంచాతీలు దృష్టిసారిస్తే ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుందని అన్నారు. గ్రామ పంచాయతీలలో అభివృద్ధి, సంక్షేమ పనులకు

అవసరమైన నిధులను సమకూర్చుకోవాలని అందుకు ప్రజలు పూర్తి సహాయ సహకారాలు అందించాలని కోరారు. రానున్న రోజుల్లో జిల్లా నుండి అధిక సంఖ్యలో గ్రామ పంచాయతీలు పోటీలో

పాల్గొని జాతీయ అవార్డులు సాధించాలని ఆయన పిలుపునిచ్చారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam