DNS Media | Latest News, Breaking News And Update In Telugu

లైసెన్సు లేకుండా బాణ సంచా విక్రయిస్తే చర్యలు తప్పవు

ఒక లైసెన్సు తో రెండు దుకాణాలు నిర్వహిస్తే చర్యలు తప్పవు,

టపాసుల దుకాణాలు పక్కాగా నిబంధనలు పాటించాలి 

జిల్లా ఎస్పీ భూసారపు సత్య ఏసుబాబు
  
(DNS

రిపోర్ట్ : పి రాజా, spl కరస్పాండెంట్, అనంతపూర్ ). .

అనంతపూర్  , అక్టోబర్ 25, 2019 (డిఎన్‌ఎస్‌): అనంతపూర్ జిల్లాలో లెసెన్సు లేకుండా బాణ సంచా విక్రయిస్తే చర్యలు తప్పవని

జిల్లా ఎస్పీ భూసారపు సత్య ఏసుబాబు ఆదేశాలు జారీ చేశారు. ఒక లైసెన్సు పొంది రెండు దుకాణాలు నిర్వహించినా చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. నిబంధనలు పక్కాగా

పాటించిలన్నారు. విరుద్ధంగా ఉంటే చర్యలు తప్పదన్నారు. ఇదే సమయంలో బాణసంచా సామాగ్రిని దుకాణాల్లో జాగ్రత్తలు తీసుకోకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ప్రమాదాలు

జరిగే అవకాశముందన్నారు. సురక్షితం కాని ప్రదేశాల్లో బాణసంచా నిల్వ చేసినా... నిబంధనలకు విరుద్ధంగా టపాసుల విక్రయాలు కొనసాగించినా చర్యలు తీసుకోవాలన్నారు.

మందుగుండు సామగ్రిని అనధికారికంగా నిల్వచేయడం, విక్రయించడం వంటివి చేయకూడదన్నారు. రద్దీ ప్రాంతాలు, రహదారి పక్కన, ఇళ్ల సముదాయాల్లో బహిరంగంగా మందుగుండు

సామగ్రిని విక్రయిస్తే లైసెన్స్ రద్దు చేయడంతోపాటు చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. వీటితో పాటు పెద్దల పర్యవేక్షణలో పిల్లలు టపాసులు కాల్చే విధంగా

జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజల్ని కోరారు.

** బాణ సంచా అక్రమంగా విక్రయిస్తున్నా... ఏదేని ప్రమాదం జరిగినా వెంటనే డయల్ - 100 లేదా జిల్లా పోలీసు వాట్సాప్ నంబర్ 9989819191 లకు

సమాచారం చేరవేయాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam