DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆపరేషన్ అంపలాం : యదాస్థితికి వంశధార ప్రవాహం 

(DNS రిపోర్ట్ : SVS ఆచార్యులు, బ్యూరో , శ్రీకాకుళం). .

శ్రీకాకుళం , అక్టోబర్ 25, 2019 (డిఎన్‌ఎస్‌): శ్రీకాకుళం జిల్లా యంత్రాంగం చేపట్టిన ఆపరేషన్ అంపలాం విజయవంతం అయింది.

ఆపరేషన్ అంపలాంతో వంశధార నదీ ప్రవాహం యధాస్ధితికి వచ్చింది. కళింగపట్నం గ్రామస్తులు, కళింగపట్నం బీచ్ కు ఎటువంటి ప్రమాదం లేకుండా తప్పింది. ఇటు కళింగపట్నం

గ్రామస్తులు, అటు అంపలాం ప్రాంత ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వివరాలు పరిశీలిస్తే పోలాకి మండలం అంపలాం వద్ద ప్రైవేటు వ్యక్తులు 20 వరకు రొయ్యల చెరువులను

అక్రమంగా నిర్మించడమే కాకుండా వంశధార నదీ ప్రవాహానికి గట్టును వేసి మళ్ళించారు. దీనితో ఏ మాత్రం వరద వచ్చినా వంశధార నదీ ప్రవాహం దిశ మారడం జరిగింది. ఇటీవల వరదలకు

కళింగపట్నం బీచ్ పూర్తిగా వరదకు గురైంది. జిల్లా యంత్రాంగం లక్షలాది రూపాయలతో ఏర్పాటు చేసిన విగ్రహాలు, కూర్చునే బల్లలతో సహా అభివృద్ధి పనులు వరదకు గురై బీచ్ కు

వెళ్ళే పరిస్ధితి లేకుండా చేసింది. గ్రామాల్లో వరద రావడంతో ప్రజలు సైతం ఆందోళనకు గురయ్యారు. ఈ పరిస్ధితిని గమనించిన జిల్లా కలెక్టర్ జె నివాస్ రెవిన్యూ, జలవనరుల

శాఖ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తూ అక్రమంగా నిర్మించిన రొయ్యల చెరువులను తొలగించాలని, వంశధార నదీ ప్రవాహాన్ని పూర్వ స్ధితికి తీసుకురావాలని

అన్నారు. రెవెన్యూ, జలవనరుల శాఖల అధికారులు యుద్ధ ప్రాతిపదికన నాలుగు రోజుల క్రితం ఆపరేషన్ అంపలాం చేపట్టి రొయ్యల చెరువులను తొలగించడం, వంశధార నదీ ప్రవాహాన్ని

యధాస్ధితికి తీసుకురావడం జరిగింది. ఆపరేషన్ పూర్తి చేసిన వెంటనే జిల్లాలో గత మూడు రోజులుగా కురిసిన భారీ వర్షాల వలన జిల్లాలో అనేక ప్రాంతాలు నీటితో నిండిన

సంగతి తెలిసిందే. శుక్ర వారం వంశధారలో అత్యధికంగా దాదాపు 77 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉన్నప్పటికి కళింగపట్నం గ్రామంలోకిగాని, బీచ్ వద్ద నీటి ప్రవాహం

లేకుండా నదీ పూర్వ స్ధితిలో ప్రవాహం జరగింది. ఆయా ప్రాంతాల ప్రజలు ఆపరేషన్ పట్ల, వరద నీటి ప్రవాహం నివారణ పట్ల సంతోషం వ్యక్తం చేసారు.

          ఆక్రమణలను

సహించేది లేదని జిల్లా కలెక్టర్ జె నివాస్ ఈ సందర్భంగా శుక్ర వారం తెలిపారు. జలవనరులు యధాస్ధితిలో ప్రవాహానికి ఎవరూ అడ్డుకట్ట వేసే పరిస్ధితి ఉండరాదని ఆయన

పేర్కొన్నారు. నదులు, వాగులు, వంకల ప్రవాహాల ప్రదేశాలను ఆక్రమించే వారిపై చర్యలు చేపడతామని ఆయన హెచ్చరించారు. జిల్లాలో కురిసిన వర్షాలపై ముందస్తుగా జిల్లా

యంత్రాంగాన్ని అప్రమత్తం చేసామని అందులో భాగంగా ఆపరేషన్ అంపలాంకు ఆదేశించామని తెలిపారు. ఆపరేషన్ అంపలాం విజయవంతం కావడం ఆనందాన్నిచ్చిందన్నారు. ప్రజలు

సమస్యలకు గురి కారాదని, వారికి ప్రభుత్వం అండగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజలు పూర్తి అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.

/>  

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam