DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖలో పరిశ్రమ అభివృద్ధికి నిధులు లేవంటూ . .మోకాలడ్డు

టెక్నాలజీకి కొత్త సర్కారు సహాయ నిరాకరణ

కంపెనీలకు విడుదల కాని రాయితీలు, అద్దెలు

ప్రభుత్వం వద్ద నిధులు లేవంటూ సంకేతాలు

ఎపీటా, ఇన్నోవేషన్‌

సొసైటీల్లో సిబ్బందికి ఉద్వాసన

(DNS రిపోర్ట్ : పి రాజా, spl కరస్పాండెంట్, అమరావతి) :  . . . .

అమరావతి , అక్టోబర్ 25, 2019 (డిఎన్‌ఎస్‌):  à°†à°‚ధ్రప్రదేశ్‌లో ఐటీ రంగానికి

విశాఖపట్నమే ప్రధాన కేంద్రం. ఇక్కడే ఐటీ పార్కులు, స్టార్టప్‌ విలేజ్‌, ఫిన్‌టెక్‌ వ్యాలీ, మిలీనియం టవర్‌, టెక్‌ మహీంద్రా, విప్రో, ఐబీఎం, కాండ్యుయెంట్‌ వంటి

సంస్థలు ఉన్నాయి. ఏపీ నుంచి జరిగే ఐటీ ఎగుమతుల్లో 80 శాతం వాటా ఇక్కడి కంపెనీలదే. à°ˆ నేపథ్యంలో విశాఖను ఐటీ హబ్‌à°—à°¾ మారుస్తామని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం అందుకు

విరుద్ధంగా వ్యవహరిస్తోంది. దీంతో ఐటీలో విశాఖపట్నానికి ఉన్న బ్రాండ్‌ ఇమేజ్‌ క్రమంగా తెర మరుగవుతోంది. ఐటీ శాఖ పాలసీ 2020తో ముగుస్తుంది. కొత్త పాలసీకి రూపకల్పన

చేస్తున్నామని మంత్రి ప్రకటించారు. అది జనవరి నుంచే ప్రారంభం కావాల్సి ఉంది. కొత్త పాలసీ వస్తోందంటూ...ఐటీ కంపెనీలకు ఇవ్వాల్సిన రాయితీలు, అద్దెలు నిలిపేశారు. గత

ప్రభుత్వం అక్టోబరు 2018 వరకే వీటిని చెల్లించింది. ఇక కొత్తగా అధికారం చేపట్టిన వైసీపీ ప్రభుత్వం ఇప్పటివరకు రూపాయి కూడా విడుదల చేయలేదు. మొత్తంగా ఏడాది నుంచి

విశాఖలో ఐటీ కంపెనీలకు చెల్లింపులన్నీ నిలిపివేశారు. దీంతో ప్రభుత్వం ఇచ్చే రాయితీలపై ఆధారపడి కొత్త కంపెనీలు ఏర్పాటుచేసినవారు ఆర్థిక ఇబ్బందులకు

గురవుతున్నారు. విజయవాడలో ఇలాంటి కంపెనీలు ఇక నడపలేమని కొందరు మూసేసుకుంటే, మరికొందరు హైదరాబాద్‌ వెళ్లిపోయారు. విశాఖలో మాత్రం ఏదో à°’à°• సమయంలో ఇస్తారనే ఆశతో

కష్టమైనా, నష్టమైనా నడుపుతున్నారు. కొత్త కంపెనీలను, పెద్ద కంపెనీలను విశాఖపట్నం తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నామని ప్రభుత్వ ఐటీ వర్గాలు పేర్కొంటున్నాయి.

అయితే ఇక్కడ ప్రభుత్వం తాను ప్రకటించిన రాయుతీలనే ఇవ్వడం లేదని తెలిస్తే ఏ కొత్త కంపెనీ రాదని, ఆ విషయంలో విశాఖపట్నానికి ఇప్పటికే చెడ్డపేరు వచ్చిందని ఇక్కడి

ఐటీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. విశాఖపట్నంలో ఐటీ పరిశ్రమలు దెబ్బతినే విధంగా ప్రస్తుత వ్యవహారాలు నడుస్తున్నాయని చెబుతున్నారు.
 
4 నెలలుగా ఒక్క కార్యక్రమమూ

లేదు..

విశాఖపట్నం ఐటీ విభాగంలో à°—à°¤ నాలుగు నెలలుగా ఒక్క కార్యక్రమమూ నిర్వహించలేదు. à°’à°• మార్కెటింగ్‌ ప్రమోషన్‌ లేదు. కొత్త కంపెనీలు లేవు. ఐటీ మంత్రి

గౌతంరెడ్డి రెండు, మూడుసార్లు వచ్చి ఐటీ కంపెనీల అసోసియేషన్‌ ప్రతినిధులతో భేటీ అయ్యారు. కొత్త పాలసీని తీసుకువస్తామని, అంతవరకు వేచి చూడక తప్పదని

స్పష్టంచేశారు.

కొత్త టెక్నాలజీలకు ప్రోత్సాహం ఏదీ? : 

ఐటీ రంగంలో కొత్త కొత్త టెక్నాలజీలు వస్తున్నాయి. మెషిన్‌ లెర్నింగ్‌, ఐవోటీ, బ్లాక్‌ చెయిన్‌

టెక్నాలజీ, క్లౌడ్‌ కంప్యూటింగ్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ వంటివి కీలకపాత్ర పోషిస్తున్నాయి. ఇలాంటి వాటికి ప్రభుత్వ ప్రోత్సాహం అవసరం. à°† విధంగానే à°—à°¤

ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు తరువాత డిజిటిల్‌ లావాదేవీలు పెంచడానికి ప్రోత్సాహకంగా విశాఖలో ఫిన్‌టెక్‌ వ్యాలీని ఏర్పాటుచేసి బ్లాక్‌చెయిన్‌ టెక్నాలజీని

అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే, కొత్త ప్రభుత్వం తాము అలాంటి టెక్నాలజీలకు సహాయం అందించబోమని, కేవలం రాయుతీలు మాత్రమే ఇస్తామని, అవి కూడా గతం కంటే

తక్కువగానే ఉంటాయని, ప్రభుత్వం వద్ద నిధులు లేవని పరిశ్రమకు సంకేతాలు పంపింది.

ఎపీటా కార్యాలయం ఖాళీ :

రాష్ట్రంలో ఐటీకి విశాఖపట్నమే కేంద్రం కాబట్టి

à°—à°¤ ప్రభుత్వ హయాంలో ఇక్కడే ఏపీ ఎలక్ర్టానిక్స్‌ అండ్‌ ఐటీ ఏజెన్సీ(ఎపీటా) కార్యాలయం ఏర్పాటుచేశారు. దానికి శ్రీనివాసమూర్తిని సీఈవోగా నియమించారు.

విశాఖపట్నంలో ఐటీ అభివృద్ధికి ఉన్న అవకాశాలను వివరించి కొత్త కంపెనీలను తేవడానికి ప్రమోషన్స్‌(సీఈవో) అధికారిగా తిరుమలరావును నియమించారు. ఎపీటా

కార్యాలయాన్ని టెక్‌ మహీంద్రా ప్రాంగణంలో ఏర్పాటుచేసి, అందులో పరిపాలన, అకౌంట్స్‌, మౌలిక వసతులు, ప్రమోషన్‌ విభాగాలు ఏర్పాటుచేసి ఒక్కో దాంట్లో ముగ్గురిని

చొప్పున నియమించారు. ఎపీటా చురుగ్గా పనిచేసి అనేక కొత్త కంపెనీలను విశాఖపట్నానికి తీసుకువచ్చింది. 

ఉపాధి అవకాశాలు పెంచింది. ఎవరు కొత్త కంపెనీ

పెట్టాలన్నా.. ఇక్కడి అధికారులను సంప్రదించి విఽధివిధానాలు తెలుసుకునేవారు. దరఖాస్తు చేసుకునేవారు. అయితే, అధికారులు తరచూ అమరావతికి వెళ్లాల్సి రావడంతో అక్కడ

కూడా మరో కార్యాలయం ఏర్పాటుచేశారు. అందులో మరో 25 మందిని నియమించారు. కొత్త ప్రభుత్వం వచ్చాక విశాఖపట్నంలోని ఎపీటా కార్యాలయంలోని అందరికీ ఉద్వాసన పలికేశారు.

ప్రస్తుతం ఒక్కరు కూడా లేరు. కార్యాలయం మూతపడటంతో ఐటీ కంపెనీలకు ఏ కష్టం వచ్చినా చెప్పుకునే దిక్కు లేకుండా పోయింది.

అంతా కలిపి రూ.13 కోట్లే

రాష్ట్రంలోని ఐటీ కంపెనీలన్నింటికీ రాయితీలు, అద్దెలకు కలిపి మొత్తం రూ.13 కోట్లు మాత్రమే చెల్లించాల్సి ఉంది. 

ఉద్యోగ అవకాశాలు కల్పించినందుకు

ఇవ్వాల్సిన రాయితీలు, కొత్త కంపెనీలు పెట్టిన వారికి, విస్తరణకు వెళ్లిన వారికి ‘డిజిగ్నేటెడ్‌ టెక్నాలజీ పార్కు(డీటీపీ)’ పాలసీ à°•à°¿à°‚à°¦ వారు చెల్లించే అద్దెలో 50

శాతం ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది. à°ˆ రెండింటికీ కలిపి పదమూడు కోట్ల రూపాయల బకాయిలున్నాయి. 

ప్రభుత్వం 50 శాతం అద్దె ఇస్తామని భరోసా ఇవ్వడంతో ఐటీ కంపెనీలకు

భవనాలు ఇచ్చిన యజమానులు à°† ఆదాయంపై 18 శాతం జీఎ్‌సటీ చెల్లిస్తున్నారు. అద్దె సకాలంలో వచ్చినా రాకపోయినా జీఎ్‌సటీ మాత్రం చెల్లించాల్సి వస్తోందని వారు

వాపోతున్నారు.

ఇన్నోవేషనే సొసైటీలో మిగిలింది ఒక్కరే ; రుషికొండలో సన్‌రైజ్‌ స్టార్టప్‌ విలేజ్‌ ఏర్పాటుచేసి à°† తరువాత దానిని ఏపీ ఇన్నోవేషన్‌ సొసైటీగా

పేరు మార్చారు. సీఈవోగా విన్నీ పాత్రో ఉండేవారు. 

కొత్త ప్రభుత్వం వచ్చాక ఆయన్ను తొలగించి పవనమూర్తిని నియమించింది. ఇప్పుడు ఆయన్ను కూడా తీసేశారు. ఈ

సొసైటీకి విశాఖపట్నం, విజయవాడల్లో కలిపి మొత్తంగా 70 మంది సిబ్బంది ఉండేవారు. 

ఒక్క విశాఖపట్నంలోనే మార్కెటింగ్‌, హెచ్‌ఆర్‌, స్టార్టప్‌ ఎవల్యూయేషన్‌

వింగ్‌లలో 30 మంది ఉండేవారు. ప్రస్తుతం ఒకే à°’à°• అమ్మాయిని హెచ్‌ఆర్‌à°—à°¾ ఉంచి మిగిలిన వారిని తీసేశారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam