DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మహా నగరాలకు విస్తరించిన వైఎస్సార్ ఆరోగ్యశ్రీ సేవలు 

బెంగుళూరు, చెన్నై, హైద్రాబాద్ ల్లోనూ అమలు.

(DNS రిపోర్ట్ : పి రాజా, spl కరస్పాండెంట్, అమరావతి ). .

అమరావతి , అక్టోబర్ 25, 2019 (డిఎన్‌ఎస్‌):   వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీ

సేవలను హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు నగరాలకూ వర్తింప చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా నగరాల్లోని ఆస్పత్రుల్లో సూపర్ స్పెషాలిటీ సేవలు

పొందేందుకు వీలుగా ఆరోగ్య శ్రీ పథకాన్ని పొడిగిస్తూ వైద్యారోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. హైదరాబాద్, చెన్నై, బెంగుళూరుల్లో

ఎంప్యానల్‌ చేసిన ఆస్పత్రుల్లో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలకు ఆస్కారం కల్పిస్తూ à°ˆ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

17 అంశాల్లో 716 వైద్య చికిత్సలకు సూపర్

స్పెషాలిటీ వైద్యం చేయించుకునేలా ప్రభుత్వం ఈ ఆదేశాలను జారీ చేసింది.

అవయవమార్పిడి ఆపరేషన్లు, న్యూరో సర్జరీ, నెఫ్రాలజీ, పీడీయాట్రిక్ సర్జరీలు సహా 17

అంశాల్లో వైద్య చికిత్సలకు అస్కారం కల్పిస్తున్నట్టు ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ మూడు నగరాల్లో సూపర్ స్పెషాలిటీ చికిత్సల కోసం పేరెన్నికగన్న

ఆస్పత్రులను గుర్తించి ఎంప్యానల్ చేసేందుకు వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ ట్రస్టుకు బాధ్యతలు అప్పగిస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. అదే సమయంలో 71 మంది

ఆరోగ్య మిత్రల సేవలతో పాటు ముగ్గురు కార్యాలయ సిబ్బందిని మరో ముగ్గురు జిల్లా స్థాయి సమన్వయ కర్తల్ని నియమించుకునేందుకు అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన

నియమించుకునేందుకు అవకాశం కల్పిస్తూ ఆదేశాలు వెలువడ్డాయి.

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam