DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆర్మీ నియామక ప్రక్రియ ఏర్పాట్లపై కలెక్టర్ పరిశీలన

(DNS రిపోర్ట్ : SV ఆచార్యులు, బ్యూరో , శ్రీకాకుళం). .

శ్రీకాకుళం , అక్టోబర్ 26, 2019 (డిఎన్‌ఎస్‌):  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚లో నంబరు 7à°µ తేదీ నుండి నిర్వహించే ఆర్మీ నియామక ప్రక్రియ

ఏర్పాట్లను ఆర్మీ నియామక అధికారి కల్నల్ భూపేందర్ సింగ్ తో కలసి జిల్లా కలెక్టర్ జె నివాస్ శని వారం పరిశీలించారు. శ్రీకాకుళం జిల్లాతోపాటు విజయనగరం,

విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణ, పాండిచ్చేరి రాష్ట్రంలోని యానాం జిల్లాకు చెందిన అభ్యర్ధులకు నిర్వహిస్తున్నా ఈ నియామక ప్రక్రియలో పాల్గొనే

అభ్యర్దులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. తాగు నీరు, మరుగుదొడ్లను ఏర్పాటు చేయాలని, పారిశుధ్య నిర్వహణలో లోపం లేకుండా

చూడాలని నగరపాలక సంస్ధ కమీషనర్ ఎం.గీతా దేవిని ఆదేశించారు. ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో నియామక ప్రక్రియ జరుగుతున్నందున మైదానంలో అవసరమగు రన్నింగు ట్రాక్ ను

ఏర్పాటు చేయాలని జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి బి.శ్రీనివాస్ కుమార్ ను ఆదేశించారు. అభ్యర్ధులను నియంత్రించుటకు అవసరమగు బ్యారికేండింగును ఆర్మీ అధికారుల

సూచనల మేరకు ఏర్పాటు చేయాలని ఆర్ అండ్ బి అధికారులను ఆదేశించారు. నియామక ప్రక్రియకు విచ్చేసే అభ్యర్ధులను ఆర్ట్స్ కళాశాల సమీపంలోగల కోడి రామమూర్తి స్టేడియంకు

చేరుకుంటారని అచ్చట నుండి బ్యాచ్ ల వారీగా నియామక ప్రక్రియలో అర్హతల పరిశీలన చేస్తారని చెప్పారు. అభ్యర్ధులు కోడి రామమూర్తి స్టేడియంకు చేరునప్పటి నుండి అర్హత

పరీక్షలో పాల్గొని బయటకు వచ్చే వరకు అవసరమయ్యే సౌకర్యాలను కల్పించాలని చెప్పారు. ఆర్ట్స్ కళాశాలలోగల మరుగుదొడ్లను మరమ్మతులు చేయడంతోపాటు కనీసం 10 మొబైల్

మరుగుదొడ్లను ఏర్పాటు చేయాలని, కోడి రామమూర్తి స్టేడియంలో 40 నుండి 50 వరకు మోబైల్ మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని నగర పాలక సంస్ధ కమీషనర్ ను ఆదేశించారు. అభ్యర్ధులు

కూర్చొనుటకు అవసరమగు కుర్చీలు వేయాలని రెవిన్యూ అధికారులను ఆదేశించారు. అభ్యర్ధులు వారికి కేటాయించిన తేదీల్లో వారికి సూచించిన మేరకు సాయంత్రం నియామక

ప్రదేశానికి చేరుకోవాలని అన్నారు. బ్యాచ్ ల వారీగా వారిని అనుమతించడం జరుగుతుందని అందుకు అనుగుణంగా అభ్యర్ధులు క్రమశిక్షణతో పాల్గొనాలని ఆయన కోరారు.

     

    ఆర్మీ నియామక అధికారి కల్నల్ భూపేందర్ సింగ్ మాట్లాడుతూ ఏడు జిల్లాల నుండి ఇప్పటి వరకు 52 వేలకు పైగా అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నారన్నారు. వివిధ విభాగాలకు

చెందిన సోల్జర్ పోస్టులకు జరిగే ఈ నియామక ప్రక్రియకు హాజరు కావలసిన వివరాలను అభ్యర్ధులకు కాల్ లెటర్స్ లో తెలియజేస్తున్నామని చెప్పారు. అభ్యర్ధులు

తీసుకురావలసిన ధృవపత్రాలతోపాటు ఎన్ని గంటలకు హాజరు కావాలో వివరంగా ఉందని దానిని అభ్యర్ధులు విధిగా పాటించి సహకరించాలని కోరారు. నవంబరు 7వ తేదీ నుండి 17వ తేదీ వరకు

నియామక ప్రక్రియ జరుగుతుందని, వర్షం లేదా ఇతర కారణాల వలన అంతరాయం కలిగితే పొడిగించే అవకాశాన్ని పరిశీలిస్తామని చెప్పారు.

          à°ˆ కార్యక్రమంలో సహాయ

కలెక్టర్ ఏ.భార్గవ తేజ, రెవిన్యూ డివిజనల్ అధికారి ఎం.వి.రమణ, ఆర్ అండ్ బి కార్యనిర్వహక ఇంజనీరు గౌరీశ్వర రావు, డి.ఇ ఆర్.గణపతి, ప్రజా ఆరోగ్య శాఖ కార్యనిర్వాహక

ఇంజనీరు పి.సుగుణాకర రావు, పోలీసు ఇన్స్పెక్టర్ శంకర రావు, తహశీల్దరు ఐ.à°Ÿà°¿.కుమార్ తదితరులు పాల్గొన్నారు.   

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam