DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పిఎస్ఎస్ సర్వే త్వరితగతిన చేయాలి :జేసీ శివ శంకర్

సాంకేతిక సమస్యలుంటే తెలియజేయాలి

రైతు భరోసాపై వీడియో కాన్ఫరెన్సు జేసీ శివ శంకర్

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS): . . .

విశాఖపట్నం, అక్టోబర్ 30, 2019 (డిఎన్‌ఎస్‌) :

ప్రజా సాధికారిక సర్వేను త్వరితగతిన చేయాలని విశాఖపట్నం జిల్లా జాయింట్ కలెక్టర్ ఎల్.శివ శంకర్ తహసిల్థార్లు, వ్యవసాయాధికారులను ఆదేశించారు. వై.యస్.ఆర్. రైతు

భరోసా పై ఆర్డిఓలు, తహసిల్థార్లు, వ్యవసాయాధికారులతో ఆయన బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.  à°ˆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల ఖాతాలకు జమ కాని వాటిపై

దృష్టి సారించాలన్నారు.  à°ªà±à°°à°¸à±à°¤à±à°¤à°‚ జిల్లా మొత్తంలో పి.ఎస్.ఎస్. సర్వే, తప్పుడు ఆధార్ సీడింగ్, తదితరమైనవి 9 వేల 900 కేసులు ఉన్నాయని, ప్రజా సాధికారిక సర్వే చేయని

కేసులను త్వరితగతిన చేయాలని ఆదేశించారు.  à°¤à°ªà±à°ªà±à°¡à± ఆధార్ సీడింగ్ లను వాటిని సరిచేయాలని పేర్కొన్నారు.  à°•à±à°·à±‡à°¤à±à°° స్థాయిలో వీఆర్ఓలు, ఎంపిఇఓలతో త్వరితగతిన

చేయించాలన్నారు.  à°°à°¿à°œà±†à°•à±à°Ÿà± అయిన ఖాతాలు 2à°µ తేదీ (శనివారం) నాటికి పూర్తి చేయాలని చెప్పారు.  à°ªà±à°°à°œà°¾ సాధికారిక సర్వే పూర్తి అయినా పేమెంట్లు జరగని కేసులు ఉన్నాయని,

వాటిని కూడా శనివారం నాటికి పేమెంట్లు పూర్తి చేయాలని తెలియజేశారు.  à°¡à±†à°¤à± కేసులు, మైగ్రేషన్ కేసులు ఉన్నాయని, వాటిని కూడా త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.

 à°ªà±†à°‚దుర్తి, భీమిలి, పద్మనాభం, తదితర మండలాల్లో ఎక్కువగా ఉన్న పి.ఎస్.ఎస్. సర్వే, తప్పుడు ఆధార్ సీడింగ్ ఎక్కువగా ఉన్నాయని, వాటిని పూర్తి చేయాలని ఆదేశించారు.

పి.ఎస్.ఎస్. సర్వే, తప్పుడు ఆధార్ సీడింగ్,  à°¡à±†à°¤à± కేసులు, మైగ్రేషన్ కేసులు తదితర వాటిపై మండలాల వారీగ ఆయన సమీక్షించారు.   సాంకేతిక సమస్యలు ఉంటే తన దృష్టికి

తీసుకురావాలని, సాంకేతిక సమస్యలపై ఆర్.టి.జి.ఎస్. వారితో మాట్లాడి సరిచేయనున్నట్లు ఆయన చెప్పారు. విశాఖపట్నం నుండి వీడియో కాన్ఫరెన్స్ లో శిక్షణ కలెక్టర్

ప్రతిష్ట, వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు మళ్లిఖార్జునరావు, ఆయా మండలాల నుండి వీడియో కాన్ఫరెన్స్ లో పాడేరు నుండి సబ్ కలెక్టర్ వెంకటేష్, ఆర్డిఓలు, తహసిల్థార్లు,

వ్యవసాయాధికారులు, తదితరులు పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam