DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సర్వ ప్రాణి ఆరాధన - హైందవ సంస్కృతి  

మహనీయుల ఆచరణే. . .మనకు ఆదర్శం. . .

(DNS రిపోర్ట్ : కళ్యాణి CSV , స్టాఫ్ రిపోర్టర్, విశాఖపట్నం) : . . .

విశాఖపట్నం, అక్టోబర్ 30, 2019 (డిఎన్‌ఎస్‌): ఇందు గలడు అందు లేడను సందేహము

వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు చూసినా అందేందే గలడు అనే వేదం వాక్కును  à°­à°¾à°°à°¤à±€à°¯ సనాతన ధర్మం తెలియచేస్తోంది. సృష్టిలోని ప్రతి అణువులో పరమాత్మను

దర్శించవచ్చునని చెబుతోంది. సకల జీవకోటిని సాటి ప్రాణిగా ప్రేమించే ప్రగాఢ ఆత్మీయత మనకు అలవడింది. దీనికి నిదర్శనమే దత్తాత్రేయ స్వామి, షిర్డీ సాయి, సత్యసాయి,

తదితర మహనీయులు వృక్ష సంపద నుంచి, జీవ రాసుల వరకూ అన్నింటా పరమాత్ముని దర్శింప చేశారు. 
 à°µà°¿à°·à°¸à°°à±à°ªà°¾à°²à°¨à± సైతం పూజించే ఆచారమూ మనకు అనాదిగా ఉంది. కార్తిక శుద్ధ చవితి

నాగులచవితిగా ప్రసిద్ధి చెందింది. జాతి, కుల భేదాలు లేకుండా చేసేది నాగారాధన. శ్రావణశుక్ల పంచమినాడు నాగపంచమి పేరుతోను, మార్గశిర శుద్ధ షష్ఠినాడు ‘సుబ్రహ్మణ్య

షష్ఠి’ పేరుతో సర్పారాధనలు జరుగుతాయి.

ఆరోగ్య పరిరక్షణకు, సంతానోత్పత్తికి, సంక్లిష్ట సమస్యలు, నేత్ర-కర్ణ-ఉదర సంబంధిత వ్యాధుల నివారణకు నాగులను పూజిస్తారు.

నాగపూజవల్ల రాహు కుజదోషాలు, మనోవ్యాధులు తొలగిపోతాయని కొందరి విశ్వాసం.

సర్పపూజ మొదట అనార్య సంస్కృతికి చిహ్నంగా ఉండి, తరవాత వైదికముద్ర పొందినట్లు

గోచరిస్తోంది. ఈజిప్టులో హార్మిస్‌ దేవుడికి, గ్రీస్‌లో మెర్క్యురీ దైవానికి సర్పం భూషణం. రుతుపరివర్తన సూచకంగా నాగపూజ జరుగుతుంటుంది. సస్యదేవతైన

‘రన్నత్‌’కు సర్పాన్ని ప్రతీకగా భావించేవారు. à°ˆ దేవత తల సర్పశిరస్సులా ఉండేది. పర్షియాలో ఇంద్ర ధనుస్సును సర్పదేవతగా కొలిచేవారు.

నాగారాధనకు యోగపరమైన

అంతరార్థం ఉంది. వెన్నెముక అడుగుభాగాన మూడున్నర చుట్టలు చుట్టుకుని, మొదటి చుట్టు à°•à°¿à°‚à°¦ తలదాచుకునేది ‘కుండలిని’ అనే పాము అని చెబుతారు. సాధకుడు à°† సర్పాన్ని

మెల్లగా సహస్రారానికి తీసుకువెళ్తాడు. పద్మాసనం వేసుకుని ధ్యానస్థితిలో ఉన్న సాధకుడు పడగెత్తిన సర్పంలా గోచరిస్తాడు. అడుగు పాము చుట్టను పోలి ఉంటుంది.

నిటారుగా ఉన్న వెన్నుపూస పాము శరీర భాగానికి ప్రతీక. వ్యక్తిమెడ, తలభాగం పాముపడగకు ప్రతిబింబం. అలా యోగసాధన చేసే వ్యక్తి జ్ఞానమనే క్షీరం తాగి, శరీరాన్ని

అమృతమయం చేసుకుంటాడు. అప్పుడే ఆత్మసాక్షాత్కార ప్రాప్తి కలుగుతుందంటారు.

నాగుల చవితినాడు నాగవ్రతం చేయాలని చతుర్వర్గ చింతామణి చెబుతోంది. భవిష్య, స్కంద,

మత్స్య పురాణాల్లో భుజంగ పూజకు సంబంధించిన విశేషాలెన్నో ఉన్నాయి. దిక్పాలురకు నాగులకు సంబంధమున్నట్లు కొన్ని పురాణ కథనాలున్నాయి.

సర్పారాధన మూడు

విధాలుగా చెప్పుకొంటారు. వల్మీక పూజ మొదటిది. నాగప్రతిమారాధన రెండోది. మూడోది నాగవిగ్రహారాధన. విభిన్న రీతుల్లో ఆయాప్రాంతాల ఆచారాలను అనుసరించి ఈ పూజలు

జరుగుతాయి. ‘వల్మీకం’ అంటే పుట్ట. పుట్ట దగ్గరికి వెళ్లి ఆవుపాలు అందులో పోసి, పసుపు కుంకుమలు చల్లి, పూలతో పుట్టను అలంకరించి చలిమిడి చిమ్మిడి వంటి

తీపిపదార్థాలను నైవేద్యంగా పెడతారు. పుట్టమట్టిని బొట్టుగా పెట్టుకుంటారు. నివేదన చేసిన పదార్థాన్నే ప్రసాదంగా స్వీకరించి, కఠినమైన ఉపవాసం చేస్తారు. జఠర

శక్తిని ఇనుమడింపజేసే శక్తి ఉపవాసంలో ఉంది. బెల్లం, నువ్వులు కలిసిన ప్రసాదం ఈ వాతావరణానికి అనుకూలంగా ఉండి ధాతుపుష్టిని కలిగిస్తుంది. పాము విషం కొన్ని

ఔషధాల్లో ఉపయోగపడుతోంది. పొలాల్లోని పంటను ఎలుకలు పాడుచేయకుండా పాములు రక్షించి, రైతులకు మేలుచేస్తాయి. అందుకే నాగుల చవితినాడు చెట్లు నరకడం, నేలదున్నడం,

పుట్టలు తవ్వడం వంటి పనులు చేయరు. నాగారాధనతో చర్మసంబంధ వ్యాధులు తొలగిపోతాయంటారు. నాగస్మరణచేస్తూ నిద్రిస్తే పీడకలలేవీ రావని కొందరి నమ్మకం. జ్యోతిష్యంలోనూ

నాగప్రాశస్త్యం కనిపిస్తుంది.

ప్రకృతిలోని ప్రతి ప్రాణీ మానవుడికి ఏదోరూపంలో ఉపకారం చేస్తోంది. అందుకే భూతదయ కలిగి ఉండాలన్న మహత్తర సందేశం ఈ పర్వదినం

మనకు అందిస్తోంది.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam