DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఐక్యత కోసం ప్రతీ పౌరుడు పోటీపడాలి: కలెక్టర్ జె.నివాస్

(DNS రిపోర్ట్ : SV  à°†à°šà°¾à°°à±à°¯à±à°²à±,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ ). .

శ్రీకాకుళం, అక్టోబర్ 31, 2019 (డిఎన్‌ఎస్‌): జిల్లాలోని ప్రతీ పౌరుడు ఐక్యత కోసం పోటీపడాలని శ్రీకాకుళం

జిల్లా కలెక్టర్ జె.నివాస్ జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. సర్ధార్ వల్లభాయి పటేల్ జయంతి సందర్భంగా జిల్లా క్రీడాప్రాధికార సంస్థ మరియు యువజన సర్వీసుల శాఖ

ఆధ్వర్యంలో రాష్ట్రీయ ఏక్తా దివాస్ ర్యాలీ కార్యక్రమం గురువారం ఉదయం స్థానిక ఏడురోడ్ల కూడలి వద్ద జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ జె.నివాస్ మరియు

జిల్లా సూపరింటెంటెంట్ ఆఫ్ పోలీస్ ఆర్.ఎన్.అమ్మిరెడ్డి ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. ముందుగా జిల్లా కలెక్టర్ సర్ధార్ వల్లభాయి చిత్రపటానికి పూలమాలను వేసి

నివాళులు అర్పించారు. అనంతరం ఐక్యతా పరుగునకు పచ్చజెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సర్ధార్ వల్లభాయి పటేల్ జయంతిని

పురష్కరించుకొని భారతీయ ఏక్తా దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నామని గుర్తుచేసారు.  à°­à°¾à°°à°¤à°¦à±‡à°¶à°‚ విభిన్న రాష్ట్రాలు, మతాలు, భాషలు, సంస్కృతులు

కలిగినప్పటికీ భారతీయులందరూ ఏకమై కలిసి ఉండటానికి ప్రధానకారణం సర్ధార్ వల్లభాయి పటేల్ అని గుర్తుచేసారు. భారత రాజ్యాంగం రాకముందు కూడా  à°­à°¾à°°à°¤à°¦à±‡à°¶ ఐక్యతను

కాపాడేందుకు కీలకపాత్రను వహించిన మహోన్నత వ్యక్తి  à°¸à°°à±à°§à°¾à°°à± వల్లభాయి పటేల్ అని కొనియాడారు. ఎన్నో ప్రపంచ దేశాలు ఆయన స్పూర్తితో ఐక్యతకోసం ఆదర్శంగా

తీసుకున్నాయని తెలిపారు. ప్రపంచంలో ఇన్ని మతాలు, భాషలు, సంస్కృతులు మరెక్కడా లేవని కలెక్టర్ స్పష్టం చేసారు. మనందరం కూడా భారతీయులుగా గర్వపడాల్సిన తరుణమిదని

పేర్కొన్నారు. ఇటువంటి తరుణంలో ఐక్యతా ర్యాలీని నిర్వహించుకోవడం ముదావహమని, ఇందులో పోలీసు, రెవిన్యూ, క్రీడాకారులు పాల్గొనడం సంతోషంగా ఉందని, ఐక్యత కోసం ప్రతీ

పౌరుడు పోటీపడాలని కోరుకుంటున్నట్లు కలెక్టర్ వివరించారు. ఏడురోడ్ల కూడలి వద్ద ప్రారంభమైన ర్యాలీ డే అండ్ నైట్ జంక్షన్ వరకు కొనసాగింది. అనంతరం మానవహారాన్ని

ఏర్పాటుచేసి జిల్లా యస్.పితో కలిసి ఐక్యతా ప్రతిజ్ఞను పౌరులతో చేయించారు.

జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆర్.ఎన్.అమ్మిరెడ్డి  à°®à°¾à°Ÿà±à°²à°¾à°¡à±à°¤à±‚ సర్ధార్

వల్లభాయి పటేల్ జయంతి సందర్భంగా భారతీయ ఏక్తా దీవాస్ గా భారత ప్రభుత్వం ప్రకటించడం జరిగిందన్నారు. అందులో భాగంగా నేడు రాష్ట్రీయ ఏక్తా దివాస్ ను

జరుపుకుంటున్నామని గుర్తుచేసారు.  à°­à°¾à°°à°¤à°¦à±‡à°¶à°¾à°¨à°¿à°•à°¿ స్వాతంత్ర్యం వచ్చిన తరువాత తొలి హోమ్ మినిష్టర్ à°—à°¾ పనిచేసిన వ్యక్తి సర్ధార్ వల్లభాయి పటేల్ అని కొనియాడారు.

ఈయనను ఉక్కు మనిషి అని పిలుస్తారని గుర్తుచేసారు. పటేల్  à°¸à±à°ªà±‚ర్తితో భారతదేశంలో ఐక్యత మరింత పటిష్టం కావాలని యస్.పి.ఆకాంక్షించారు. à°ˆ సందేశాన్ని అందించాలనే

ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగిందని పేర్కొన్నారు. పటేల్ జయంతి సందర్భంగా శ్రీకాకుళం పట్టణంలో మరియు కాశీబుగ్గ, పాలకొండ డివిజన్లలో

ఐక్యతా పరుగు ర్యాలీలను నిర్వహించుకుంటున్నట్లు యస్.పి చెప్పారు. అలాగే సాయంత్రం 05.00గం.ల నుండి 6.00గం. వరకు యూనిఫారంలో పోలీస్ మార్చ్ ఫాస్ట్ చేస్తున్నట్లు తెలిపారు.

సర్ధార్ పటేల్ స్పూర్తితో జిల్లాలోని పౌరులందరూ ఐక్యతతో మరింత ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. తద్వారా దేశాభివృద్ధికి ఐక్యత తోడ్పడుతుందని

ఆశాభావం వ్యక్తం చేసారు.తొలుత ఏడురోడ్ల కూడలి వద్ద సర్ధార్ వల్లభాయి పటేల్ చిత్రపటానికి పూలమాలను వేసిన యస్.పి అనంతరం ఏడురోడ్ల కూడలి నుండి డే అండ్ నైట్ జంక్షన్

వరకు నిర్వహించిన ఐక్యతా ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం పౌరులతో ఐక్యతా ప్రతిజ్ఞను చేయించారు.  

à°ˆ కార్యక్రమంలో పైడి వేణుగోపాలరావు,  à°.ఆర్  à°¡à°¿à°µà°¿à°œà°¨à°²à±

సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్  à°¡à°¿.వి.వి.శేఖర్, టౌన్ à°¡à°¿.యస్.పి బి.వి.వి.యన్.మూర్తి, స్పెషల్ బ్రాంచ్ à°¡à°¿.యస్.పి రవివర్మ, ట్రాఫిక్ à°¡à°¿.యస్.పి సిహెచ్.బి.వి.ప్రసాద్, చీఫ్ కోచ్

బి.శ్రీనివాసకుమార్, జిల్లా పర్యాటక అధికారి యన్.నారాయణరావు, సెట్ శ్రీ ముఖ్యకార్యనిర్వహణ అధికారి జి.శ్రీనివాసరావు, యం.టి.ఓ రవికుమార్, యస్.టి.ఆర్.ఎఫ్ మూర్తి, టు టౌన్

సర్కిల్ ఇన్ స్పెక్టర్ శంకరరావు, ట్రాఫిక్ సబ్ ఇన్ స్పెక్టర్లు, పోలీసు, రెవిన్యూ సిబ్బంది, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam