DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అసాధ్యాన్ని సుసాధ్యం ధర్మాడీ కి అరుదైన పురస్కారం  

జీవన సాఫల్య పురస్కారం ఇచ్చేందుకు సీఎం నిర్ణయం. 

సుడిగుండం నుంచి వెలుగులోకి వచ్చిన రాయల్ వసిష్ఠ 

ధర్మాడీ తెగువ బహు ప్రసంశనీయం. . .: మంత్రి

కురసాల 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి) : . . . 

అమరావతి,  à°…క్టోబర్ 31, 2019 (డిఎన్‌ఎస్‌) : తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద

ప్రమాదానికి గురైన బోటుని బయటకు తీసిన ధర్మాడి సత్యంకు అరుదైన గౌరవం దక్కబోతోంది. ఏపీ ప్రభుత్వం ఆయనకు లైఫ్ టైం ఎచీప్ మెంట్ అవార్డు ఇవ్వబోతోంది. స్వయంగా సీఎం

జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మీడియాకు తెలిపారు. అత్యంత ప్రమాద కరమైన ప్రాంతంలో బోటు ప్రమాదం జరిగింది. 51 మంది ఈ ప్రమాదంలో

మృత్యువాతపడ్డారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ విషాదం నింపిన అతిపెద్ద ప్రమాదం ఇది. ప్రమాదం జరిగిన సమయంలో ముంబై, జార్ఖండ్ నిపుణులు వచ్చి.. బోటు సుమారు 300 అడుగుల

లోతులో ఉందని, తియ్యడం కష్టమని చేతులెత్తేశారు. ఈదిశలో ప్రభుత్వం పై ప్రతిపక్షాలు విమర్శలవర్షం కురిపించారు.

బోటు ప్రమాదం నుండి కచ్చులూరు గిరిజనులు

ప్రాణాలతో రక్షించిన 26 మంది పక్కనబెడితే.. బయటపడిన 38 మృతదేహాలే కాకుండా… బోటులో ఇంకా చాలా మృతదేహాలు ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. 90 మందికి పైనే బోటులో 77 మంది కాదు.. 90

మందికి పైనే పర్యాటకులు వెళ్లారని మరికొందరు ఆరోపించారు. ఈ పరిస్థితిలో అన్ని లెక్కలతో కలిపి బోటులో 77 మంది మాత్రమే వెళ్లినట్లు ప్రభుత్వ నేతలు ప్రకటించారు. ఈ

నేపథ్యంలో.. ప్రమాదం అయినప్పటికీ బోటు తియ్యడానికి ముందుకొచ్చిన కాకినాడకు చెందిన మత్యకారుడు ధర్మాడి సత్యం ను ప్రభుత్వం నమ్మింది. అతడికి చెందిన బాలాజీ

మెరైన్స్ సంస్థకు ఈ బోటు తీసే కాంట్రాక్ట్ పనిని ప్రభుత్వం అప్పగించింది. దీంతో రెండు దపాలు దాదాపు 10 రోజులు ధారమించి ధర్మాడి సత్యంతో పాటు మరో 25 మంది సభ్యుల బృందం

బోటుని ఊహించని రీతిలో వెలికితీసింది. చివరిలో తన సొంత ఆలోచనతోనే ధర్మాడి సత్యం విశాఖ వెళ్లి.. స్కూబా టీమ్ ను తీసుకొచ్చి వారి సహకారంతో బోటు వడ్డుకు చేర్చాడు.

బోటు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రాదన్న కాలజ్ఞానులకు, విమర్శకులకూ నోళ్లు మూగబోయేలా… సత్యం తన ప్రతిష్టాత్మకమైన ఆపరేషన్ లో విజయం సాధించాడు. దీనిద్వారా

అతడొక్కడికే కాకుండా.. బోటు బయటకు తేవడం ద్వారా ప్రభుత్వ ప్రతిష్ఠ ను కూడా నిలబెట్టాడనే చెప్పాలి. బోటులో బయటపడ్డ మృతదేహాలు ప్రభుత్వ లెక్కలకు దగ్గరగా ఉండటం..

ఇంకా మరో ఐదు మృతదేహాల జాడ తెలియాల్సి ఉండటంతో.. ప్రభుత్వాన్ని విమర్శించినవారికి కూడా చెక్ పడింది. దీంతో.. విమర్శలకు వెరవకుండా… విఫలం అవుతున్నా.. నిరుత్సాహ

పడకుండా… ధర్మాడి బోటుకోసం సాగించిన అన్వేషణ అందరిలోనూ ఆయన్ని హీరోని చేసింది. పట్టు సాధించి… లోకల్ టాలెంట్ తో బోటుని బయటకు తెచ్చి సత్తా చాటిని సత్యం కు

స్వచ్చందంగా ప్రజలే సన్మానాలు చేస్తున్నారు. అతడి పట్టుదలనూ, సంకల్పాన్నీ ప్రశంశిస్తున్నారు. ఇదే దిశలో ముఖమంత్రి జగన్ కూడా ధర్మాడి లోకల్ సత్తాకు

ముగ్ధుడయ్యారు. అతడిని లైఫ్ టైమ్ ఎచీప్ మెంట్ అవార్డుతో సత్కరించాలని సంకల్పించారు. ఈమేరకు సీఎం నిర్ణయాన్ని మంత్రి కన్నబాబు మీడియాకు తెలిపారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam