DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సమాజం లో అందరూ నమ్మగలిగేది ఒక్క బ్రాహ్మణున్నే 

సమాజం లో అందరూ నమ్మగలిగేది ఒక్క బ్రాహ్మణున్నే 

సమాజం ఇచ్చిన గౌరవాన్ని నిలబెట్టుకోవాలి. . .

టికెట్ ఇచ్చిన పోటీ చేసే ధైర్యం లేని వర్గం ఇదే.

.

ద్రోణంరాజుకు రాజకీయ వారసుణ్ణి నేనే అని ద్రోణంరాజే చెప్పారు 

మాటల మాంత్రికులు ఉండవల్లి అరుణ్ కుమార్ 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS) : . . .

.

*విశాఖపట్నం, నవంబర్ 02, 2019 (డిఎన్‌ఎస్‌) : యావత్ సమాజం అంతా ధైర్యంతో విశ్వసించగలిగే వర్గం కేవలం బ్రాహ్మణా సమాజం మాత్రమేనని, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్

తెలియచేసారు. శనివారం విశాఖ నగరంలో బ్రాహ్మణ ప్రజా ప్రతినిధులకు జరిగిన ఆత్మీయ సదస్సులో అయన ప్రత్యేక ప్రసంగం చేసారు. ఛలోక్తులతో కూడిన అయన ప్రసంగం ఆద్యంతం

ఆహుతులు ఆనందించారు. 
 à°ˆ సందర్బంగా అయన మాట్లాడుతూ స్వతహాగా బ్రాహ్మణులకు భయం, బిడియం ఉంటాయని, ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్లు ఇచ్చినా, పోటీ చేసే ధైర్యం

లేని వర్గం ఇదేనన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ రాజమహేంద్రవరం మునిసిపల్ ఎన్నికల్లో బ్రాహ్మణ సామాజిక వర్గానికి ఆరు టికెట్లు కేటాయించినా పోటీ చెయ్యడానికి

కేవలం ఇద్దరే ముందుకు వచ్చారన్నారు. అయితే బిడియం తగ్గాలని, సమాజం హితవు కోరుకునే బ్రాహ్మణులూ, అదే సమాజానికి ప్రత్యక్షంగా మేలు చేసేందుకు ప్రత్యక్ష పోటీలోకి

రావాలన్నారు. 

సభలో పాల్గొన్న రాష్ట్ర శాసన సభ ఉప సభాపతి కోన రఘుపతి, వి ఎం ఆర్ డి ఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ లను ఉద్దేశించి మాట్లాడుతూ వీరిద్దరి

ప్రక్కన కూర్చుంటే తాను వయోవృద్ధుణ్ణి అనే అనుమానం వచ్చేస్తోందన్నారు. దీనికి కారణం . . . వీరిద్దరి తండ్రులు ( కోన రఘుపతి, ద్రోణంరాజు సత్యనారాయణ) తోనూ తాను కలిసి

పనిచేశాన్నారు. ప్రస్తుతం వీరిద్దరూ ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నత స్థానం లో ఉన్నారన్నారు. 

గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ పరంగా

క్లిష్టపరంగా ఉన్న సమయంలో జరిగిన అత్యంత కీలక భేటీ లో పాల్గొన్న ద్రోణంరాజు సత్యనారాయణ, అందరి సమక్షంలోనూ తన రాజకీయ వారసునిగా ఉండవల్లి అరుణ్ కుమార్ ను

ప్రకటిస్తున్నట్టు చెప్పగానే అందరూ ఆశ్చర్యానికి గురయ్యారన్నారు. దీనికి కారణం. . . రాజకీయానికి కావాల్సింది తెగువ అని, కుటుంబ వారసత్వం కాదన్నారు. అయన తనతో అంత

ఆత్మీయంగా ఉండేవారన్నారు. 

మరో అతిధి విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కు తనకు సారూప్యాలు చాలా ఉన్నాయన్నారు. తాము ఇద్దరూ రాజకీయాల్లో నేరుగా

వచ్చిన వారమేనని, ఎటువంటి కుటుంబ వారసత్వం లేదన్నారు, పైగా ఇద్దరి తండ్రుల పేర్లు సుబ్బారావేనన్నారు. 

ఎవరికీ అవకాశాలు త్వరగా లభించవని, వచ్చిన అవకాశాలను

అందిపుచ్చుకుని, ముందడుగు వేయాలన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam