DNS Media | Latest News, Breaking News And Update In Telugu

*ఎర్రచందనం అక్రమ రవాణా ముఠా పట్టివేత*

*27 మంది అరెస్టు... 1.64 టన్నుల  à°Žà°°à±à°°à°šà°‚దనం* 

610 కిలోల సండ్రా దుంగలు, రెండు బొలేరో పికప్ వ్యాన్లు* 

*మూడు కార్లు, మూడు ద్విచక్ర వాహనాలు స్వాధీనం*

*(DNS రిపోర్ట్:

M. మనోహర్, Spl కరస్పాండెంట్ అనంతపురం)*

అనంతపురం, నవంబర్ 02, 2019 (డిఎన్‌ఎస్‌) : అనంతపురం జిల్లా మీదుగా బెంగళూరుకు ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలిస్తున్న ముఠాను

అనంతపురం సబ్ డివిజన్ పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ ముఠాకు చెందిన 27 మంది నిందితులను అరెస్టు చేశారు. ఎర్రచందనం దుంగల లోడ్ తో వెళ్తున్న రెండు

బొలేరో పికప్ వాహనాలు మరియు ఈ లోడ్ వాహనాలకు ఫైలట్ గా వెళ్తున్న మూడు కార్లు, మూడు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా నుండీ 78 ఎర్రచందనం దుంగలు 1.64 టన్నుల

(1,647 కిలోలు), 12 సండ్రా దుంగలు 6.10 క్వింటాళ్లు ( 610 కిలోలు) స్వాధీనం చేసుకున్నారు. వీరంతా అనంతపురం, కడప, నెల్లూరు జిల్లాలకు చెందిన వారు. బంగుళూరుకు చెందిన ఎర్రచందనం

దుంగల వ్యాపారి సహా ఐదుగురు నిందితులు అరెస్టు కావాల్సి ఉంది. శనివారం అనంతపురం డీఎస్పీ జి. వీర రాఘవరెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించి ఇందుకు సంబంధించిన

వివరాలను వెల్లడించారు.

** అరెస్టయిన ముఠా సభ్యుల వివరాలు:

గజ్జల చంద్రశేఖర్ రెడ్డి @ చంద్ర, గోగానపల్లి పురుషోత్తమ్ రెడ్డి, ఓటూరి బాలకుళ్ళాయప్ప @ బాల,

బాలీపోగు చిన్న కదిరయ్య @ కన్నయ్య, కుడుముల వేంకటేశ్వర రెడ్డి @ వెంకట్, గద్దె రాజేష్ కుమార్ రెడ్డి @ రాజేష్, గురివిరెడ్డి నాగపుల్లారెడ్డి @ రామారాప్, బుడిమిగుండ్ల

రవిశంకర్ @ రవి, బుడమిగుండ్ల శేఖర్ @ చిన్న రాజు, చీమల యుగంధర్ రెడ్డి, యాపర్ల నరేశ్ కుమార్ రెడ్డి @ నరేశ్, మట్టి శ్రీనివాసులు @ మట్టి సీనా, ముడియం మనికంట @ మనీ, షేక్

మీరావలి @ మీరా, నల్లమాడు శివకుమార్ రెడ్డి @ మల్లేశ్, కొండా ధరణి కుమార్ రెడ్డి @ ప్రెసిడెంట్, 
చాపల సాయిశ్రీధర్ రెడ్డి @ శ్రీధర్, చిలేకమ్ కొండారెడ్డి @ యర్రోడు,

యర్రపరెడ్డి సురేంద్ర రెడ్డి, దాసరి ప్రవీణ్ కుమార్, అందె వెంకటరమణ @ రమణ, à°…à°°à°µ రామసుబ్బారెడ్డి, ఆగరు సురేంద్ర, వయస్సు  à°…ంగలకుర్తి అనిల్ కుమార్ @ అనిల్, కారంపూడి

రవిచంద్ర @ రవి, ద్రోణాదుల సుబ్బాచారి, నరెడ్డి శివకృష్ణా రెడ్డి @ శివ @ కృష్ణ

** స్వాధీనం చేసుకున్నవి:

1) 78 ఎర్రచందనం దుంగలు 1.64 టన్నుల (1,647 కిలోలు)
2) 12 సండ్రా దుంగలు 6.10

క్వింటాళ్లు ( 610 కిలోలు)
3.) మహీంద్రా బొలెరో pickup వ్యాన్ నెంబర్  APO4 TW 3680,
4. 30 OOO S°380 pickup JS నెంబర్ APO2 VZ TR 3079,
5. Sy to 506 నెంబర్ APO2 AR 9899,
6. మహీంద్రా XUV కార్ నెంబర్ AP02 BJ 0004,
7. Svovel Kuws Alto 800 506 నెంబర్  AP24 AJ 1616
8. Hero Passion Pro Zvejo use నెంబర్  APO2 AR 9439,
9. Bajaj Pulsar Burcu 6

335 నెంబర్  AP04 AG 9840
10. Yamaha FZ 3r6J63305 నెంబర్  AP04 BH 8392.

** నేపథ్యం: ఈ ముఠాలో ప్రస్తుతం అరెస్టయిన 27 మందిలో నలుగురు కీలక నిందితులు. వీరిలో గజ్జల చంద్రశేఖర్ రెడ్డి, గోగానపల్లి

పురుషోత్తంరెడ్డి, ఓటూరి బాల కుళ్లాయప్ప, బాలిపోగు చిన్న కదిరయ్యలు ముఖ్యులు. వీరితో పాటు మరో ఐదుగురు నిందితులు అరెస్టు కావాల్సి ఉంది.

** శేషాచలం అడవుల్లో

ఎర్రచందనం చెట్లు  à°—ుర్తించి ...

      à°•à°¡à°ª జిల్లా పెండ్లిమర్రి మండల పరిధిలో ఉన్న అటవీ ప్రాంతంలో నాణ్యత కల్గిన ఎర్రచందనం లభిస్తుందని à°† ప్రాంతంలో

 à°Žà°°à±à°°à°šà°‚దనం చెట్లును పరారీలో ఉన్న ఇద్దరు నిందితులు గుర్తిస్తారు. à°ˆ ఇద్దరు ప్రస్తుతం అరెస్టయిన గజ్జల చంద్రశేఖర్ రెడ్డి @ చంద్ర, గోగానపల్లి పురుషోత్తం రెడ్డి,

ఓటూరి బాల కుళ్లాయప్ప @ బాల, బాలిపోగు చిన్న కదిరయ్య @ కన్నయ్యలకు ఆ ప్రాంతంలో ఎర్రచందనం చెట్లు నాణ్యతగా ఉన్నాయని... వాటిని నరికి లోడ్ పంపాలని తెలియజేస్తారు.
**

ఎర్రచందనం చెట్లు నరికి... దుంగలను లోడ్ చేసి
    పరారీలో ఉన్న ఇద్దరి నిందితులతో గజ్జల చంద్రశేఖర్ రెడ్డి @ చంద్ర, గోగానపల్లి పురుషోత్తం రెడ్డి, ఓటూరి బాల

కుళ్లాయప్ప @ బాల, బాలిపోగు చిన్న కదిరయ్య @ కన్నయ్యలు ఒప్ఫందం చేసుకుని ముందుగానే ధర మాట్లాడుకుంటారు. ఆ వెంటనే కూలీలను, అందుకు కావాల్సిన కోత సామాగ్రి మరియు లోడ్

తీసికెళ్లేందుకు వాహనాలను అక్కడికి ఈ నలుగురు తీసికెళ్తారు. కూలీలకు, కోత సామాగ్రి, వాహనాల డ్రైవర్లు, ఫైలెట్ వాహనాల నిందితులకు డబ్బు చెల్లించి మిగితా మొత్తం ఈ

నలుగురు తీసుకుంటారు. వీరికి భారీ మొత్తంలోనే డబ్బు మిగులుతుంది. ఇలా... ఎర్రచందనం చెట్లను నరికి ఆ దుంగలను బొలేరో పికప్ వాహనాల్లో లోడ్ చేస్తారు.
** లోడ్ వాహనాలకు

ఫైలెట్ గా వాహనాలు... మనుష్యులు

      పెండ్లమర్రి మండలం పొలతలగుట్ట అటవీ ప్రాంతంలో చెట్లు నరికి à°† దుంగలను లోడ్ చేసుకుని వస్తున్న వాహనాలకు ఫైలెట్ à°—à°¾ కార్లు ,

ద్విచక్ర వాహనాలు వెళ్తాయి. పోలీసుల తనిఖీలు ఉంటే లోడ్ వాహనాల డ్రైవర్లకు ముందే సమాచారం ఇవ్వడం, రహదారులు మళ్లించడం ... ఎవరైనా అడ్డుకుంటే వారిపై దాడి చేసేందుకు

భారీ సంఖ్యలో వీరు వెళ్తారు.
 
 ** అరెస్టు ఇలా... రాబడిన పక్కా సమాచారం మేరకు అనంతపురం డీఎస్పీ పర్యవేక్షణలో  à°‡à°Ÿà±à°•à°²à°ªà°²à±à°²à°¿, అనంతపురం రూరల్ ఇన్స్పెక్టర్లు

.విజయభాస్కర్ , మురళిధర్ రెడ్డిలు... రాప్తాడు, ఇటుకలపల్లి, నార్ఫల, శింగనమల ఎస్ ఐ లు  P.Y.ఆంజనేయులు, M. శ్రీకాంత్, P.ఫణీంద్రనాథ్ రెడ్డి, రాంభూపాల్ లు మరియు సిబ్బంది కలసి

నాటు సారా స్థావరాల దాడుల కోసం స్థానిక ఫంగల్ రోడ్డు సమీపంలో వెళ్తుండగా ఎర్రచందనం దుంగలు లోడ్ తో వెళ్తున్న వాహనాలు... వీటికి ముందుగా కార్లు, ద్విచక్ర వాహనాలు

అనుమానాస్పదంగా వెళ్తుండటాన్ని పరిశీలించారు. వెంటనే ఆపి విచారిస్తే అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి.

** ప్రశంస... ఎర్రచందనం దుంగలు జిల్లా గుండా అక్రమరవాణా

జరుగుతుండటాన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని దుంగలు, వాహనాలు స్వాధీనం చేసుకోవడం, 27 మందిని అరెస్టు చేయడంపై జిల్లా ఎస్పీ భూసారపు సత్య ఏసుబాబు అనంతపురం సబ్

డివిజన్ పోలీసులను అభినందించారు. ఈ పోలీసు అధికారులు, సిబ్బందికి రివార్డులు కూడా ప్రకటించారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam