DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పవన్ . . నీ వెనుక దావూద్ లాంటి వాళ్లున్నారా? : ద్రోణంరాజు సూటి ప్రశ్న 

పవన్ కళ్యాణ్ కు విఎంఆర్డిఎ చైర్మన్ ద్రోణంరాజు సూటి ప్రశ్న 

అవినీతి నిరూపిస్తే మంత్రి సహా రాజీనామా చేస్తాం: ఎంపీ à°Žà°‚ వివి 

అజ్ఞానవాసి పవన్ కూడా

బాబు లాంటి కసాయిని నమ్మాడు...

కాపులకు నువ్వే "కాపు" ననుకున్నావా? : మంత్రి అవంతి 

ఒక సినిమా ఖర్చు భవన కార్మికులకు ఇవ్వలేకపోయావా ?

జనసేనాని పై

విరుచుకు పడ్డ వైకాపా బృందాలు 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS) : . . .

విశాఖపట్నం, నవంబర్ 04, 2019 (డిఎన్‌ఎస్‌) : జనసేన పవన్ కళ్యాణ్ . . ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై

అవాకులు చెవాకులు, అసత్యాలు ఇబ్బడి ముబ్బడిగా వ్యాఖ్యానిస్తున్నావ్  . . . నీ వెనుక ఉన్నవారెవ్వరో చెప్పాలని, చంద్రబాబు లాంటి వెన్నుపోటు దారుడున్నాడా లేక మాఫియా

డాన్ దావూద్ లాంటి వాళ్లున్నారా? స్పష్టంగా చెప్పాలని విఎంఆర్డిఎ చైర్మన్ ద్రోణంరాజు డిమాండ్ చేసారు. సోమవారం నగరం లోని ఓ హోటల్ లో నిర్వహించిన విలేకరుల సమావేశం

లో అయన మాట్లాడుతూ కోట్లాది మంది ప్రజలు ప్రజాస్వామ్య పద్దతిలో ఎన్నుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అవాకులు చెవాకులు

వ్యాఖ్యానించడాన్ని తప్పు పట్టారు. ఏ ధైర్యం తో నోటికి వచ్చినట్టుగా తిడుతున్నారో చెప్పాల్సిన భాద్యత అతనిపై ఉందన్నారు. 
ఇసుక దొరకటం లేదని, పేదల

ఉపాధిపోయిందని ఆదివారం జనసేన విశాఖ చేసిన లాంగ్ మార్చ్ అసలు రంగు అక్కడ స్టేజిమీద ఉపన్యాసాల్లో వెలిసి పోయిందన్నారు. కేవలం ముఖ్యమంత్రి మీద, విజయసాయి మీద

వ్యక్తిగత విమర్శలు చేయటానికే సరిపోయింది. సిఎంకు విపక్ష నేత హోదాలో మీరు సలహా ఇవ్వండి. కానీ దూషిస్తే ఎలా? ఎన్నుకున్న ప్రజలను అవమానించేలా మాటాడటం తగదు. ఇసుక

కొరత తీరుతుంది. అయిదేళ్ల సుస్థిర పాలనతో మరోసారి ప్రజాభిమానంతో అధికారానికి వస్తారు. మీకేమైనా సిద్ధాంతాలుంటే వాటి ప్రకారం మాటాడండి. జగన్ని తిడితే ఆయన్ను

అభిమానించి గెలిపించిన వారు తిరగబడతారు జాగ్రత్త అని హెచ్చరించారు. 

అవినీతి నిరూపిస్తే అంతా రాజీనామా చేస్తాం: ఎంపీ ఎంవివి 

విశాఖపట్నం లోక్ సభ

సభ్యుడు ఎంవివి సత్యనారాయణ మాట్లాడుతూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ పరిపాలనలో ఒక్క అవినీతి పనిని ఆధారాలతో నిరూపించినా మంత్రి తో సహా అందరూ పదవులకు

రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అత్యద్భుత రీతిలో కనీవినీ ఎరుగని రీతిలో ఉందని, గతం లో

ఎన్నడూ లేని విధంగా ప్రజలందరూ ఆహ్లాదంగా ఉన్నారన్నారు. వైఎస్ జగన్ పై విమర్శలు చేసే స్థాయి ఎవరికీ లేదన్నారు. 

కాపులకు నువ్వే "కాపు" ననుకున్నావా? : మంత్రి

అవంతి 

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఒక అజ్ఞాన వాసి అని, మొత్తం కాపు సామజిక వర్గానికి తానొక్కడినే కాపు ననుకుంటున్నాడని మంత్రి ముత్తంశెట్టి

శ్రీనివాస్ మండిపడ్డారు. సోమవారం నగరం లో నివారహించిన విలేకరుల సమావేశంలో అయన పవన్ కి హితోక్తులు పలికారు. పవన్ కల్యాణ్ టిక్కెట్ లేని సినిమా చూపించారని

అన్నారు. చంద్రబాబు అందరినీ వాడుకుని అవసరం తీరాక విడిచిపెట్టే రకమని, అలాంటిది అతన్ని నమ్మి ప్రజా క్షేత్రంలోకి దిగుతున్నావని, త్వరలోనే నీపని కూడా

అంతేనన్నారు. తెలుగుదేశం పార్టీ పెట్టిన సొంత మావ ఎన్టీరామారావునే వెన్నుపోటు పొడిచిన క్రూరుడు చంద్రబాబు అని, అలాంటి ఏ సంబంధం లేని నువ్వొక లెక్క అని అన్నారు.

   
చంద్రబాబు అందరినీ వాడుకుని వదిలేస్తాడు. గతంలో ఎన్నో ఉదంతాలున్నాయి. వాజపేయి మోడీలను వాడుకుని వదిలేశాడు. గతంలో (2014 లో à°’à°• సారి)  à°¨à°¿à°¨à±à°¨à±‚ అలాగే వాడి వదిలేశాడు.

మళ్లీ ఆ ట్రాప్ లో పడ్డావు. ఆ గోతిలో పడితే జీవితంలో నిన్ను ఎవ్వడూ కాపాడలేదన్నారు.

ఒక సినిమా ఖర్చు కార్మికులకు ఇవ్వలేకపోయావా ?: . . .

భవననిర్మాణ

కార్మికులకు అండగా ఉన్నానని ప్రగల్బాలు పలుకుతున్నావని, నువ్వు ఒక్క సినిమాకు తీసుకునే కోట్లాది రూపాయలు రెమ్యునరేషన్ ఈ కార్మికులకు ఇవ్వలేకపోవని అవంతి

అన్నారు. నీకు చెయ్యి విదిల్చడం చేతగాదు కానీ, నువ్వు కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని విమర్శించడమేనా అన్నారు.  

ఈ విలేకరుల సమావేశంలో విశాఖ

ఉత్తర నియోజక వర్గ (వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ 
) అనధికారిక శాసన సభ్యులు కేకే రాజు, టిటిడి బోర్డు సభ్యుడు, యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు, మాజీ

ఎమ్మెల్యే మళ్ల విజయ్ ప్రసాద్,  à°µà±ˆà°•à°¾à°ªà°¾ నగర అధ్యక్షులు వంశీ కృష్ణ శ్రీనివాస్, కొయ్య ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam