DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్రకృతి వైపరీత్యాలు ఉన్నా. . అధికారుల పనితీరు భేష్. . .

జిల్లా అభివృద్ధిపై నిపుణుల కమిటి సమీక్ష

(DNS రిపోర్ట్ : SV  à°†à°šà°¾à°°à±à°¯à±à°²à±,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚): . . . .

శ్రీకాకుళం, నవంబర్ 04, 2019 (డిఎన్‌ఎస్‌): శ్రీకాకుళం

జిల్లా అభివృద్ధికి ప్రణాళికలు, వ్యూహాలపై  à°°à°¾à°·à±à°Ÿà±à°° అభివృద్ధిపై నియమితమైన నిపుణుల కమిటీ సోమవారం సమీక్షించి. నిపుణుల కమిటీ సమన్వయ అధికారి, విశ్రాంత ఐఏఎస్

అధికారి జి.ఎన్. రావు అధ్యక్షతన కమిటి జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో చర్చించింది. జిల్లాలో సహజవనరులు, వ్యవసాయ, పారిశ్రామిక,

పర్యాటక, సాంస్కృతిక రంగాల్లో తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకుంది. చేనేతవృత్తుల వారికి ప్రత్యేకంగా క్లష్టర్లు ఏర్పాటు ప్రతిపాదనలు, ఉద్దానం ప్రాంతంలో

ఆరోగ్య సమస్యల పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలు, శాంతి భద్రతల పరిస్ధితిని అడిగి తెలుసుకున్నారు. తుఫానుల వలన ప్రభావం తగ్గుటకు సరుగుడు వంటి పంట అధికంగా

వేయాలని అటవీ శాఖ అధికారులను సూచించారు.

జాయింట్ కలెక్టర్ డా.కె. శ్రీనివాసులు జిల్లాలో సహజ వనరులు, పరిశ్రమలు, వ్యవసాయ, సాంస్కృతిక తదితర అంశాలను కమిటీకి

వివరించారు. జిల్లాలో 51 శాతం ఎరుపు నేలలు, 41 శాతం రేగడి నేలలు, 6 శాతం ఇసుక నేలలు, 2 శాతం ఇతర నేలలు ఉన్నాయని వివరించారు. సాధారణ వర్షపాతం 1161.5 మిల్లీ మీటర్లని తెలిపారు.

వంశధార ప్రాజెక్టు, వంశధార – నాగావళి అనుసంధానం, ఆఫ్ షోర్ రిజర్వాయర్ పనులు ప్రధానంగా ఉన్నాయని చెప్పారు. వంశధార – బహుదా అనుసంధానానికి రూ.6326.62 కోట్లతో

పరిపాలనాపరమైన ఆమోదం లభించిందని చెప్పారు. ఉద్ధానం ప్రాంతంలో జలధార ప్రాజెక్టు క్రింద ఇంటింటికి కొళాయి కనెక్షన్ అందించుటకు రూ.6 వందల కోట్లతో మంజూరు చేయడం

జరిగిందని చెప్పారు. పలాసలో రూ.50 కోట్లతో కిడ్నీ పరిశోధన మరియు సూపర్ స్పెషాలిటి ఆసుపత్రి మంజూరు జరిగిందని వివరించారు. జిల్లాలో 175 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి

ఉందని, 193 కిలోమీటర్ల మేర సముద్ర తీరప్రాంతం ఉందని వివరించారు. సమృద్ధిగా నీటి వనరులు ఉన్నాయని చెప్పారు. మత్స్య పరిశ్రమ అభివృద్ధికి అనేక అవకాశాలు ఉన్నాయని

తెలిపారు. ప్రస్తుతం వ్యవసాయ రంగంపైనే అధికంగా ఆధారపడటం జరుగుతుందని చెప్పారు. భావనపాడు పోర్టు, ఇచ్ఛాపురం నుండి భోగాపురం వరకు కోస్టల్ కారిడార్ అవకాశాలు

ఉన్నాయని తద్వారా ఆర్ధికంగా పురోగతికి మంచి అవకాశాలు ఉన్నాయని చెప్పారు. గ్రానైట్ పరిశ్రమను ఇంకా అభివృద్ధి దిశగా తీర్చిదిద్దాలని అన్నారు. జిల్లాలో సేవా

రంగాన్ని బాగా విస్తరించుటకు అవకాశం ఉందని చెప్పారు. జిల్లాకు తుఫానుల బెడద ఉందని, పట్టణీకరణ తక్కువగా ఉందని తెలిపారు. వలసలు అధికంగా ఉంటుందని చెప్పారు. ఈజ్ ఆఫ్

డూయింగ్ లో రాష్ట్రంలో జిల్లా ప్రధమ స్ధానంలో నిలిచిందని వివరించారు. జీడి పరిశ్రమ, జనపనార, బుడితి ఇత్తడి సామగ్రి, టెక్కలి ప్రాంతంలో నీలి రంగ గ్రానైట్, పొందూరు

ఖాదీ జిల్లాలో ప్రసిద్ధిగాంచిన రంగాలని వివరించారు. యువతకు నైపణ్య అభివృద్ధి కేంద్రాల ద్వారా శిక్షణ కల్పిస్తూ ఉపాధి, ఉద్యోగ అవకాశాలకు బాటలు వేస్తున్నామని

చెప్పారు. జిల్లాలో ఉద్యోగ మేళాలను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. జిల్లాలో 3868 పాఠశాలల్లో 3,76,224 మంది విద్యార్ధులు విద్యను అభ్యసిస్తున్నారని చెప్పారు. జిల్లాలో

ఎం.ఎం.ఆర్ రేటు 72.06, ఐ.ఎం.ఆర్ రేటు 10.77గా ఉందని తెలిపారు. కంటి వెలుగు పథకాన్ని గత నెల 10వ తేదీన ప్రారంభించి విద్యార్ధులకు, ప్రజలకు నేత్ర పరీక్షలు చేపడుతున్నామని

చెప్పారు. నిపుణుల కమిటీ సభ్యులు ప్రొ.అంజలి కరోల్ మోహన్ మురికివాడల్లో నివసించే ప్రజల గృహ అవసరాలను గూర్చి ప్రస్తావించగా ప్రభుత్వ గృహ పథకాల క్రింద గృహాలను

నిర్మించడమే కాకుండా పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీకి చర్యలు చేపట్టిందని జెసి వివరించారు.

పోలీసు సూపరింటిండెంట్ ఆర్.ఎన్.అమ్మి రెడ్డి మాట్లాడుతూ

జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా జిల్లా యంత్రాంగం సమన్వయంతో అన్ని చర్యలు చేపడుతున్నామని చెప్పారు.

ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి సి.ఎం.సాయికాంత్

వర్మ మాట్లాడుతూ మన్య ప్రాంతంలో రహదారులు, తాగు నీటి మౌళికసదుపాయాలు అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు. రహదారులకు రూ.128 కోట్ల ఖర్చు ద్వారా అన్ని గిరిజన

గ్రామాలకు రహదారి సౌకర్యం కలుగుతుందని చెప్పారు. సీతంపేట ప్రాంతంలో అనాస పంట అధికంగా ఉందని చెప్పారు.

   à°ˆ సమావేశంలో నిపుణుల కమిటీ పట్టణ అభివృద్ధిలో

నిపుణులైన కె.బి.అరుణాచలం, ప్రొ.అంజలి కరోల్ మోహన్, ప్రొ.కె.టి.రవీంద్రన్, డా.మహావీర్, డా.ఏ.వి.సుబ్బారావు, ప్రొ.శివానంద స్వామి, విశ్రాంత ఐ.ఏ.ఎస్ అధికారి

సి.హెచ్.విజయమోహన్,  à°œà°¿à°²à±à°²à°¾ రెవిన్యూ అధికారి బలివాడ దయానిధి, రెవిన్యూ డివిజనల్ అధికారులు à°Žà°‚.వి.రమణ, టివిఎస్ జి కుమార్, ఐ.కిషోర్, డివిజనల్ అటవీ అధికారి సందీప్

కృపాకర్, ఇంజనీరింగు అధికారులు పి.రంగారావు, టి.శ్రీనివాస రావు, బి.రాంబాబు, డి.ఆర్.డి.ఏ పిడి ఏ.కళ్యాణ చక్రవర్తి, జిల్లా నీటియాజమాన్య సంస్ధ పిడి హెచ్.కూర్మారావు,

ఐసిడిఎస్ పిడి జి.జయదేవి, జిల్లా విద్యా శాఖ అధికారి కె.చంద్రకళ, వ్యవసాయ శాఖ ఇన్ ఛార్జ్ జెడి కె.శ్రీధర్, మత్స్యశాఖ జెడి డా.వి.వి.కృష్ణమూర్తి, తదితరులు

పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam