DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వైభవంగా 11 వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు  

ఓర్లాండో వేదికగా వెల్లివిరిసిన తెలుగు భాషా వైభవం 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS) : . . .

విశాఖపట్నం, నవంబర్ 05, 2019 (డిఎన్‌ఎస్‌) : తెలుగు సాహితి వైభవం ఖండాంతరాల్లో

విస్తరిస్తోంది అనడానికి ఓర్లాండో మహా నగరం లో దిగ్విజయంగా జరిగిన 11వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు ప్రత్యక్ష సాక్షిగా నిలిచింది. మంగళవారం జరిగిన ఈ వైభవంలో

 à°ªà±à°°à°§à°¾à°¨ సమన్వయ కర్త మధు చెరుకూరి నిర్వహణ లో జరిగిన ప్రారంభ సభలో భారత దేశం నుంచి మొదటి సారిగా అమెరికా ఆహ్వానిత అతిధులుగా విచ్చేసిన ‘శతావధాని” à°¡à°¾. రాంభట్ల

పార్వతీశ్వర శర్మ చేసిన ప్రసంగం ఆద్యంతం ఆహుతులను ఆకట్టుకుంది.  à°•à°¾à°°à±à°¯à°•à±à°°à°®à°‚లో శర్మ తో పాటు జ్యోతి వలబోజు,  à°šà±†à°°à±à°•à±‚à°°à°¿ రమాదేవి, ఎస్. నారాయణ స్వామి, వంశీ రామరాజు

 à°®à±à°‚దుగా జ్యోతి ప్రజ్వలన చేయగా, రాధికా నోరి ప్రార్ధనా గీతంతో సభ శుభారంభం అయింది. ఓర్లాండో మహా నగర తెలుగు సంఘం (TAGO) అధ్యక్షులు నరొత్తమ్ జీడిపల్లి సభికులకి

స్వాగతం చెప్పగా, ప్రధాన అతిధుల సముచిత ప్రసంగాలు సాహితి వైభవంగా సాగాయి. 

ఓర్లాండో మహా నగరం లో బాలబాలికలకి తెలుగు నేర్పుతున్న ఉపాద్యాయులకి (సత్య మంతెన,

చంద్రశెఖర్ అయ్యలరాజు, ప్రవీణ పల్లమరెడ్డి, సారిక శ్రీరామ్, ధరణి ఎర్రా) చిరు సత్కారం జరిగింది. సభలో జరిగిన అంశాలు . .. 

పుస్తకావిష్కరణలు:

మూడు విడతలలో

జరిగిన పుస్తకావిష్కరణ వేదికలలో ఈ క్రింది నూతన గ్రంధాలు ఆవిష్కరించబడ్డాయి. సదస్సుకి వచ్చిన ప్రతినిధులకి ఇచ్చిన నమోదు సంచీలో ఇంచుమించు ఈ గ్రంధాలు అన్నీ

ఉచితంగా బహూకరించబడ్డాయి.  

వంగూరి సంస్థ ప్రచురణలు: అమెరికా తెలుగు కథానిక -14: అమెరికులాసా కథలు (వంగూరి చిట్టెన్ రాజు); నాట్య  à°­à°¾à°°à°¤à±€à°¯à°‚ (ఉమా భారతి కోసూరి); కాళీ

పదములు & కాకీక కాకికి కాక (పాలపర్తి ఇంద్రాణి); తెన్నేటి సుధ కథలు: “రంగంటే ఇష్టం”(చాగంటి తులసి); చైతన్యం కథలు (సుధేష్ణ సోమ), “à°•à°‚à°Ÿà°¿ వైద్యం లో ప్రాచీన భారత దేశం

విజ్ఞాన సంపద” (à°¡à°¾. వి.కె.రాజు); తెలుగే గొప్ప భాష -కానీ కనుమరుగౌతున్నది (పారుపల్లి కోదండ రామయ్య)  

ఇతర ప్రచురణలు: కొత్త కథలు-2019;  à°ªà±à°°à°µà°¾à°¸à°¾à°‚ధ్రుని పరి వేదన: à°¡à°¾.

జి.వి.ఆర్.కె.శర్మ; పాలంకి కథలు – à°¡à°¾. శారదా పూర్ణ: “కళల కాణాచి”- à°¡à°¾. ప్రభల జానకి; రాజీవ నేత్రుడా” అయ్యప్ప స్వామి మధుర గీతాల సీడీ

అట్లాంటా నుంచి వచ్చిన పెమ్మరాజు

లక్ష్మీ రావు గారు బాపు గారి 36 తిరుప్పావై పంచ రంగుల వర్ణ చిత్రాల అల్లిక ఆవిష్కరణ ప్రత్యేక ఆకర్షణ à°—à°¾ నిలిచింది.  

ప్రసంగ వేదికలు:

ఈ రెండు రోజుల సభలో

జరిగిన ప్ర్రసంగ వేదికలు ఎస్. నారాయణ స్వామి సమర్ధవంతమైన నిర్వహణలో జరిగాయి. ఆ వేదికలలో రచయితలు సుమారు 75 మంది సభికుల సమక్షం లో ఎంతో ఉత్సాహంతో ఈ క్రింది సాహిత్య

ప్రసంగాలు చేశారు. వీరిలో కనీసం పది, పదిహేను మంది ఫ్లారిడా రాష్త్రం వారే కావడం చెప్పుకోదగ్గ విశేషం.

జ్యోతి వలబోజు: అంతర్జాలంలో తెలుగు

ప్రస్థానం

అత్తలూరి విజయ లక్ష్మి: శరత్ నవలలో శ్రీకాంత్

ప్రభల జానకి: కురు వంశ కుల వధువులు......ధర్మ మూర్తులు

పద్మ వల్లి: కథ చెప్పడం ఓ కళ !

సుభద్ర

వేదుల:కథల్లో కొత్త వస్తువులు కావాలా? కావలిస్తే అవి ఏమిటి? 

లలితా త్రిపుర సుందరి: బ్లాగెడివి కబుర్లట !:

ఇంద్రాణి పాలపర్తి: ‘కథా రచనలో

లోపాలు-కారణాలు

శ్రీనివాస్ నాగులపల్లి: "వెయ్యేళ్ళ తెలుగు సాహిత్యం పై ఒక అవలోకనం"

భాస్కర్ పులికల్: నా సాహిత్య ప్రయాణం
మధిర మూర్తి: ఆంధ్ర సాహిత్య

మకుటము - పోతన భాగవతము

రాధిక నోరి: నా కథలు-సామాజిక స్పృహ

శ్రీనివాస్ సత్తిరాజు: ఆధునిక తెలుగు కవిత్వంలో "నేను" పదప్రయోగం.

భూషణ్: కవిత్వం ఎందుకు

చదవాలి ??; 

ఎస్.నారాయణ స్వామి: నిడదవోలు మాలతి సాహిత్యం

వంశీ రామరాజు: గుర్తుకొస్తున్నారు: సినారె, రాయప్రోలు;  

ఉమా భారతి: సర్వకళా సారం

సాహిత్యం

శారదా పూర్ణ శొంఠి: నేను , నా రచనలు, నా ప్రచురణలు 

అపర్ణ యేలూరిపాటి:సాహిత్యం లో కుటుంబ వ్యవస్థ.

భరద్వాజ కిశోర్: వలస వచ్చిన

సంస్కృతి

విన్నకోట రవిశంకర్:  "కవిత్వంలో ఆశావాదం, నిరాశావాదం"

ప్రత్యేక ప్రసంగాలు, స్వీయ కవితలు: ‘శతావధాని’ à°¡à°¾. రాంభట్ల పార్వతీశ్వర శర్మ; శారద

కాశీవజ్జుల తదితరులు.

కథాపూరణ:

మా ఆనవాయితీ ప్రకారం నారాయణ స్వామి నిర్వహణలో అతను ఎంపిక చేసిన ఒక కథని సగం తుంచేసి మొదటి రోజున అందరికీ ఇచ్చి, ఆ కథని

పూరించమని అడుగుతాం. ఆ మర్నాడు దానికి వచ్చిన సభికుల స్పందనలలో న్యాయ నిర్ణేతలకి నచ్చిన మూడు పూరణలకి బహుమతులు ఇస్తాం. ఈ సారి ఆ పోటీలో ఈ క్రింది వారు బహుమతులు

అందుకున్నారు:

ప్రధమ బహుమతి: శారద కాశీవఘ్ఘుల (కాలిఫోర్నియా)

రెండవ బహుమతి; శ్రీనివాస్ నాగులపల్లి (ఓర్లాండో)

మూడవ బహుమతి; జ్యోతి వలబోజు (హైదరాబాద్)

 

మొదటి రోజు ప్రసంగ వేదికల అనంతరం పురస్కార సభలో à°ˆ క్రింది ఆత్మీయ సత్కారాలు జరిగాయి.  

జీవన సాఫల్య పురస్కారం:

అమెరికాలో తెలుగు సాహిత్యాన్ని

సుసంపన్నం చేసిన వారిని సగౌర్వంగా గుర్తించి సత్కరించే సాంప్రదాయం లో ఈ 11వ అమెరికా తెలుగు సాహితీ సదస్సులో ప్రముఖ రచయిత సత్యం మందపాటి & విమల దంపతులకి జీవన

సాఫల్య పురస్కారం శోభాయమానంగా జరిగింది.

భారత దేశ ఆహ్వానిత అతిధుల పురస్కారం:

మొదటి రోజు సాయంత్రం జరిగిన పురస్కార సభలో భారత దేశ అతిధులైన డా. రాంభట్ల

పార్వతీశ్వర శర్మ, జ్యోతి వలబోజు, ప్రభల జానకి, అత్తలూరి విజయ లక్ష్మి గార్లకి ఆత్మీయ జ్ఞాపిక తో చిరు సత్కారం జరిగింది.

నిర్వాహకులకి సభికుల

ధన్యవాదాలు:

 à°ˆ సదస్సు నిర్వహణ లో ప్రధాన సమన్వయ కర్తగా అన్ని ఏర్పాట్లూ చేసి, సభ విజయవంతం à°—à°¾ జరగడానికి ప్రధాన కారకుడైన మధు చెరుకూరి à°•à°¿ కుటుంబ సమేతంగా

ఆత్మీయ జ్ఞాపిక తోటీ, టాగో సంస్థ అధ్యక్షులు నరోత్తమ్ జీడిపల్లి, ఇతర అధికారులకీ దుశ్శాలువల తో సత్కరించి సభికులు తమ ధన్యవాదాలు తెలుపుకున్నారు.

ఘంటసాల

ఆరాధనోత్సవాలు:  

సాహితీ సదస్సు అనంతరం 12à°µ ఘంటసాల ఆరాధనోత్సవాలు -9à°µ బాలూ సంగీతోత్సవ కార్యక్రమం లో ‘అపర ఘంటసాల” బాల కామేశ్వర రావు (హైదరాబాద్), శారద ఆకునూరి

(హ్యూస్టన్), రాధిక నోరి (టాలహస్సీ), సత్య కడాలి (కొలంబియా, NC)ల సినీ సంగీత విభావరి కార్యక్రమం జరిగింది. వంశీ రామరాజు గారు హైదరాబాద్ లో గత 31 సంవత్సరాలగా నిర్వహిస్తున్న

దివ్యాంగ బాలబాలికల సంక్షేమ సంస్థ వేగేశ్న ఫౌండేషన్ కి విరాళాల సేకరణ కోసం జరిగిన ఈ కార్యక్రమానికి శ్రోతలు ఉదారంగా స్పందించారు.

రెండు రోజుల ఎంతో

ఆహ్లాదకరమైన సాహిత్య వాతావరణం లో ఆత్మీయంగా జరిగిన 11à°µ అమెరికా తెలుగు సాహితీ సదస్సు  à°’ర్లాండో మహా నగర తెలుగు సంఘం వారి వందన సమర్పణ తో విజయవంతంగా ముగిసింది.  

/>  


Latest Job Notifications

Panchangam - Dec 3, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam