DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ ఉత్తరం గంట  బీజేపీ కి  "జే " కొడుతుందా?

రాం మాధవ్ తో గంటా భేటీ - మరి త్వరలోనే ముహూర్తం.. ..

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి) : . . .

అమరావతి,  à°¨à°µà°‚బర్ 08, 2019 (డిఎన్‌ఎస్‌): మాజీ మంత్రి. విశాఖ ఉత్తర

నియోజక ఎమ్మెల్యే (తెలుగుదేశం) గంటా శ్రీనివాస రావు తెలుగుదేశానికి గుడ్ బై చెప్పాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది..రెండు రోజులుగా ఢిల్లీలో మకాం వేసిన గంటా

తాజాగా బీజేపీ ముఖ్యనేత రాం మాధవ్ తో సమావేశమయ్యారు. తాను బీజేపీలో చేరేందుకు సంసిద్దత వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. రెండు రోజులుగా రాజ్యసభ

సభ్యుటు..టీడీపీ నుండి బీజేపీలో చేరిన సుజనా చౌదరి..సీఎం రమేష్ తో గంటా చర్చలు జరిపారు. వారి ద్వారా రాం మాధవ్ తో సమావేశమయ్యారు. బీజేపీలోకి వచ్చేందుకు మరో ఇద్దరు

టీడీపీ ఎమ్మెల్యేలు సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. వారిద్దరితో ఇప్పటికే కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి మంతనాలు సాగించినట్లు సమాచారం. ప్రకాశం జిల్లాకు

చెందిన సీనియర్ ఎమ్మెల్యేతో పాటుగా..విశాఖ జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్యే సైతం బీజేపీలో చేరేందుకు సిద్దంగా ఉన్నారని చెబుతున్నారు. గంటా ఇక..వైసీపీలో కాకుండా

బీజేపీలోనే చేరటం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.దీంతో..ఆ ఇద్దరు ఎమ్మెల్యేల్లో ఒకరు గంటాతో నడవటానికి సిద్దంగా ఉన్నారు. ప్రకాశం జిల్లాకు చెందిన ఎమ్మెల్యే

సుజనా చౌదరితో టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. రాం మాదవ్ తో భేటీ సమయంలో నూ గంటా తో ఈ అంశాల మీద చర్చ జరిగినట్లు సమాచారం. ముందుగా ఈ నెల 10న గంటా టీడీపీకి రాజీనామా

చేసి..బీజేపీలో చేరాలని భావించినట్లు చెబుతున్నారు. అయితే, తన సన్నిహితులతో మాట్లాడి పార్టీలో చేరిక ముహూర్తం పైన నిర్ణయం తీసుకుంటానని గంటా చెప్పినట్లు

సమాచారం. దీని ద్వారా..ఆయన టీడీపీని వీడుతున్నట్లుగానే భావించాల్సి ఉంటుందని విశాఖ నేతలు చెబుతున్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam