DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఈ యాప్ ఉంటే మీ ఇల్లు అత్యంత సురక్షితమే. :ఎస్పీ అమ్మిరెడ్డి

లాక్డ్ హౌస్ మోనిటరింగ్ సిస్టం యాప్ పై అవగాహనా 

ప్రజలకు అవగాహనలో శ్రీకాకుళం పోలీసు యంత్రాంగం నిమగ్నం  

(DNS రిపోర్ట్ : SV  à°†à°šà°¾à°°à±à°¯à±à°²à±,  à°¸à±à°Ÿà°¾à°«à±

రిపోర్టర్,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚) : . . . .

శ్రీకాకుళం, నవంబర్ 08, 2019 (డిఎన్‌ఎస్‌):  à°®à±€à°°à± ఇంటికి తాళం వేసి ఏదైనా ఊరు వెళ్తున్నారా. .. అయితే à°ˆ యాప్ మీ దగ్గర ఉంటే ఎటువంటి బెంగ అవసరం

లేదంటున్నారు శ్రీకాకుళం పోలీసు అధికారులు. శుక్రవారం నగరం లోని బ్యాంకర్లు కోలనీ సహా,  à°ªà°²à± కోలనీల్లోని ప్రజలకు లాక్డ్ హౌస్ మోనిటరింగ్ సిస్టం (LHMS ) యాప్ పై

అవగాహనా జిల్లా ఎస్పీ ఆర్ ఎన్  à°…మ్మిరెడ్డి నేతృత్వంలో ఆవాహన సదస్సులు నిర్వహించారు. గతంలో ఇళ్ళకి భద్రంగా తాళాలు వేసి ప్రక్క వీధికి వెళ్లినా సురక్షితంగా

ఉంటుందన్న గ్యారంటీ లేకుండా పోయేదని, అయితే à°ˆ తరహా బెంగలకు అత్యంత కట్టుదిట్టమైన పరిష్కారం  (LHMS ) యాప్ వచ్చిందన్నారు.  

ఈ యాప్ ను సద్వినియోగం చేసుకునే పద్దతి

ఇదే. . .:

దీన్ని ఫోన్ లో డౌన్లోడ్ చేసుకుని మీ పేరు, వివరాలు, చిరునామా, మొబైల్ నెంబర్, తదితర అంశాలతో మీ దరఖాస్తు ను నింపితే స్థానిక పోలీసు అధికారులు దీన్ని తమ

వద్ద రిజిస్టర్ చేసుకుని, దరఖాస్తు దారునికి à°’à°• ఐడి ఇవ్వడం జరుగుతుందన్నారు. 

ఆ దరఖాస్తు దారుడు ఎప్పుడైనా ఇల్లు దాటి ఊరు వెళ్ళవలసి వచ్చినా, రెండు రోజులు

ఇంటి కితాళం వేసి బయటకు వెళ్ళవలసి వచ్చినా, à°ˆ యాప్ లో వివరాలు తెలియచేస్తూ పోలీసు సహాయాన్ని కోరవచ్చు అని తెలిపారు. 

ఎన్ని రోజులు ఇంటికి తాళం వేస్తున్నారో

తెలియచేయాల్సి ఉంటుందన్నారు. à°ˆ వివరాలను మీ ప్రాంతంలోని పోలీసులకు తెలియచేయాల్సి ఉంటుంది. 

అనంతరం ఆయా ప్రాంత పోలీసులు సమాచారమిచ్చిన ఇంటికి వచ్చి వైర్

లెస్ మోషన్ కెమెరాను ( కెమెరా ముందు కదలికలు కనిపిస్తే చాలు తక్షణం రికార్డు చేసేస్తుంది), దానికి సంబంధించిన మోడెమ్ ( వై ఫై ) ను అమర్చడం జరుగుతుందని

తెలిపారు. 

ఆ క్షణం నుంచి ఈ ఇల్లు పోలీసు సాంకేతిక పహారాలోకి వెళ్ళిపోతుందని వివరించారు. సాంకేతిక పరిజ్ఞానం తో ఈ కెమెరాను పోలీసు కంట్రోల్ రూమ్ కు, ఇంటి

యజమాని మొబైల్ కు అనుసంధానం చేయడం జరుగుతుందన్నారు. 

కెమెరా ముందు ఏవైనా కదలికలు జరిగితే తక్షణం ఫోటో లు, వీడియో లు తీసి కంట్రోల్ రూమ్ కు పంపే సౌలభ్యం

ఉందని తెలియచేసారు. 

ప్రజలందరూ ఈ యాప్ లో తమ వివరాలు నమోదు చేసుకుని మీ ఇళ్లను సురక్షిత పరుచుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. గతం లో ఎన్నడూ లేని విధంగా

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలోనూ ఈ యాప్ పై అవగాహనా కల్పిస్తున్నట్టు తెలిపారు. ప్రధానంగా శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా అన్ని పట్టణాల

పరిధిలోని పోలీసు స్టేషన్లలోనూ ఈ అవగాహనా కల్పిస్తున్నామన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకుని, పోలీసు యంత్రాంగం తో సహకరించి, మీ ఇళ్లను సురక్షిత

పరుచుకోవాలని సూచిస్తున్నారు. à°ˆ అవగాహనా సదస్సుల్లో  à°ˆ విధానాన్ని తెలియచేసే లఘు చిత్రాలను ప్రదర్శించారు. సుమారు 150  à°®à°‚దికి పైగా స్థానికులు పాల్గొన్నారు.  
à°ˆ

కార్యక్రమం లో డి ఎస్ పి లు సత్యనారాయణ, డి ఎస్ ఆర్ వి ఎస్ ఎన్ మూర్తి, సి ఐ లు లలితకుమారి, రమణమూర్తి, ఎస్ ఐ లు, బ్యాంకర్లు కోలనీ అధ్యక్షులు బివి సత్యనారాయణ రెడ్డి,

ఓంకార రావు తదితరులు పాల్గొన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam