DNS Media | Latest News, Breaking News And Update In Telugu

క్షీరసాగర మధనం మొదలైన రోజే క్షీరాబ్ధి ద్వాదశి.

సర్వరోగ నివారిణి తులసీ ఆరాధనే ప్రాశస్త్యం. 

రిపోర్ట్ : కళ్యాణి CSV , స్టాఫ్ రిపోర్టర్,  à°µà°¿à°¶à°¾à°–పట్నం): . . .

విశాఖపట్నం, నవంబర్ 09, 2019 (డిఎన్‌ఎస్‌):  à°•à±ƒà°¤à°¯à±à°—ంలో

దేవదానవులు క్షీరసాగరాన్ని మథించడం ప్రారంభించిన రోజే- క్షీరాబ్ధి ద్వాదశి. అమృత సాధనే లక్ష్యంగా ప్రారంభమైన సాగర మథనం ఎన్నో విశేషాంశాల్ని సాకారం చేసింది. ఈ

ద్వాదశినే చిలుకు ద్వాదశి, తీర్థాన ద్వాదశి, యోగేశ్వర ద్వాదశి, విభూతి ద్వాదశి, గోవత్స ద్వాదశి, నీరాజన ద్వాదశి, హరిబోధిని ద్వాదశి... ఇలా పలు రీతుల్లో వ్యవహరిస్తారు.

క్షీరాబ్ధి ద్వాదశికి ముందురోజు ఉత్థాన ఏకాదశి. క్షీరసాగరంలో శేషతల్పంపై శ్రీ మహావిష్ణువు ఆషాఢ శుద్ధ ఏకాదశినాడు పవళించి, కార్తిక శుద్ధ ద్వాదశినాడు తన దర్శన

భాగ్యాన్ని దేవతలందరికీ అనుగ్రహించిన ఈ పావన తరుణాన్ని దేవ ద్వాదశిగానూ పిలుస్తారు. క్షీరసాగరం నుంచి ఆవిర్భవించిన శ్రీమహాలక్ష్మిని, విష్ణువు కార్తిక శుద్ధ

ద్వాదశినాడే పరిణయం చేసుకున్నాడంటారు. లక్ష్మీసమేతంగా నారాయణుడు బ్రహ్మాది దేవతల సహితంగా బృందావనానికి ఈ రోజు విచ్చేస్తాడని విశ్వాసం. అందుకే ఇది బృందావన

ద్వాదశి అయింది. బృంద అనే విష్ణుభక్తురాలు తులసి మొక్కగా అవతరించి విష్ణుకృపను సాధించింది క్షీరాబ్ధి ద్వాదశినాడే! 

  క్షీరాబ్ధి ద్వాదశిని వ్రతవిధాన

పూర్వకంగా అవలంబిస్తారు. బృంద (తులసి), ధాత్రి (ఉసిరి) అనే జంట దేవతల్ని ఆరోగ్యప్రదాయక మూర్తులుగా విష్ణుపురాణం వెల్లడించింది. శ్రీహరి కరుణతో ఔషధ మొక్కలుగా ఆ

ఇద్దరూ జన్మించి, మానవాళికి ఆరోగ్య భాగ్యాన్ని అందిస్తున్నారు. అందుకు కృతజ్ఞతగా విష్ణుసహితంగా తులసి, ఉసిరి మొక్కల్ని నేడు విధివిధానయుక్తంగా అర్చిస్తారు.

క్షీరాబ్ధి ద్వాదశి నాటి నుంచి ముక్కోటి ఏకాదశి వరకు తులసి రసం, ఉసిరి రసం, తేనె కలిపిన ‘దేవదత్తం’ అనే మిశ్రమాన్ని నిత్యం స్వీకరించేవారికి à°•à°« సంబంధిత దోషాలు

దూరమవుతాయని ‘చరకసంహిత’ సూచించింది. అందుకే విష్ణువుకు à°ˆ దేవదత్తాన్ని నేడు నివేదించి, ప్రసాదంగా భక్తులు స్వీకరించే సంప్రదాయం ఉంది. తులసి, ఉసిరి మొక్కల

సమక్షంలో ‘మహాద్వాదశి దీపం’ పేరిట ఆవునేతి దీపాన్ని నేటి సూర్యాస్తమయ సందర్భంలో వెలిగిస్తారు. లక్ష్మీనారాయణుల్ని అష్టోత్తర సహితంగా పూజించి, ఉసిరికాయల్ని

నివేదన చేసి, వాటిని ప్రసాదంగా వితరణ చేయాలని ‘కృత్యసార సముచ్ఛయం’ వెల్లడిస్తోంది. కార్తిక శుద్ధ ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి తిథుల్ని

‘చాతుర్వర్థకాలు’à°—à°¾ చెబుతారు. ద్వాదశినాడు వెలిగించిన దీపాన్ని పౌర్ణమి వరకు à°…à°–à°‚à°¡à°‚à°—à°¾ కొనసాగించడం ద్వారా శివకేశవుల అనుగ్రహం సిద్ధిస్తుందని చతుర్వర్గ

చింతామణి వివరించింది.
  క్షీరాబ్ధి అంటే పాలసముద్రం. మన మనసే క్షీరసాగరం. మనసనే సముద్రంలో నిరంతరం మేధామథనం జరగాలి.  à°ªà±à°°à°¤à°¿à°•à±‚లమైన ఆలోచనలనే విషాన్ని

పరిత్యజించాలి. అమృతత్వ సాధనకు నిరంతరం పురోగమించాలి. ఆధ్యాత్మిక చింతనతో సానుకూల భావగరిమను పెంపొందించుకోవాలి. అల్లకల్లోలమైన తరంగాల వలె మన మనోజలనిధిలో

ఆలోచనల పరంపర అస్తవ్యస్తంగా ఉంటుంది. స్థితికారకుడైన విష్ణువును మన మనసు పాలకడలిపై ప్రతిష్ఠించుకోవడం ద్వారా మానసిక ప్రశాంతి లభిస్తుంది. ప్రతి హృదయమూ

విష్ణునివాసమై తేజరిల్లుతుంది. ఇదే క్షీరాబ్ధి ద్వాదశి అందించే ఆత్మీయ ఆధ్యాత్మిక సందేశం.

శ్రీహరికి, శంకరుడికి ప్రియమైన కార్తిక మాసం ఎన్నో పర్వదినాల

సమాహారం. శివకేశవుల అభేదాన్ని ఆవిష్కరిస్తూ, అద్వైతమైన ఆధ్యాత్మిక భావ పరివ్యాప్తికి కార్తికంలో ఆచరించే ప్రక్రియలు దోహదపడతాయి. కార్తికంలో ప్రధానంగా

పంచవిధుల్ని పాటిస్తారు. పవిత్ర స్నానం, దీపారాధనం, వ్రతాచరణం, దాన సమర్పణం, దైవదర్శనం- అనే పంచకృత్యాలు హరిహరుల అనుగ్రహాన్ని అందిస్తాయని కార్తిక పురాణం

ప్రస్తావించింది.


Latest Job Notifications

Panchangam - Dec 3, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam