DNS Media | Latest News, Breaking News And Update In Telugu

శ్రీరామ కుటుంబంలో కీలకం రామ న్యాయవాది పరాశరన్

ఎవ్వరినీ నొప్పించక, తానొవ్వక వాదించిన తీరు అమోఘం.

అందరికీ ఆదర్శం à°ˆ  à°¨à±à°¯à°¾à°¯ ధురంధర వయోవృద్ధ అడ్వకేట్  

రామ్ లల్లా విరాజమాన్ న్యాయవాదిగా నిలిచిన

ఈయన పద్మ విభూషణుడే. . . 

సంకల్ప బలమే . . శాశ్వత పరిష్కారాన్ని చూపింది. 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS) : . . .

విశాఖపట్నం, నవంబర్ 09, 2019 (డిఎన్‌ఎస్‌) : సుమారు 150 ఏళ్లకు పైబడి

వివాదం లో నడుస్తున్న అయోధ్య రామజన్మ భూమి చిట్ట చివరకు భారత అత్యున్నత న్యాయస్థానానికి చేరింది. ఈ కోర్టులో జరిగిన వాదోపవాదాలు ఒక ఎత్తు అయితే. . అక్కడ వాదించిన

న్యాయవాదుల్లో ఒకరు న్యాయమూర్తులతో సహా అందరి మనన్నలూ పొందారు. ఆయనే 92 సంవత్సరాల కే . పరాశరన్.  à°¶à±à°°à±€à°°à°¾à°®à± లల్లా విరాజమాన్ ప్రతినిధిగా న్యాయస్థానంలో అద్భుతమైన

వాగ్ధాటితో ఈ వయసులో న్యాయస్థానంలో నుంచుని మాట్లాడుతుంటే న్యాయ మూర్తి సైతం పెద్దలు, మీరు కుర్చీలో కూర్చుని మాట్లాడవచ్చు, మాకు అభ్యంతరం లేదు అన్నప్పుడు, ఒక

న్యాయవాది ఎప్పుడూ నుంచినే వాదించాలి, తప్ప కూర్చుకూడదు అని ఈయన అన్నట్టుగా కూడా తెలిసింది. à°ˆ ఒక్క సంఘటన చాలు, న్యాయవాద వృత్తిపట్ల ఆయనకు ఉన్న నిబద్దత.  à°¤à°¾à°¨à±‚

వాదించిన సందర్భాల్లో ఎన్నడూ ఇతరులను కించపరిచే వ్యాఖ్యలు చెయ్యక పోవడం, కేవలం ఆ వివాద స్థలంలో శ్రీరామ ఆలయ నిర్మాణ అవసస్యకతను, కోట్లాది మంది హిందూ భక్తుల

మనోభావాలను మాత్రమే తెలియచేయడం గమనార్హం. ఇలాంటి వాళ్ళు భారత అత్యున్నత న్యాయస్థానం లో ఇంకా కొనసాగుతున్నారు కనుకనే న్యాయం నాలుగు కాళ్ళ పై నడుస్తోంది

అనడానికి నిదర్శనం. 1927 లో తమిళనాడు లో జన్మించిన పరాశరన్ తమిళనాడు అడ్వాకేట్ జనరల్ (1976 లో రాష్ట్రపతి పాలనా ఉన్న సమయంలో) గాను, కాంగ్రెస్ పాలనలో (1983 నుంచి 1989 వరకూ ) భారత

అటార్నీ జనరల్ గాను అత్యుత్తమ సేవలు అందించారు. ఈయనను 2003 లో పద్మ భూషణ్ పురస్కారం తోను, 2011 లో పద్మ విభూషణ్ పురస్కారం తోనూ భారత ప్రభుత్వం సత్కరించింది. 2018 నుంచి

రాష్ట్రపతి కొత్త లో భారత రాజ్య సభకు (6 ఏళ్ళ పదవీకాలం) ఎన్నికయ్యారు.  

తానూ జీవించి ఉండగా శ్రీరాముడు జన్మించిన అయోధ్యలోని రామ జన్మ భూమిలో శ్రీరాముని ఆలయ

నిర్మాణం జరుగుతుంది అనే ధృడ సంకల్పంతో న్యాయవాదన ఆరంభించిన ఈయన దృఢ సంకల్పమే à°ˆ అత్యంత ఆకర్షిత వివాదానికి శాశ్వత తీర్పు ను అందించింది. 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam