DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఘనంగా న్యాయ సేవల దినోత్సవం

(DNS రిపోర్ట్ : SV  à°†à°šà°¾à°°à±à°¯à±à°²à±,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ ). .

శ్రీకాకుళం, నవంబర్ 09, 2019 (డిఎన్‌ఎస్‌):  à°œà°¾à°¤à±€à°¯ న్యాయ సేవల దినోత్సవం శని వారం ఘనంగా జరిగింది.

శ్రీకాకుళం జిల్లా న్యాయ సేవాధికార సంస్ధ ఆధ్వర్యంలో ప్రభుత్వ మహిళా కళాశాలలో జాతీయ న్యాయ సేవల దినోత్సవం జరిగింది. ఈ కార్యక్రమాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి

ఎం.బబిత, జిల్లా కలెక్టర్ జె నివాస్, అదనపు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆంజనేయ మూర్తి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.బబిత

మాట్లాడుతూ 1987 నవంబర్ 9వ తేదీన న్యాయ సేవాధికార సంస్థ ద్వారా న్యాయ సేవలను ప్రజలకు అందుబాటులోకి వచ్చిందని అందుకే జాతీయ న్యాయ సేవాధికార దినోత్సవాన్ని

నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. న్యాయ సేవాధికార సంస్థ ద్వారా న్యాయ సేవలను ఉచితంగా పొందవచ్చని చెప్పారు. రాజీపడ దగ్గ కేసులు ఇందులో పరిష్కరించుకోవచ్చని

ఆమె అన్నారు. డబ్బులు పెట్టుకోలేనివారికి సంస్థ న్యాయవాదిని ఏర్పాటు చేస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వ సేవలు అందుతున్న తీరు, పనులను సేవాధికార సంస్థ

పరశీలిస్తుందని చెప్పారు. న్యాయ సేవాధికార సంస్ధ ప్రధానంగా పిల్లలను స్నేహపూరిత వాతావరణంలో సంరక్షించడం, చిన్నారులు, మహిళల అక్రమ రవాణా, గిరిజన సంక్షేమం, మాదక

ద్రవ్యాల ప్రభావం, పారిశుధ్యం, బాధ్యతల నిర్వహణ తదితర అంశాలపట్ల ప్రత్యేకంగా పరిశీలన, తనిఖీలు చేస్తుందన్నారు. న్యాయ సేవాధికార సంస్ధ ఆధ్వర్యంలో విద్యా సంస్ధలు,

వసతి గృహాలు, వివిధ సంస్ధలను తనిఖీలు చేయడం జరుగుతోందని ఆమె పేర్కొన్నారు. ప్రజలు హక్కులు మాత్రమే కాకుండా బాధ్యతలు పాటించాలని, ప్రతీ ఒక్కరూ పారిశుద్ధ్యం

పాటించాలని అన్నారు. అపారిశుధ్యం పాటించి ప్రక్కవారికి ఇబ్బంది కలిగించరాదని ఆమె అన్నారు. ఈ అంశాలపట్ల విద్యాసంస్థలలో లీగల్ లిటరసీ క్లబ్బులు ఏర్పాటు చేసి

అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. మాదక ద్రవ్యాల ప్రభావానికి లోనుకాకుండా ఉండాలి కోరారు. మాదక ద్రవ్యాల ప్రభావ నియంత్రణపై అవగాహన క్లబ్బులు ఏర్పాటు చేయాలని

జాతీయ న్యాయ సేవాధికార సంస్ధ ఆదేశాలు జారీ చేసిందని, త్వరలో వీటిని ప్రారంభిస్తామని అన్నారు. సమాజంలో ఎవరూ నేర పూరిత అంశాల జోలికి వెళ్లరాదని పిలుపునిచ్చారు.

అన్యాయాన్ని ఎదిరించాలని, పరిస్ధితులపట్ల ధైర్యంగా ఉండాలని సూచించారు. ర్యాగింగుకు పాల్పడినా లేదా ఇతర క్రూరమైన విషయాలకు పాల్పడేవారిపై తల్లిదండ్రులకు,

కళాశాల యాజమాన్యానికి తెలియజేయాలని, అప్పటికీ పరిష్కారం లభించకపోతో న్యాయ సేవాధికార సంస్ధకు తెలియజేయాలని కోరారు. 
జిల్లా కలెక్టర్ జె నివాస్ మాట్లాడుతూ

ప్రజలు న్యాయ సేవాధికార సంస్ధ ద్వారాతమ హక్కులను పొందే అవకాశం ఉందన్నారు. ప్రాధమిక అవసరాలు పొందే అవకాశం న్యాయ సేవలు కల్పించిందని చెప్పారు. న్యాయ స్థానాల

ద్వారా సామాన్యులు న్యాయం పొందుతున్నారని అభిప్రాయపడ్డారు. చట్టం అందరకీ సమానమని దానిని న్యాయస్ధానాలు చక్కగా అమలు చేస్తూ న్యాయాన్ని కల్పిస్తున్నారని

చెప్పారు. న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ప్రతీ పౌరుడు న్యాయం పొందే అవకాశం లభించిందన్నారు. హక్కులను తెలుసుకోవాలని, న్యాయ సేవలను ఉపయోగించుకోవాలని, సమాజంలో

మంచి పౌరులుగా ఆదర్శంగా ఉండాలని పిలుపునిచ్చారు. 
జిల్లా అదనపు న్యాయ మూర్తి వి.ఎస్.ఆర్ ఆంజనేయ మూర్తి మాట్లాడుతూ విద్యార్ధులు ఇతర అంశాలపై దృష్టిసారించకుండా

విద్యపై మాత్రమే మనసును కేంద్రీకృతం చేయాలన్నారు. సినిమాల ప్రభావానికి లోనుకారాదని, అబ్దుల్ కలాం వంటి మహా శాస్త్రవేత్తలను ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు.

న్యాయ సేవాధికార సంస్ధకు ఇచ్చే పిర్యాధిదారుల చిరునామా రహస్యంగా ఉంటుందని తెలిపారు. 
శాశ్వత లోక్ అదాలత్ ఛైర్మన్ సి.బి.సత్యనారాయణ మాట్లాడుతూ శాశ్వత లోక్

అదాలత్ ల ద్వారా ఉచితంగా న్యాయ సహాయాన్ని పొందవచ్చన్నారు. న్యాయ వ్యవస్ధకు ప్రత్యామ్నాయ వ్యవస్ధ అన్నారు. శాశ్వత లోక్ అదాలత్ ద్వారా రవాణా సేవలు, పోస్టల్

–టెలిఫోన్ సేవలు., తాగునురు, విద్యుత్, పారిశుధ్య సేవలు., ఆసుపత్రిలో సేవలు, బీమా, బ్యాంకింగు à°°à°‚à°— సేవలు., ఉపాధి హామీ చట్టం, గృహ నిర్మాణం, రియల్ ఎస్టేట్ సేవలు తదితర

సేవలను పరిశీలించడం జరుగుతుందన్నారు. రెండు వర్గాల కక్షిదారుల వాదనలు విని ఒక పక్షం అంగీకరించకపోయినప్పటికి తీర్పు ఇచ్చే అధికారం శాశ్వత లోక్ అదాలత్ కు

ఉందని చెప్పారు. శాశ్వత లోక్ అదాలత్ ఇచ్చిన తీర్పుపై అప్పీలు లేదని, హైకోర్టులో సవాలు చేసే అవకాశం మాత్రమే ఉందని చెప్పారు. 
జిల్లా న్యాయ సేవాధికార సంస్ధ

కార్యదర్శి కె.జయలక్ష్మి న్యాయ సేవాధికార సంస్ధ చేపట్టిన పనులను వివరించారు. 2019 జనవరి 1వ తేదీ నుండి అక్టోబరు 31వ తేదీ వరకు జిల్లా, మండల న్యాయ సేవాధికార కమిటీల

ఆధ్వర్యంలో 131 లోక్ అదాలత్ లలో 2,577 కేసులను పరిష్కరించామన్నారు. వీటిలో ఎం.వి.ఓ.పి కేసులకు రూ.3,95,42,500/-, సివిల్ కేసులకు రూ.2,08,27,683/-, కాంపౌండబుల్ క్రిమినల్ కేసులకు రూ.4,47,69,453/-, వివాహ

సంబంధిత కేసులకు రూ.6,25,30,000/-  à°¨à°·à±à°Ÿà°ªà°°à°¿à°¹à°¾à°°à°‚à°—à°¾ చెల్లింపుకు పరిష్కరించామన్నారు. బ్యాంకు, పోలీసు అధికారులతో సమావేశాలు నిర్వహించి అధిక సంఖ్యలో కేసులు

పరిష్కరించాలని సంబంధిత న్యాయధికారులకు తెలియజేసామని చెప్పారు. నువ్వల రేవులో బాల్య వివాహాలపైన, వివిధ కళాశాలల్లో ర్యాగింగు, ఇతర చట్టాలపైన అవగాహనకు న్యాయ

సేవాధికార సంస్ధ అవగాహన సదస్సులు నిర్వహించిందన్నారు. జిల్లా జైలు, వన్ స్టాప్ సెంటర్, జెజె బోర్డు, వృద్ధాశ్రమం, బి.సి, ఎస్.సి, ఎస్.టి వసతి గృహాలు, బాల సదన్, శిశుగృహ

తదితర సంస్ధలను, కార్యాలయాలను సందర్శించి పనితీరును పరిశీలించామన్నారు. 
ఈ కార్యక్రమంలో ఏఎస్పీ గంగరాజు, అదనపు సబ్ జడ్జి సిహెచ్.వివేకానంద శ్రీనివాస్, జిల్లా

బార్ అసోసియేషన్ అధ్యక్షులు శిస్టు రమేష్, రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు గేదెల వాసుదేవరావు, న్యాయవాదులు గేదెల ఇందిరా ప్రసాద్, పూజారి ఉషారాణి, మహిళా కళాశాల

అధ్యాపకులు, విద్యార్ధులు తదితరులు పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam