DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నేర నియంత్రణ కోసం పటిష్ట ప్రణాళిక : డిజిపి సవాంగ్ 

సాంకేతికత ద్వారా విస్తృత వినియోగం. నేరాలకు బ్రేక్ 

హౌస్ లాకింగ్ యాప్ పై రాష్ట్ర వ్యాప్తంగా అవగాహనా సదస్సులు 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్

అమరావతి) : . . .

అమరావతి,  à°¨à°µà°‚బర్ 11, 2019 (డిఎన్‌ఎస్‌) : రాష్ట్రంలో నేరాల సంఖ్యా పూర్తిగా అదుపు చేసేందుకు పటిష్టమైన ప్రణాళిక అమలు చేస్తున్నట్టు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర

పోలీస్ బాస్ గౌతమ్ సవాంగ్ భాద్యతలు చేపట్టిన నాడే ప్రకటించారు. దానిలో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీసు స్టేషన్లలోనూ సిబ్బందిని అప్రమత్త పరిచారు.

దీనికోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగిస్తున్నారు.  à°ªà±à°°à°§à°¾à°¨à°‚à°—à°¾ మహిళలపై అఘాయిత్యాలు, హత్యలు, కిడ్నప్ లు తదితర భయంకర నేరాలతో పాటుగా తాళాలు వేసిన

ఇళ్లను దోచుకునే చోర బృందాలపై సైతం ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమైంది. దీనిలో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలోని సిబ్బందిని హౌస్

లాక్ మోనిటరింగ్  à°µà°¿à°§à°¾à°¨à°‚ పై ప్రజల్లో అవగాహనా తో పాటు, అప్రమత్తం చేస్తున్నారు. ఇంటికి తాళాలూ వేసి ఊళ్లు వెళ్లే ముందు సమీపం లోని పోలీసులకు తెలియచేయాల్సి

ఉంటుంది. వీళ్ళ మొబైల్ లో ఒక యాప్ ను లోడ్ చేసుకుంటే తాళం వేసిన ఇల్లు పోలీసు పహారలోకి వెళ్తుంది. తద్వారా హౌస్ లూటీ చోరగాళ్ల నుంచి సురక్షితంగా

ఉండవచ్చు. 

అదే విధంగా గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ గల పాత, కొత్త నేరగాళ్ల చిట్టాను సేకరిస్తోంది. తద్వారా ప్రస్తుతం వారంతా ఎక్కడ ఎలా ఉన్నారో

తెలుసుకుని, చట్ట వ్యతిరేకంగా ఉంటె చర్యలకు సిద్దపడుతున్నారు. కేసుల దర్యాప్తు ను వేగవంతం చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. నేరస్తలకు శిక్షలు పడడం లో ఆలస్యం

కాకుండా నేర దర్యాప్తును వేగవంతం చేస్తున్నారు. నేర నిరూపణలో రాష్ట్రంలోని పోలీసులు నిత్యం అప్రమత్తం గా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా అంతరాష్ట్ర ముఠాలతో

చేతులు కలిపే నేరగాళ్లకు ముకుతాడు వేసేందుకు రంగం సిద్ధం చేసారు. సరిహద్దు ప్రాంతాలైన శ్రీకాకుళం, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు జిల్లాలో మరింత కట్టుదిట్టమైన

భాద్యతా చర్యలను ఏర్పాటు చేసారు. ప్రతి పట్టణంలోనూ తరుచుగా వాహనాలను తనిఖీ చేస్తూ, అనుమానితుల నుంచి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. దీనికి అదనంగా రైళ్లు,

బస్సుల్లో సైతం తనిఖీలను విస్తృతంగా చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్, ఒరిస్సా ప్రాంతాల నుంచి చిన్నారులను ఆంధ్రా ప్రాంతం మీదుగా అక్రమం గా ఇతర ప్రాంతాలకు

తరలించే వారి పై కఠిన చర్యలు చేపడుతున్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam