DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మీడియా వ్యతిరేక జీఓ నెం. 2430 రద్దు చేయాల్సిందే : .....

ఏపీవర్కింగ్‌ జర్నలిస్టు ఫెడరేషన్‌ డిమాండ్‌

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS)

విశాఖపట్నం, నవంబర్ 11, 2019 (డిఎన్‌ఎస్‌) : పత్రికా స్వేచ్ఛకు à°­à°‚à°—à°‚ కలిగించే జీఓ లు  938, 2430ను

రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాల్సిందేనని ఆంధ్రప్రదేశ్‌ వర్కింగ్‌ జర్నలిస్టు ఫెడరేషన్‌ మహా విశాఖ నగరశాఖ డిమాండ్‌ చేసింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇటీవ

జారీ చేసిన 2430ను ఉపసంహరించుకోవాని డిమాండ్‌ చేస్తూ సోమవారం కలెక్టర్‌ కార్యాలయం ఎదుట శాంతియుత నిరసనలు నిర్వహించింది. అనంతరం జిల్లా ఇన్‌ఛార్జి జాయింట్‌

కలెక్టర్‌, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీదేవికి వినతిపత్రం సమర్పించారు. à°ˆ సందర్భంగా జాతీయ జర్నలిస్టు సంఘం కార్యదర్శి, ఏపీ వర్కింగ్‌ జర్నలిస్టు ఫెడరేషన్‌

రాష్ట్ర కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు, విశాఖపట్నం అర్బన్‌ అధ్యక్షులు పి.నారాయణ్‌లు మాట్లాడుతూ నిరాధారమైన వార్తలు వ్రాయడం, ప్రసారం చేసినట్లయితే ప్రభుత్వ శాఖ

కార్యదర్శలకు కేసు వేసే అధికారం కల్పిస్తూ గతనెల 30à°µ తేదీన ప్రభుత్వం జారీ చేసిన 2430 జీఓను రద్దు చేయాని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం à°ˆ విషయమై ఎందుకు

దుందుడుకు వైఖరి అవలంభిస్తోందో అర్థం కావడం లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డిపై జర్నలిస్టులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని వాటిని కాలరాయడం

ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ముఖ్యంగా కేసుల వ్యవహారంకు సంబంధించి పాత్రికేయులు, ఉప సంపాదకుడు, ఎడిషనల్‌ ఇన్‌ఛార్జిలను బాధ్యులుగా చేయడం చట్ట వ్యతిరేకమని

అన్నారు. తప్పుడు వార్తలు రాసే సందర్భంలో కోర్టుకు వెళ్లే అవకాశం ఉండనే ఉందని ఈ పరిస్థితుల్లో జర్నలిస్టులను హింసకు గురి చేయడం తగదన్నారు. రాష్ట్రంలో ఏర్పడ్డ

జగన్‌ ప్రభుత్వంపై జర్నలిస్టు కోటి ఆశలు పెట్టుకున్నారని ముఖ్యంగా ఇళ్లు, ఇళ్లస్థలాలు, పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న తరుణంలో à°ˆ జీఓతో వారిపై బండరాయి

పడినట్లయిందని ఆందోళన వ్యక్తపరిచారు. 938 జీఓకు సంబంధించి 2007లో అప్పటి ముఖ్యమంత్రి దివంగత వై.ఎస్‌.రాజశేఖరరెడ్డిని కోరిందే తడవుగానే ఉపసంహరించుకున్నారని

ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి కూడా ఈ విషయమై ఉదారంగా ఆలోచించి జర్నలిస్టు హక్కు పరిరక్షణకు సహకరించాని కోరారు. ఈ సందర్భంగా 2430 జీఓను రద్దు చేయాలని,

పత్రికా స్వేచ్ఛను కాపాడాలని, జర్నలిస్టు హక్కులను కాలరాయొద్దని నినాదాలు చేశారు. à°ˆ శాంతియుత నిరసన కార్యక్రమంలో ఏపీ బ్రాడ్‌కాస్ట్‌ జర్నలిస్టు అసోసియేషన్‌

విశాఖ నగరశాఖ అధ్యక్షు ఇరోతి ఈశ్వరరావు, ఏపీ వర్కింగ్‌ జర్నలిస్టు ఫెడరేషన్‌ నగర కార్యదర్శి ఎస్‌.అనూరాధ, తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam