DNS Media | Latest News, Breaking News And Update In Telugu

హిందూ దేవాలయ భూములకు రక్షణ కల్పించండి 

భూబకాసురుల నుంచి ఆలయ భూములు కాపాడాలి 

హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి 

(DNS రిపోర్ట్ : SV  à°†à°šà°¾à°°à±à°¯à±à°²à±,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚) : . . . .

శ్రీకాకుళం,

నవంబర్ 12, 2019 (డిఎన్‌ఎస్‌): శ్రీకాకుళం జిల్లాలోని హిందూ దేవాలయాల భూములను ఆక్రమిస్తున్న భూ కబ్జాదారులు, భూబకాసురుల చెర నుంచి ఆలయ భూములను పరిరక్షించాలని హిందూ

దేవాలయాల పరిరక్షణ సమితి ప్రతినిధులు కోరుతున్నారు. మంగళవారం జిల్లా దేవాదాయ శాఖా సహాయ కమిషనర్ కు హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి శ్రీకాకుళం జిల్లా కన్వీనర్

పైలా చంద్రశేఖర్, జిల్లా ప్రముఖ సురేష్ సింగ్ లు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ శ్రీకాకుళం నగరంలో ఉన్న హయతనగరం లక్ష్మీ టాకీస్ వద్దగల సర్వే

నంబరు 170/6 , 170/4 లో గల 31 సెంట్ల భూమి శ్రీ జగన్నాథ స్వామి ఆలయానికి చెందిన భూమి ఉందని, దానిపై కొందరు కబ్జాదారులు కన్నేశారన్నారు. ఎన్నో సంవత్సరాలుగా జగన్నాథ స్వామి

భూములను కొంతమంది కబ్జాదారులు ఆక్రమించుకొని ఈ స్థలంలో ఇప్పటికే కొంతమంది గుడిసెలు ఏర్పాటు చేసి, కరెంటు సదుపాయం కూడా ఏర్పాటు చేసుకున్నారని తెలిపారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి  à°¦à±‡à°µà°¾à°¦à°¾à°¯à°¶à°¾à°– భూములను పేదలకు మంచి పెడతారని ప్రకటన చేసినప్పటి నుండి శ్రీకాకుళం పట్టణంలో కబ్జాదారుల కన్ను దేవాదాయశాఖ భూములపై పడిందని,

ప్రస్తుత పరిస్థితుల్లో దేవాదాయశాఖ భూములకు రక్షణ కరువై కబ్జా కోరల్లో చిక్కుకుని పోతుందని తెలియచేసారు. తక్షణం ఈ విషయమై దేవాదాయ శాఖ అధికారులు స్పందించి

వెంటనే ఈ భూములకు రక్షణ కల్పించాలని, భూములకు సంబంధించి హెచ్చరిక బోర్డులను కూడా ఏర్పాటు చేయాలని, దేవాలయ భూములను కబ్జాలకు పాల్పడిన్న వారిపై చట్టపరమైన చర్యలు

తీసుకోవాలని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు వేణు, పృద్వి, జివి నరసింహం తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam