DNS Media | Latest News, Breaking News And Update In Telugu

శ్రీ కపిలేశ్వరాలయంలో ఘ‌నంగా అన్నాభిషేకం

(DNS రిపోర్ట్ : NSV రమణ , స్టాఫ్ రిపోర్టర్, తిరుపతి )

తిరుపతి, నవంబర్ 12, 2019 (డిఎన్‌ఎస్‌): తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో మంగ‌à°³‌వారం అన్నాభిషేకం à°˜‌నంగా

జరిగింది. à°ˆ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. 
ఇందులో భాగంగా  à°‰à°¦‌యం సుప్రభాతంలో స్వామివారిని మేల్కొలిపి అభిషేకం నిర్వహించారు.

మధ్యాహ్నం 12 గంటలకు శ్రీ కపిలేశ్వరస్వామివారి మహాలింగానికి (మూలమూర్తికి) ఏకాంతంగా అన్నాభిషేకం చేశారు. అంతకుముందు శుద్దోదకంతో శ్రీ కపిలేశ్వరస్వామివారికి

అభిషేకం జరిగింది. 
అనంతరం సుమారు 400 కిలోలకు పైగా బియ్యంతో వండిన అన్నంతో శ్రీ కపిలేశ్వర లింగానికి అభిషేకం చేశారు. భూమితలం నుండి పానవ‌ట్టం మరియు లింగాన్ని

కూడా పూర్తిగా అన్నంతో కప్పిన తర్వాత దానిపైన ప్రత్యేకంగా అన్నంతోనే ఒక చిన్న శివలింగాన్ని తీర్చిదిద్దారు.
సాయంత్రం 4 నుండి 6 గంటల వరకు భక్తులకు అన్నాభిషేక

సర్వదర్శనం కల్పించారు. సర్వదర్శనానంతరం సాయంత్రం 6 గంటలకు అన్నలింగానికి ఉద్వాసన చేసి, స్వామివారికి సుగంధద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి నైవేద్యం

సమర్పించారు. అన్నాభిషేకంలో వినియోగించిన అన్నాన్ని సాంబారులో కలిపి భక్తులకు పంపిణీ చేశారు. 
సంవత్సరానికి ఒక్కసారి జరిగే ఈ అన్నాభిషేక మహోత్సవంలో

భక్తులు పాల్గొని అన్న లింగ దర్శనం చేసుకున్నట్లయితే సమస్త గ్రహదోషాలు, పూర్వజన్మ సంచిత పాపాలు తొలగి పుణ్యం కలుగుతుందని, పశుపక్ష్యాది సకల జీవరాశులు

సుభిక్షంగా ఉండడానికి à°ˆ అన్నాభిషేకం నిర్వహిస్తారని అర్చకులు తెలిపారు. 
à°ˆ కార్యక్రమంలో ఆల‌à°¯ డెప్యూటీ ఈవో సుబ్రమణ్యం, సూప‌రింటెండెంట్ భూప‌తి, టెంపుల్

ఇన్‌స్పెక్ట‌ర్ రెడ్డిశేఖ‌ర్‌, ఆల‌à°¯‌ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam