DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సక్రమ మార్గంలో నడిపించేలా కళలు ఉండాలి 

ప్రసాదుల గురుమూర్తి నాటక కళోత్సవంలో నల్లూరి సూచన 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి): . . .

అమరావతి, నవంబర్ 14, 2019 (డిఎన్‌ఎస్‌) :  'కళకు రెండు వైపులా

పదును ఉంటుంది. మహోన్నతులుగా చేస్తుంది. అధోగతి పాలు చేస్తుంది. ఒకప్పుడు ప్రజలకోసం నడిచిన కళలు ఇప్పుడు తప్పుదోవ పడుతున్నాయి. సీరియల్స్ లో ఆడవాళ్లను విలన్స్

à°—à°¾,దుష్టులుగా చూపిస్తూ కళను బ్రష్టు పట్టిస్తున్నారు. సెక్స్,హింస ప్రేరేపిస్తూ  à°¯à±à°µà°¤à°¨à± చెడు మార్గంలో నడిపించేలా సినిమాలు,టివి ప్రోగ్రామ్స్ ఉంటున్నాయి.

దుర్మార్గంగా నడిపిస్తున్నా సరే, ప్రభుత్వాలు కూడా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. అది పాట కావచ్చు,గేయం కావచ్చు,నాటకం కావచ్చు,వివిధ కళా రూపాలు కావచ్చు. విన్నా,

చూసినా నీతితో  à°®à°¨à°¸à± పునీతం చేసుకుని వెళ్లేలా ఉండాలి. అందుకే కళలను సక్రమంగా వినియోగించేలా చూడాలి. ప్రజలను చైతన్యవంతులుగా చేసేలా చూడాలి' అని ఎపి ప్రజా

నాట్యమండలి గౌరవ అధ్యక్షులు నల్లూరి వెంకటేశ్వర్లు సూచించారు.  à°ªà±à°°à°œà°¾ కళాకారుడు à°•à±€ శే ప్రసాదుల గురుమూర్తి ద్వితీయ వర్ధంతి సందర్బంగా ఆంధ్రప్రదేశ్ ప్రజా

నాట్యమండలి,గురుమూర్తి మిత్ర మండలి పక్షాన శ్రీవేంకటేశ్వర ఆనం కళాకేంద్రంలో   à°¨à°¾à°Ÿà°¿à°•, కళా ఉత్సవాలను బుధవారం  à°˜à°¨à°‚à°—à°¾ నిర్వహించారు. à°ˆ సందర్బంగా నిర్వహణ కమిటీ

అధ్యక్షులు పంతం కొండలరావు అధ్యక్షతన జరిగిన సభను సీనియర్ పాత్రికేయులు, సూర్య సాయంకాలం పత్రిక సంపాదకులు వి.ఎస్.ఎస్ కృష్ణకుమార్  à°¨à°¡à°¿à°ªà°¿à°‚చారు. నల్లూరి ప్రధాన

వక్తగా పాల్గొన్నారు. 
   à°¯à±‚రోపియన్ దేశాల్లో గేదె పాలు తీయడానికి సంగీతం వినిపిస్తూ,మిషన్ తో పాలు తీస్తారని నల్లూరి పేర్కొంటూ పసిపాప మొదలుకుని వృద్ధుల

వరకూ అలాగే  à°ªà°¶à±à°µà±,పాము ఇలా అన్నీ సంగీతంతో  à°ªà°°à°µà°¶à°‚ చెందుతాయని అన్నారు. ఆడుతూ పాడుతూ పనిచేస్తే ఎక్కువ పని చేయగలమని ఆయన సోదాహరణంగా వివరించారు.  à°•à°³à°²à± ఎంతో

శక్తివంతమైన వన్నారు. 1943లో ఇండియన్ పీపుల్స్ ధియేటర్ అసోసియేషన్ (ఐపీటీఎ)ను పిసి జోషి ముంబయిలో ప్రారంభించారని, అదే ఆంద్ర ప్రదేశ్ లో ప్రజా నాట్యమండలిగా

ఏర్పడిందని ఆయన చెప్పారు. కళ కాసుల కోసం కాదు ప్రజల కోసం అని డాక్టర్ గరికపాటి రాజారావు చెప్పడమే కాకుండా ఆచరించి చూపారని అందుకే ఆయన జయంతిని రాష్ట్రంలో అన్ని

చోట్లా చేస్తుస్తున్నారని నల్లూరి చెప్పారు. 1948లో మద్రాసు ప్రభుత్వం ప్రజా నాట్య మండలిని నిషేదించిందని అయితే 1974లో మళ్ళీ ఈ సంస్థను పునరుజ్జీవింప జేయడానికి చేసిన

కృషిలో ప్రసాదుల గురుమూర్తి పాత్ర ఉందని ఆయన కొనియాడారు. డాక్టర్ గరికపాటి శిష్యునిగా గురుమూర్తి  à°µà±à°¯à°¾à°ªà°¾à°°à°‚ కోసమో,సరదా కోసమో,వృత్తి కోసమో కాకుండా ప్రజలకోసం

నాటకాలు ఆడారని ఆయన కొనియాడారు. ప్రజా నాట్యమండలి నుంచి జమున,తాతినేని రామారావు,మాదాల రంగారావు,వందేమాతరం శ్రీనివాస్,టి కృష్ణ ఇలా ఎందరో తయారయ్యారని నల్లూరి

చెప్పారు.
    à°—ోదావరి జిల్లాల పత్తభద్రుల నియాజకవర్గ ఎమ్మెల్సీ ఇవి రావు మాట్లాడుతూ ఆరోజుల్లోనే ప్రజా నాట్యమండలిని నిషేధిస్తే ప్రస్తుతం అలాంటి

పరిస్థితులు నెలకొన్నాయని,హత్యలు కూడా సాగిస్తోందని విచారం వ్యక్తంచేశారు. ప్రపంచీకరణ యుగంలో రచయితలూ,కళాకారులు,ఉద్యమకారులు మౌనంగా ఉండలేరని ఆయన చెబుతూ

కళారూపాలు వర్ధిల్లేలా చేయాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. ప్రసాదుల గురుమూర్తి వర్ధంతి సందర్బంగా ఆయన ఆశయాలను నిలబెట్టేలా కృషిచేయాలన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam