DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పవన్ నేతృత్వంలో  డొక్కా సీతమ్మ ఆహార శిబిరం 

మంగళగిరి లో ప్రారంభించిన జనసేనాని 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి). . .

అమరావతి, నవంబర్ 15, 2019 (డిఎన్‌ఎస్‌) : జనసేన పార్టీ అధ్యక్షులు పవన్

కళ్యాణ్ నేతృత్వంలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ డొక్కా సీతమ్మ ఆహార శిబిరం శుక్రవారం ప్రారంభమయ్యింది. మంగళగిరిలో ఆయన ఈ కార్యక్రమానికి శ్రీకారం

చుట్టారు. పవన్ స్వయంగా భవన నిర్మాణ కార్మికులకు ఆహారం పంపిణీ చేసారు.  à°œà°¨à°¸à±‡à°¨ ఆధ్వర్యంలో ‘డొక్కా సీతమ్మ ఆహార శిబిరాలు’పేరిట రాష్ట్రవ్యాప్తంగా 175

నియోజకవర్గాల్లో ఏర్పాటు చేస్తోంది. ఈ శిబిరాల ద్వారా భవన నిర్మాణ కార్మికులకు ఉచితంగా ఆహారం అందించనున్నారు. భవన నిర్మాణ కార్మికుల ఆకలి ప్రభుత్వానికి

తెలిపేందుకు ఈ కార్యక్రమం చేపట్టామన్నారు పవన్ కళ్యాణ్. ప్రభుత్వం 50మంది కార్మికులను చంపేసిందని.. తక్షణమే భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కల్పించాలి అన్నారు.

తప్పుడు విధానాలతో భవన నిర్మాణ కార్మికులు ఆకలితో చనిపోతున్నారని.. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై యుద్ధం చేస్తున్నామన్నారు. తాను వ్యక్తిగతంగా

ఎవర్నీ విమర్శించనని.. తప్పుడు విధానాలపైనే ప్రశ్నిస్తున్నానని చెప్పారు. ఇప్పటికైనా కార్మికుల కష్టాలను సీఎం జగన్ పట్టించుకోవాలి అని డిమాండ్ చేశారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam