DNS Media | Latest News, Breaking News And Update In Telugu

చిన్నారి వైద్యానికి రాజమండ్రి ఎంపీ భరత్ చొరవ 

- పిఎంఆర్ఎఫ్ రూ. 3 లక్షలు మంజూరు 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి)

అమరావతి, నవంబర్ 18, 2019 (డిఎన్‌ఎస్‌) : పుట్టినప్పటి నుంచి మాటలు రాని, వినపడని 8 ఏళ్ల

చిన్నారి వైద్యానికి రాజమహేంద్రవరం లోక్ సభ సభ్యుడు, వైఎస్సార్సిపి లోక్ సభ చీఫ్ విప్ మార్గాని భరత్ రామ్ చేయూతనందించారు. చిన్నారి వైద్యానికి ప్రధాన మంత్రి సహాయ

నిధి నుంచి 3 లక్షలు మంజూరు చేయించారు. రాజానగరం పాతతుంగపాడు గ్రామానికి చెందిన రౌతుల్ శ్రీను చిరు వ్యాపారి. ప్రతి రోజు రాజమహేంద్రవరం వచ్చి ;పండ్లు అమ్ముకుంటూ

కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. శ్రీను కూతురు 8 ఏళ్ల రౌతుల తేజశ్రీ కి చిన్నప్పటి మాటలు రాకపోవడంతో పాటు వినపడు. పలు ఆస్పత్రుల్లో చూపించారు. ఆపరేషన్ చేస్తే

ఫలితం ఉంటుందని, అందుకు 9 లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు. అపోలో ఆస్పత్రి లో 9.08 లక్షలకు అంచనా వేశారు. చిన్నారి వయస్సు 4 ఏళ్ళు దాటడంతో ఆరోగ్యశ్రీ

వర్తించలేదు. ఈ నేపథ్యంలో చిన్నారి తండ్రి ఎంపీ మార్గాని భరత్ ను సంప్రదించారు. కుమార్తె సమస్య, తన ఆర్ధిక పరిస్థితి వివరించారు. వెంటనే స్పందించిన ఎంపీ ప్రధాన

మంత్రి సహాయ నిధికి సిఫార్సు చేశారు. ప్రధాన మంత్రి సహాయ నిధి నుంచి చిన్నారి వైద్యానికి 3 లక్షలు మంజూరయ్యాయి. ఈ నేపథ్యంలో చిన్నారి తేజశ్రీ తండ్రి శ్రీను ఎంపీ

భరత్ కు కృతఙ్ఞతలు తెలిపారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam