DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వాణిజ్య రాజధాని విశాఖ పై ఆంక్షలా ? కేంద్రం కుట్రేనా : విప్ గణ బాబు

వాణిజ్య రాజధాని విశాఖ పై ఆంక్షలా ?   కేంద్రం కుట్రేనా : విప్ à°—à°£ బాబు

విశాఖ లో యుద్ధ విమానాలకు శిక్షణ ? అంటే యుద్ధం రానుందా : విప్ గణబాబు.

నౌకాదళం

ఆంక్షలతో మండిపడుతున్న విశాఖ వాసులు 

విశాఖపట్నం, జూన్ :  à°µà°¿à°¶à°¾à°–పట్నం విమానాశ్రయం లో సాధారణ విమానాల రాకపోకల వేళలను కుదించడం తో తీవ్రంగా నష్టపోతున్నామని

రాష్ట్ర ప్రభుత్వ విప్ , విశాఖ పశ్చిమ నియోజక ఎం ఎల్ ఏ పిజివిఆర్ నాయుడు మండిపడ్డారు. మంగళ వారం నగరం లోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం లో నిర్వహించిన

విలేకరుల సమావేశం లో అయన మాట్లాడుతూ మంగళవారం నుంచి విశాఖ విమానాశ్రయం లో ప్రయాణీకుల విమానాల రాకపోకలపై ఆంక్షలు విధించడం ద్వారా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే

విమానాల వేళల్లో తీవ్ర అంతరాయం ఏర్పడుతుందన్నారు. పైగా ఈ విమానాశ్రయం లో యుద్ధ విమానాలకు, సిబ్బందికి శిక్షణ ఇస్తుండడం తో భారత్ కు యుద్ధం ఏదైనా రానుందా అనే

అనుమానాలు ప్రజల్లో కలుగుతున్నాయన్నారు. విశాఖ కేంద్రం à°—à°¾  à°Žà°¯à°¿à°°à±‌ ఇండియా దుబాయ్‌ విమానం, సింగపూర్‌ సిల్క్‌ ఎయిర్‌లైన్స్‌, కౌలాలంపూర్‌కు మలేషియన్‌

ఎయిర్‌లైన్స్‌, ఎయిర్‌ ఆసియా, కొలంబోకు శ్రీలంక్‌ను ఎయిర్‌లైన్స్‌ లు విమాన సేవలు అందిస్తున్నాయన్నారు. ఇప్పుడు సమయం కుదించడం తో ఇవి ఇబ్బందుల పాలవుతాయని

మండిపడ్డారు. ఇప్పడికే రాష్ట్రం లోటు బడ్జెట్ లో నడుస్తూ నానా అవస్థలు పడుతుంటే కేంద్రం పులి మీద పుత్ర అన్నట్టుగా ఈ మోత మోయించిందన్నారు. ఇది కేంద్రం ఆంధ్ర

ప్రదేశ్ పై, ముఖ్యంగా రాష్ట్ర ఆర్థిక రాజధాని విశాఖ పై సాధిస్తున్న కక్ష సాధింపు చర్యగానే ఉందన్నారు. అంతర్జాతీయ విమానాలు సేవలను నిలిపి వేసే అవకాశం ఉందన్నారు.

దీని ప్రభావం ఐటీ à°°à°‚à°—à°‚ పై, వ్యాపార రంగాల పై పడుతుందన్నారు. 

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.


Latest Job Notifications

Panchangam - Dec 3, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam