DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నవ శకం తో ప్రజల జీవితాల్లో నవశకం మొదలవుతుంది.

20 నుండి నవ శకం లబ్దిదారుల గుర్తింపు  – కలెక్టర్ నివాస్

నవశకం లబ్దిదారులకు వ్యక్తిగతంగా ప్రయోజనం 

(DNS రిపోర్ట్ : SV ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్,

శ్రీకాకుళం ). .

శ్రీకాకుళం, నవంబర్ 19, 2019 (డిఎన్‌ఎస్‌): రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న నవశకం కార్యక్రమానికి à°ˆ నెల 20à°µ తేదీ నుండి లబ్దిదారుల

గుర్తింపు ప్రారంభం అవుతుందని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జె నివాస్ తెలిపారు. నవశకం కార్యక్రమంపై కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా

ప్రతినిధుల సమావేశంలో జిల్లా కలెక్టర్ నివాస్ తెలిపారు. నవశకం లబ్దిదారులకు  à°µà±à°¯à°•à±à°¤à°¿à°—తంగా ప్రయోజనం కల్పించే కార్యక్రమంగా ఉంటుందని చెప్పారు. నవంబరు 20à°µ తేదీ

నుండి డిశంబరు 20వ తేదీ వరకు లబ్దిదారుల గుర్తింపు కార్యక్రమం జిల్లాలో ఉంటుందని ఇందులో ప్రస్తుతం ఉన్న లబ్దిదారులకు అదనంగా మరింత మందికి ప్రయోజనం కల్పించుట

జరుగుతుందని అన్నారు. సంక్షేమ కార్యక్రమాల్లో ఇప్పటి వరకు లబ్దిపొందని వారిని చేర్చడం జరుగుతుందని చెప్పారు. నవ శకం కార్యక్రమం క్రింద అమలు చేస్తున్న

కార్యక్రమాల వివరాలను  à°ˆ విధంగా తెలియజేసారు.

బియ్యం కార్డు : నవ శకం కార్యక్రమంలో భాగంగో బియ్యానికి కొత్తగా కార్డును జారీ చేయడం జరుగుతుందన్నారు. బియ్యం

కార్డు పొందుటకు కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రూ.10000/-, పట్టణ ప్రాంతాల్లో రూ.12000/-లు ఆదాయం కలిగినవారు, కుటుంబానికి 3 ఎకరాలు పల్లం భూమి లేదా 10 ఎకరాలు మెట్టు

భూమి లేదా పల్లం, మెట్టు కలిపి 10 ఎకరాల వరకు ఉన్నవారు, విద్యుత్ వినియోగం నెలకు 300 యూనిట్లు లోపల ఉన్నవారు (6 మాసాల సగటు) అర్హులన్నారు. కుటుంబ సభ్యుల్లో ఏ ఒక్కరు కూడా

ప్రభుత్వ సర్వీసులో లేదా ప్రభుత్వ పెన్షన్ దారులై ఉండకూడదని, కుటుంబానికి టాక్సీ, ఆటో, ట్రాక్టర్ మినహా నాలుగు చక్రాల సొంత వాహనదారులై ఉండకూడదని, కుటుంబంలో ఏ

ఒక్కరు కూడా ఆదాయపు పన్నుచెల్లింపుదారులై ఉండకూడదని, కుటుంబానికి పట్టణ ప్రాంతాలలో 750 చ.అ.కు మించి నివేశన స్థలం కలిగి ఉండకూడదని తెలిపారు.

వై.యస్.ఆర్ ఆరోగ్య

శ్రీ : నవ శకంలో భాగంగా వై.యస్.ఆర్ ఆరోగ్య శ్రీ కార్యక్రమంలో మరింత మంది లబ్దిపొందే విధంగా ప్రభుత్వం నిబంధనలు సడలించిందన్నారు. ఈ కార్యక్రమంలో లబ్దిపొందుటకు

బియ్యం కార్డు, వై.యస్.ఆర్. పెన్షన్ కానుక కార్డు, జగనన్న విద్య దీవెన, జగనన్న వసతి దీవెన కార్డుదారులందరూ అర్హులేనన్నారు. పల్లం భూమి 12 ఎకరాల కంటే తక్కువ, మెట్టు

భూమి 35 ఎకరాల కంటే తక్కువ మరియు మొత్తం కలుపుకొని 35 ఎకరాలు మించకుండా భూమి కలిగిన కుటుంబాలు అర్హులేనని చెప్పారు. కుటుంబ వార్షిక ఆదాయం రూ.5 లక్షల వరకు ఉన్నవారు

కూడా అర్హులేనని ఆయన తెలిపారు. ఇందుకు తగిన ఆదాయ జీత దృవీకరణ పత్రం జత చేయాలని చెప్పారు. రూ.5 లక్షల వరకు ఆదాయపు పన్ను రిటర్నులు సమర్పించిన వారు, పట్టణ ప్రాంతాలలో 3000

చదరపు అడుగులు (334 చ.గ.) విస్తీర్ణం వరకు ఆస్తి పన్ను చెల్లించేవారు, ప్రభుత్వ శాశ్వత ఉద్యోగులు/పింఛనుదారులు మినహా రూ.5 లక్షలకు లోబడి వార్షిక వేతనం పొందే ప్రభుత్వ,

ప్రైవేటు విభాగాలలో పనిచేసే అవుట్ సోర్సింగు, కాంట్రాక్టు, పార్ట్ టైమ్ ఉద్యోగులు, పారిశుధ్య కార్మికులు, గౌరవ వేతనం పొందుతున్న ఉద్యోగులు, వ్యక్తి గతంగా ఒక

కారు మాత్రమే వున్న కుటుంబాలు అర్హులేనని వివరించారు.

వై.యస్.ఆర్ పింఛను కానుక: నవ శకంలో పింఛను కానుకకు కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రూ.10000/- పట్టణ

ప్రాంతాల్లో రూ.12000/-ల వరకు ఉన్నవారు, లబ్ధిదారునికి పల్లం భూమి 2.50 ఎకరాలు లేదా మెట్టు భూమి 5.00 ఎకరాల వరకు కలిగి ఉన్నవారు, విద్యుత్ వినియోగం నెలకు 300 యూనిట్లు వరకు

ఉన్నవారు(6 మాసాల సగటు), ప్రభుత్వ శాశ్వత ఉద్యోగులు/పించనుదారులు మినహా పారిశుధ్య కార్మికులు అందరు అర్హులన్నారు.  à°•à±à°Ÿà±à°‚బంలో ఏ ఒక్కరు కూడా ఆదాయపు

పన్నుచెల్లింపుదారులుగా ఉండకూడదని, కుటుంబానికి పట్టణ ప్రాంతాలలో 750 చ.అ.కు మించి నివేశన స్థలం కలిగి ఉండరాదని చెప్పారు. వృద్దాప్య ఫించను (రూ.2250లు నెలకు)కు 60

సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు గలవారు, జీవనోపాధి తక్కువగా ఉండటం, కుటుంబం లేదా బంధువుపై ఆధారపడకుండా నిరాశ్రయులైనవారు అర్హులుకాగా., చేనేత కార్మికుల

పింఛను (రూ.2250లు నెలకు)కు 50 ఏళ్ళు పైబడిన నేతపనివారు, నిరాశ్రయులైనవారు అర్హులు. వితంతువుల పింఛను(రూ.2250లు నెలకు)కు వివాహ చట్టం ప్రకారం 18 సంవత్సరాలు పైగా వయస్సు

కలిగినవారు అర్హులని చెప్పారు. వికలాంగ, కల్లుగీత కార్మికులు తదితర పింఛన్లకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం పరిశీలించడం జరుగుతుందని చెప్పారు.

జగనన్న విద్యా

దీవెన – జగనన్న వసతి దీవెన : నవ శకంలో జగనన్న విద్యా దీవెన  à°•à°¾à°°à±à°¯à°•à±à°°à°®à°‚లో ఫీజు రీఇంబర్సుమెంటు చేయడం జరుగుతుందన్నారు. వసతి దీవెన క్రింద విద్యార్ధికి

సంవత్సరానికి రూ.20 వేలు నిర్వహణ ఖర్చుగా అందించడం జరుగుతుంది. ఐటిఐ, పాలిటెక్నిక్, డిగ్రీ ఆపై చదువులను ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు యూనివర్సిటీ అనుబంధ, బోర్డు

సంస్థలలో చదివే విద్యార్ధులు, డే స్కాలర్స్, కాలేజీ, డిపార్టుమెంటు అనుబంధ వసతి గృహాలలో చదివే విద్యార్ధులు అర్హులన్నారు. పాఠశాల లేదా కళాశాలల్లో చదువుతున్న

విద్యార్థులకు విధిగా 75 శాతం హాజరు ఉండాలని, కుటుంబ సంవత్సర ఆదాయం రూ.2.50 లక్షలకు వరకు ఉండాలని, కుటుంబానికి 10 ఎకరాలు పల్లం భూమి లేదా 25ఎకరాలు మెట్టు భూమి లేదా పల్లం,

మెట్టు కలిపి 25 ఎకరాల వరకు ఉండవచ్చని చెప్పారు. కుటుంబ సభ్యుల్లో ఏ ఒక్కరు కూడా ప్రభుత్వ సర్వీసులో లేదా ప్రభుత్వ పెన్షన్ దారులై ఉండకూడదని, టాక్సీ, ఆటో, ట్రాక్టర్

లకు మినహా కుటుంబం నాలుగు చక్రాల సొంత వాహనదారులై ఉండరాదని చెప్పారు. కుటుంబంలో ఏ ఒక్కరు కూడా ఆదాయపు పన్నుచెల్లింపుదారులై ఉండరాదని, కుటుంబానికి పట్టణ

ప్రాంతాలలో 1500 à°š.à°….కు మించి నివేశన, వ్యాపార స్థలం  à°•à°²à°¿à°—à°¿ ఉండరాదని చెప్పారు.

వై.యస్.ఆర్.అమ్మ ఒడి : నవ శకంలో ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ (12వ తరగతి) వరకు

చదువుకునే విద్యార్థులు కుటుంబంలో ఎంత మంది ఉన్నా ఒక్కరికే అమ్మఒడి కింద రూ.15 వేలు తల్లి లేదా సంరక్షకుని ఖాతాలో జమ అవుతుందన్నారు. ప్రభుత్వ పాటశాలలు,

ప్రభుత్వంచే గుర్తింపు పొందిన ఎయిడెడ్, అన్ ఎయిడెడ్ పాటశాలలో 1 నుండి 10వ తరగతి వరకు చదువుతున్నవిద్యార్ధులు మరియు ప్రభుత్వంచే గుర్తింప బడిన జూనియర్ కళాశాలలు,

రెసిడెన్షియల్ పాటశాల/జూనియర్ కళాశాలలో చదివే పిల్లల కుటుంబాలు కూడా ఈ పధకానికి అర్హులన్నారు. ప్రభుత్వం జారీ చేసిన తెల్లరంగు రేషన్ కార్డు కలిగి ఉండాలని,

అమలులో ఉన్న రేషన్ కార్డు ఆరు దశల ధృవీకరణకు లోబడి ఉండాలని చెప్పారు. లబ్ధిదారుని తల్లికి విధిగా ఆధార్ కార్డు ఉండాలని చెప్పారు.

          వై.యస్.ఆర్. నేతన్న

నేస్తం, వై.యస్.ఆర్. మత్స్య కార భరోసా, వై.యస్.ఆర్. కాపు నేస్తం, వై.యస్.ఆర్ సున్నా వడ్డీ పధకం, టైలర్, రజక, మంగలి కుల వృత్తుల వారికి ఆర్ధిక సహాయం వంటి కార్యక్రమాలను నవ

శకంలో భాగంగా గుర్తించడం జరుగుతుందని అన్నారు. కాపు నేస్తం క్రింద కాపు, బలిజ, ఒంటరి, తెలగ కులాలకు లబ్దిచేకూర్చడం జరుగుతుందని చెప్పారు. జిల్లాలోగల 930 గ్రామ,

వార్డు సచివాలయాల ద్వారా గుర్తింపు ప్రక్రియను చేపట్టడం జరుగుతుదని తెలిపారు. టైలర్, రజక, మంగలి కుల వృత్తుల వారు షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్ మెంటు చట్టం క్రింద

నమోదు చేయించుకోవాలన్నారు. నమోదు చేయించుకోనివారు మీ సేవ కేంద్రంలో తక్షణం నమోదు చేసుకోవచ్చని చెప్పారు.

          జిల్లా వ్యాప్తంగా à°ˆ నెల 20, 21à°µ తేదీలలో గ్రామ

సభలను నిర్వహిస్తున్నామని చెప్పారు. పథకాలకు సంబంధించి లబ్దిదారుల డేటాను గ్రామ సచివాలయాలలో డేటా ఎంట్రీ ప్రక్రియ చేపట్టడం జరుగుతుందన్నారు.

భామిని

తహశీల్దారుపై విచారణ : భామిని తహశీల్దారుపై వచ్చిన ఆరోపణలపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా పాలకొండ రెవిన్యూ డివిజనల్ అధికారిని విచారణకు ఆదేశించామన్నారు.

నివేదిక ఆధారంగా చర్యలు చేపడతామని చెప్పారు.

21à°¨ ప్రపంచ మత్స్యకార దినోత్సవం :  à°ªà±à°°à°ªà°‚à°š మత్స్యకార దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని కలెక్టర్ చెప్పారు. నంబరు

23à°µ తేదీన జిల్లాలో చేపట్టిన వసతి గృహాలకు సౌకర్యాలు కల్పించే కార్యక్రమం – మార్పును ప్రారంభిస్తామని చెప్పారు. జిల్లాలో రూ.11.34 కోట్లతో వంద వసతి గృహాల్లో సౌకర్యాల

కల్పనకు చేపట్టామని తెలిపారు. వసతి గృహాల మెరుగుకు జిల్లాకు రూ.14 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ముఖ్య మంత్రి ప్రకటించారని చెప్పారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam