DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆరిలోవ రోడ్డు పై చెత్త ఏరే బండితో గుద్ది పడేసారు. . . .

బట్టలు చిత్తు చిత్తు  à°¹à±†à°²à±à°®à±†à°Ÿà± మొహం కాపాడినట్టుంది.  .

జీవీఎంసీ వాహనం చిత్తుచిత్తు, బండి తుక్కుతుక్కు.

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, విశాఖపట్నం): . .

.

విశాఖపట్నం, నవంబర్ 20, 2019 (డిఎన్‌ఎస్‌): నగర శివారు లో జరిగిన రోడ్డు ప్రమాదంలో హెల్మెట్ ధరించడంతో ద్విచక్ర వాహనదారుడు స్వల్పగాయాలతో బయట పడ్డారు. వివరాల్లోకి

వెళితే  à°µà°¿à°¶à°¾à°– నగర శివారు ప్రాంతమైన ముడసర్లోవ రిజర్వాయిర్ దగ్గరలోని రోడ్డు పై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో చెత్త ఏరే మున్సిపాలిటీ ( జీవీఎంసీ) వాహనం (AP 35 W 1048 ) అదే

రోడ్డు లో వస్తున్నా ద్విచక్రవాహనాన్ని బలంగా డీ కొట్టింది. సర్వీస్ రోడ్డు కావడం తో రెండు వాహనాలు ఎదురెదురుగా కొంచెం వేగంగానే వస్తున్నట్టు ప్రత్యక్ష

సాక్షులు ప్రసాద్ తెలియచేసారు. వివరాల్లోకి వెళితే. . . గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ ( జీవీఎంసీ) ముడసర్లోవ రిజర్వాయిర్ సమీపంలోని చెత్త ఏరుకుని, నగరం

వైపు వేగంగా పరుగులు తీసింది. అదే సమయంలో ఎదురుగా వస్తున్నా ద్విచక్రవాహనం (AP 31 EJ 5847) పై  à°’à°• పురుషుడు, మహిళ సమీపంలోని à°’à°• ఆలయంలో దైవ దర్శనం చేసుకుని

వెనుదిరుగుతున్నారు. సరిగ్గా ఇదే సమయంలో జీవీఎంసీ బండి బలంగా ఢీ కొట్టడంతో ద్విచక్రవాహనదారుడు రోడ్డుపై పడిపోయారు. వాహనదారుడు హెల్మెట్ ధరించడంతో స్వల్ప

గాయాలతో బయటపడ్డారు. అయితే అయన దుస్తులు మాత్రం చిన్నాభిన్నం అయిపోయాయి. జీవీఎంసీ చెత్త వాహనం ముందు అద్దం మొత్తం పగిలిపోవడంతో పాటు, వాహనం ముందు భాగం బాగా

దెబ్బతింది. . . అదే మార్గంలో వెళ్తున్న 100 నెంబర్ పోలీసు వాహనం కేవలం డ్రైవర్ మాత్రమే ఉండడం, ఇతర పోలీసు సిబ్బంది లేకపోవడం తో, తన పరిధి కాదనుకున్నారో ఏమో. . . వాహనం

ఆపకుండా ముందుకు వెళ్ళిపోయింది. ఈ లోగా స్థానికులు గాయాలపాలైన ద్విచక్రవాహనదారుణ్ని సేదతీర్చారు. జివిఎంసి చెత్త ఏరే వాహనం నెంబర్ :( AP 35 W 1048 ), కాగా, ప్రమాదానికి గురైన

ద్విచక్రవాహనం నెంబర్ : ( AP 31  EJ 5847 ).

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam