DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆంగ్ల మాధ్యమం వేరు - - ఆంగ్ల భాష మాట్లాడడం వేరు 

భాష రావాలంటే à°† మాధ్యమంలోనే చదవాల్సిన అవసరం లేదు 

మాధ్యమం లో చదివిన ప్రతి ఒక్కరికీ à°† భాష రాదు. 

నేర్పించడమా - లేక బలవంతంగా రుద్దడమా ?

సందిగ్ద

స్థితి లో విద్యా వ్యవస్థ - సంశయంలో ప్రజానీకం  

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, విశాఖపట్నం ):..  .

విశాఖపట్నం, నవంబర్ 20, 2019 (డిఎన్‌ఎస్‌):  à°†à°‚ధ్ర ప్రదేశ్ ప్రభుత్వం రానున్న

విద్యా సంవత్సరం నుంచి నిర్బంధ ఆంగ్ల మాధ్యమాన్ని అమలు చేసేందుకు జీవో విడుదల చెయ్యడంతో ప్రజల నుంచి విభిన్న స్వరాలూ వినిపిస్తున్నాయి. అసలు ఈ జీవో విడుదల

లక్ష్యం ఏంటి ?  à°°à°¾à°·à±à°Ÿà±à°°à°‚లోని యువత ఆంగ్ల భాషా పరిజ్ఞానం లో వెనుక పడుతున్నందువల్ల ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారు అనే నివేదిక రావడంతో ప్రభుత్వం à°ˆ నిర్ణయాన్ని

తీసుకున్నట్టు గా ప్రకటించింది. ప్రధాన కారణం తెలుగు మాధ్యమం లో చదువుతున్న వారికి ఆంగ్ల భాషలో వెనుకబడుతున్నారని, సామాన్య ప్రజలు సైతం ఉన్నత ఉపాధి పొందాలనే

సంకల్పంతో à°ˆ నిర్ణయం తీసుకుంది. అయితే à°ˆ సంకల్పం సాకారం అయ్యే అవకాశాలు ఎలా ఉన్నాయి ? అనేది మరో ఐదేళ్లు ఆగితేనే గాని ఎవరూ చెప్పలేని పరిస్థితి. 

అసలు

మాధ్యమం -  à°­à°¾à°·. . .ప్రాధాన్యత?

ఆంగ్ల భాష రావడం వేరు, ఆంగ్ల మాధ్యమం లో చదవడం వేరు.  à°†à°‚గ్ల మాధ్యమం లో చదివిన ప్రతి ఒక్కరికీ కచ్చితంగా ఆంగ్ల భాష పై అనర్గళ పట్టు

వస్తుందన్న గ్యారంటీ లేదు, పైగా రావాలి అనే నిబంధనల లేదు. అదే విధంగా  à°†à°‚గ్ల భాష అద్భుతంగా మాట్లాడడం వచ్చిన ప్రతి ఒక్కరూ ఆంగ్ల మాధ్యమం లోనే చదివారు అని

చెప్పడానికి వీలు లేదు. అదే విధంగా మాతృ భాష ( తెలుగు ) విషయం కూడా అంతే. . . 

ఉపాధి అవకాశాలు రావాలంటే పోటీ పరీక్షల్లో ఆంగ్ల భాష పై పట్టు సాధించాలి అంతే ఆ భాష లో

విద్యార్థులు కఠోర సాధన చెయ్యాల్సిందే. అది తెలుగు మీడియం లో చదివిన వాళ్ళు అయినా, ఆంగ్ల మాధ్యమం లో చదివిన వారు అయినా సరే. 

ప్రపంచంలో ప్రఖ్యాతి గాంచిన

మేధావులు చాలా మంది విద్యాభ్యాసం వారి మాతృ భాషల్లో చేసిన వారే. అంతరిక్ష పరిశోధనల్లో భారత అంతరిక్ష విభాగాలకు చీఫ్ లు à°—à°¾ పని చేసిన  à°…బ్దుల్ కలాం,  à°•à±†. శివన్ లాంటి

వారు వారి తమిళ మాతృభాషలోనే చదివారు. పైగా ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచినా  à°°à°·à±à°¯à°¾, చైనా, జర్మనీ,  à°œà°ªà°¾à°¨à±, ఇరాన్, సింగపూర్, ఐరోపా దేశాలు, లాంటి ఎన్నో దేశాల్లో

నిర్బంధ మాతృ భాష మాధ్యమమే నడుస్తోంది. 

విద్యార్థి అగ్రస్థానంలో నిలవాలంటే ఆంగ్ల మాధ్యమమే అవసరం లేదు, ఆంగ్ల భాష పై పట్టు సాధిస్తే చాలు. భాష అనేది కేవలం ఒక

భావ వ్యక్తీకరణ కోసమే తప్ప. అదే జీవనాధారం కాదు అన్నది ప్రపంచ మేధావులు నిరూపించారు. ఇక మనమెంత?

విద్యా విధానం లో మార్పులు తేవాలి :

విద్యార్థులు ఉన్నత

హోదాల్లోకి వెళ్ళాలి అనే సంకల్పం అభిసన్దనీయం,  à°…ందరూ కోరుకునేది అదే. అయితే à°…à°‚à°¤ మాత్రాన వారి భాష విద్యా విధానాన్ని అసంబద్ధంగా మార్పు చేస్తే ఇబ్బంది పడేది

విద్యార్థులే.  à°ªà±à°°à°¤à°¿ రోజూ తప్పని సరిగా ఆంగ్ల భాష నేర్పించేందుకు సుమారు రెండు, మూడు గంటలు అదనంగా సమయాన్ని కేటాయించి, దాన్ని నిర్బంధంగా అమలు చెయ్యాల్సిన

అవసరం ఉంది. అయితే à°ˆ శిక్షణ ను తప్పని సరి చేసి, దీనికిహాజరు కానీ వారిని సాధారణ పరీక్షలకు అనుమతించకుండా నిబంధనలు తయారు చేస్తే సరి. 

పైగా ఈ శిక్షణలో

ప్రాక్టికల్ సాధన, ఇతరులతో మాట్లాడే ప్రక్రియ ప్రతి ఒక్కరి తోనూ ప్రతి రోజూ చేయించాల్సిన అవసరం ఉంది. సాధన చెయ్యని వారిపై మరింత శ్రద్ధ పెడితే మెరుగైన ప్రగతి

సాధించవచ్చు. 

బలవంతంగా రుద్దితే ప్రభుత్వం భయం కలుగుతుంది తప్ప, భాష మీద గౌరవం మాత్రం కలగదు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam