DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వైభవంగా తిరుచానూరు బ్రహ్మోత్సవాల అంకురారోపణ  

పద్మావతి అమ్మవారి ఆలయంలో లక్ష కుంకుమార్చన

(DNS రిపోర్ట్ : NSV రమణ , స్టాఫ్ రిపోర్టర్, తిరుపతి): . . .

తిరుపతి , నవంబర్ 22, 2019 (డిఎన్‌ఎస్‌) : తిరుచానూరులోని శ్రీ పద్మావతి

అమ్మవారి ఆలయంలో కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శుక్ర‌వారం అంకురారోపణ, లక్ష కుంకుమార్చన సేవ వైభవంగా జరిగింది. హిందూ సనాతన ధర్మంలో కుంకుమకు

ఎనలేని ప్రాధాన్యత ఉంది. వివాహితురాలైన  à°®à°¹à°¿à°³ నుదుట కుంకుమ ధరించడం వల్ల భర్త దీర్ఘాయుష్షు పొందుతాడని హిందూ ధర్మం చెబుతోంది. లక్ష్మి, సరస్వతి, పార్వతి అమ్మవార్ల

పేర్లతో పిలుస్తున్న శక్తి అమ్మవారికి ప్రతిరూపంగా సింధూరం లేదా కుంకుమకు ప్రాశస్త్యం ఉంది. అమ్మవారి ఆలయాల్లో బ్రహ్మోత్సవాలు లాంటి భారీ ఉత్సవాలను

నిర్వహించే ముందు అర్చకులు లక్ష కుంకుమార్చన నిర్వహించడం సంప్రదాయం. ఈ విశిష్టమైన సేవ ద్వారా అమ్మవారు ప్రసన్నమై ఉత్సవాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా

జరిగేలా ఆశీర్వదిస్తారని అర్చకులు తెలిపారు.

ఆలయంలోని శ్రీకృష్ణ ముఖ మండపంలో శ్రీ పద్మావతి అమ్మవారిని ఆశీనులను చేసి ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు

అర్చకులు శాస్త్రోక్తంగా లక్ష కుంకుమార్చన సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు లక్ష్మి అష్టోత్తరం, లక్ష్మి సహస్రనామాలను వళ్లిస్తూ అమ్మవారిని కుంకుమతో

అర్చన చేశారు. పెద్ద సంఖ్యలో మహిళలు ఈ సేవలో పాల్గొన్నారు.

à°ˆ కార్యక్రమంలో ఆల‌à°¯ డెప్యూటీ ఈవో ఝాన్సీరాణి, ఏఈవో సుబమ్రణ్యం, అర్చకులు, ఇతర అధికారులు, విశేష

సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

ఘనంగా అంకురార్పణ :

బ్ర‌హ్మోత్స‌వాల నేప‌థ్యంలో శుక్ర‌వారం సాయంత్రం 6 నుంచి 9 à°—à°‚à°Ÿà°² వరకు అంకురార్పణ కార్యక్రమం

శాస్త్రోక్తంగా జరుగనుంది. ఇందులో భాగంగా పుణ్యహవచనం, రక్షా బంధనం, ఆలయ నాలుగు మాడ వీధుల్లో సేనాధిపతి ఉత్సవం నిర్వహిస్తారు.

à°¨‌వంబ‌రు 23à°¨ ధ్వజారోహణం

:

ఆలయంలో à°¶‌నివారం ఉదయం 7 నుంచి 8 à°—à°‚à°Ÿà°² వరకు ధ్వజస్థంభ తిరుమంజనం, ఉదయం 8 నుండి 9 à°—à°‚à°Ÿà°² నడుమ వృశ్చిక లగ్నంలో ధ్వజారోహణంతో అమ్మవారి బ్రహ్మోత్సవాలు

ప్రారంభమ‌వుతాయి. రాత్రి 7.30 నుంచి 11 à°—à°‚à°Ÿà°² వరకు చిన్నశేష వాహనంపై అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam