DNS Media | Latest News, Breaking News And Update In Telugu

తిరుమలకు ధర్మాత్ములు వస్తే ఈ ధర్మ రథాలు తిరగవు 

కొత్త రూల్స్ తో బేజారెత్తుతున్న సామాన్య భక్త జనం 

బస్సులు రాక. వీటి సమాచారం లేక భక్తులు. . పడిగాపులు

విఐపి కార్లకు అడ్డం వస్తున్నాయిట అందుకే

నిషేధం . .

(DNS రిపోర్ట్ : NSV రమణ , స్టాఫ్ రిపోర్టర్, తిరుపతి): . . .

తిరుపతి , నవంబర్ 24, 2019 (డిఎన్‌ఎస్‌) : తిరుమల శ్రీనివాసుని దర్శనానికి ధర్మాత్ములు ( వి ఐ పి లు) తిరుమలకు

వస్తే కొండపై ఉచితంగా తిరిగే ధర్మరాధాలు తిరగవు ఇదే సరికొత్త నిబంధనలు. ఆదివారం ( నవంబర్ 24 న) రోజున సుప్రీం కోర్టు న్యాయమూర్తి వచ్చారంటూ ఏకంగా తిరుమల కొండపై ధర్మ

రథాలను ఉదయం 6 గంటల నుంచి 10 :30 గంటల వరకూ రద్దు చేసేసారు. దీనిపై కొండమీద భక్తులకు ఎటువంటి సమాచారం కూడా ఇవ్వకపోవడం గమనార్హం. కొండమీది ఎన్నో మైకులు ఉండగా, వాటిల్లో ఈ

సమాచారం ఇవ్వాలి అనే విషయం అధికారులకు తెలియక పోవడం చూస్తే వీళ్ళు సామాన్య భక్తుల కోసం పడుతున్న ఆత్రం, అత్యద్భుతంగా ఉందని తెలుస్తోంది. వీళ్ళ వైఖరికి ఉదయం

నుంచి ధర్మరాధాలు తిరగక, అవి వస్తాయో రావో తెలియక నరకం చూసేసారు. వీటిల్లో ఇతర జిల్లాల నుంచి వచ్చిన మీడియా ప్రతినిధులు, అధికార పార్టీ పి ఆర్ ఓ లు, కార్యకర్తలు

కూడా ఉండడం గమనార్హం. జేబు దొందలున్నారు అంటూ ప్రచారం తో మైకుల్లో హోరెత్తించే టిటిడి కి ఈ రోజు ధర్మ రథాలు తిరగవు అని చెప్పాలని ఎందుకు అనిపించలేదు తెలియదు.

పైగా విచారణ కేంద్రాలకూ à°ˆ సమాచారం లేకపోవడం గమనార్హం. 

పాలక మండలి తీర్మానాలు అదరహో :. .

కొత్త పాలక మండలి వచ్చిన తర్వాత తీసుకున్న అద్భుత నిర్ణయాలలో

అత్యద్భుతమైన వాటిల్లో దాదాపుగా అన్ని నిర్ణయాలూ సామాన్య భక్తులకు చుక్కలు చూపిస్తున్నా, ధర్మాత్ములకు మాత్రం అత్యద్భుతంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. గతంలో

భారత రాష్ట్రపతి తిరుమల శ్రీనివాసుని దర్శనానికి వచ్చిన సమయంలో కూడా రక్షణ కోసం కొంత మేర నిబంధలను మాత్రమే అమలు చేసారు. ఆ సమయంలో సామాన్య భక్తులను వేరే మార్గం లో

పంపడం జరిగింది. అయితే కొత్తగా భాద్యతలు తీసుకున్న పాలక మండలి నిర్ణయాలు సామాన్య భక్తులకు చుక్కలు చూపిస్తున్నాయి. 

కార్తీక మాసం లో వేలాది గా భక్తులు

తిరుమల స్వామి దర్శనానికి వచ్చినప్పుడు ఇలాంటి అభ్యంతర నిషేధాజ్ఞలు ఉంటె కచ్చితంగా భక్తులకు తెలియ చెయ్యవలసిన భాద్యత à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ దే. 

విఐపి కార్లకు అడ్డం

వస్తున్నాయిట అందుకే నిషేధం . .

తిరుమల దర్శనానికి వచ్చే విఐపి ల వాహనాలకు ధర్మరాధాలు అడ్డం వస్తున్నాయంటూ, దీంతో విఐపిలు కొండ దిగి వెళ్లే వరకూ ధర్మరధాలను

నిషేధిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే గతం లో ఎన్నడూ లేని విధంగా ఈ వైపరీత్యాలతో సామాన్య భక్తులు మండిపడుతున్నారు. తిరుమలకు ప్రతి రోజూ ఎవరో ఒకరు విఐపి వస్తూనే

ఉంటారు. మరి, ప్రతి రోజూ à°ˆ ఉచిత బస్సులను రద్దు చేస్తారా అనే ప్రశ్నలకు à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ నుంచి సమాధానం లేదు. 

 


Latest Job Notifications

Panchangam - Dec 3, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam