DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పని చేసుంటే నిన్ను ఎందుకు ఓడిస్తారు? : రాగే పరశురామ్ ..

ప్రభాకర్‌ చౌదరికి వైకాపా నేతల కౌంటర్‌ జవాబు  

(DNS రిపోర్ట్ : మనోహర్ , స్టాఫ్ రిపోర్టర్, అనంతపూర్):. . . 

అనంతపూర్, నవంబర్ 26, 2019 (డిఎన్‌ఎస్‌) :  à°…నంతపురం అర్బన్

 à°¨à°¿à°¯à±‹à°œà°•à°µà°°à±à°—ంలో 90 శాతం పనులు పూర్తి చేసి ఉంటె ప్రభాకర్ చౌదరి ని ఎందుకు ఓడిస్తారో చెప్పాలని అనంతపురం మాజీ మేయర్‌ రాగే పరశురాం, కోగటం విజయభాస్కర్‌రెడ్డి

డిమాండ్ చేసారు.
మంగళవారం అనంతపురంలోని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశం లో వారు మాట్లాడుతూ  à°à°¦à±‡à°³à±à°² చంద్రబాబు పాలనతో

ప్రజలు విసిగిపోయి వైఎస్‌ జగన్‌కు ముఖ్యమంత్రిగా పట్టం కట్టారన్నారు.  à°à°¦à±‡à°³à±à°² పాటు వైఎస్‌ జగన్‌కు రాష్ట్ర ప్రజానీకం అధికారం అప్పగిస్తే ఐదు నెలల్లోనే

మేనిఫెస్టోలోని 80 శాతం హామీలు అమలు చేశామన్నారు. ఎక్కడా అవినీతికి తావులేకుండా పాదర్శకంగా పాలన సాగిస్తున్నారు. దీన్ని ఓర్వలేక టీడీపీ విమర్శలు చేస్తోంది.

దీన్ని ప్రజలు గమనిస్తున్నారు. వైసీపీ చేస్తున్న సంక్షేమ పథకాలు, పాలన చూసి టీడీపీ, జనసేన నేతలు అనేక విమర్శలు చేస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

ప్రజా సంక్షేమం పట్ల వైఎస్‌ జగన్‌కు చిత్తశుద్ధి ఉంది. మహాత్మాగాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సాధించేందుకే సచివాలయ వ్యవస్థ తెచ్చారు. ఐదు నెలల్లోనే ఉద్యోగాల

విప్లవం తెచ్చాం. ఆరోగ్య శ్రీ, అమ్మ à°’à°¡à°¿, ఆర్టీసీ విలీనంపై కమిటీ వంటి చారిత్రక నిర్ణయాలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తీసుకున్నారని తెలిపారు. 

ఇసుక సమస్య

వస్తే à°ˆ రోజు అన్నదాన కార్యక్రమాలు చేస్తున్న జనసేన నేతలు à°—à°¡à°¿à°šà°¿à°¨ ఐదేళ్లలో ఇసుక సమస్య వచ్చినప్పుడు ఎక్కడకు వెళ్లారని ప్రశ్నించారు?  à°œà°¿à°²à±à°²à°¾à°²à±‹ వలసలు కొనసాగితే

ఏం చేశారు? జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ప్యాకేజీ రాజకీయాలు చేస్తున్నారన్నారు. 

అనంతపురం అర్బన్‌ నియోజకవర్గంలో 90 శాతం పనులు చేపట్టామని మాజీ ఎమ్మెల్యే

ప్రభాకర్‌ చౌదరి నిన్న లేఖ రాశారని, నిజంగా 90 శాతం పనులు చేసుంటే ప్రజలు మీకు బ్రహ్మరథం పట్టేవారు. నీలో చిత్తశుద్ధి లేకపోవడంతోనే ఘోరంగా ఓడించారన్నారు..

రూ. 38

కోట్ల హడ్కో రుణంతో  à°¨à±€à°Ÿà°¿ ప్రాజెక్ట్ కు ప్రణాళిక సిద్దం చేస్తే కార్పొరేషన్ కు అదనపు భారం కాకుండా...కేంద్ర నిధులు 80 శాతం.. రాష్ట్ర నిధులు 10 శాతం... కార్పొరేషన్

నిధులు 10 శాతంతో తాగునీటి అవసరాలు తీర్చామన్నారు. 

అర్ధంతరంగా ఆగిన సైఫుల్లా బ్రిడ్జి పూర్తి చేశాం. ప్రభుత్వ డిగ్రీ కలాశాల హాస్టల్‌ను పూర్తి చేశాం.

మరువవంక, నడిమివంక ఛానలింగ్‌ కోసం నిధులు తెచ్చాం. ఇవన్నీ అనంత వెంకట రామిరెడ్డి ఎంపీగా ఉన్న సమయంలోనే తీసుకు వచ్చామన్నారు. 

ఈ సందర్భంగా బహిరంగ లేఖలో

పేర్కొన్న కొన్ని విషయాలను తెలిపారు.

రూ.100 కోట్లతో సూపర్‌స్పెషాలిటీ తెచ్చామని అంటున్నారు. అది పీఎంఎస్‌ఎస్‌వై à°•à°¿à°‚à°¦ కేంద్రం ఇచ్చింది. 2014లో వచ్చింది. దాన్ని

2017లో పూర్తి చేయాల్సి ఉంది. 2014 నుంచి 2019 వరకు మీరే (ప్రభాకర్‌ చౌదరి) ఎమ్మెల్యేగా ఉన్నారు. మీ పార్టీనే అధికారంలో ఉంది. మరి ఎందుకు పూర్తి చేయలేకపోయారు? ఇది మీ చేతగానితం

కాదా? ఇతరుల మీద బురదజల్లడం మానుకో అని హెచ్చరిస్తున్నామన్నారు.

అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలో 124 జీవో ప్రకారం 510 పోస్టులు భర్తీ చేయాల్సి ఉంటే ఐదేళ్లలో ఏం

చేశారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి కామినేని శ్రీనివాస్‌ అనంతపురం ఆస్పత్రిలో నిద్ర కూడా చేశారు. మరి ఎందుకు à°† పోస్టులు

తీసుకురాలేకపోయారని ప్రశ్నించారు. 

ఔటర్‌ రింగ్‌ రోడ్డుకు 2016లో నిధులు మంజూరయ్యాయని లేఖలో పేర్కొన్నావు. 2019 ఏప్రిల్‌ వరకు నువ్వు ఎమ్మెల్యేవి. మరి దాన్ని

ఎందుకు పూర్తి చేయలేకపోయారు? ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదే? అని ప్రశ్నించారు. 

అనంత వెంకట రామిరెడ్డి ఎంపీగా ఉన్నప్పుడు, ఎమ్మెల్యే గా బి.నారాయణ రెడ్డి

ఉన్నప్పుడు, వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రూ.58 కోట్లతో  à°®à°°à±à°µà°µà°‚à°•, నడిమివంక ఛానలింగ్‌ పనులు వచ్చాయి. నడిమివంక మా హయాంలోనే పూర్తి చేశాం.

మరువవంక పనులు చేసే సమయానికి ఎమ్మెల్యేగా ప్రభాకర్‌ చౌదరి వచ్చారు. అప్పటి వరకు మిగిలిన రూ.20 కోట్ల నిధులతో à°† పనులు చేపట్టకుండా నిధులను ఇతర ప్రాంతానికి ఎందుకు

తరలించారు? వ్యక్తిగత స్వార్థం కోసం నిధులు మళ్లించిన మాట వాస్తవం కాదా? ఇప్పుడు రూ.21.37 లక్షల కోట్ల పనులు అమృత్‌ పథకం à°•à°¿à°‚à°¦ మంజూరైంది. 50 శాతం కేంద్రం, 20 శాతం రాష్ట్రం, 30

శాతం అర్బన్‌ లోకల్‌బాడీలు భరించాలి. అంటే మునిసిపల్‌ కార్పొరేషన్‌ రూ.6.30 లక్షలు భరించాలి. మీరు చేసిన నిర్వాకం వల్ల ప్రజలపై à°ˆ భారం పడింది. అదే రూ.20 కోట్లతో అప్పుడే

పనులు చేసుంటే ఎన్నో కాలనీలు ముంపుకు గురయ్యేవి కావని తెలిపారు. 

భూగర్భ డ్రెయినేజీకి సంబంధించి 1997లో చైర్మన్‌à°—à°¾ ఉన్నప్పుడే రెడీ చేశానని అంటున్నారు. 1999

నుంచి 2004 వరకు టీడీపీ అధికారంలో ఉంది. మీరు ఇన్‌చార్జ్‌à°—à°¾ ఉన్నారు. అప్పుడు ఎందుకు పూర్తి చేయలేదు.  

2014లో అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీకి నైస్‌ అనే కంపెనీకి

డీపీఆర్‌ తయారు చేయాలని రూ.20 లక్షలు మేం ఇచ్చాం. à°† తర్వాత మీరు (ప్రభాకర్‌ చౌదరి) ఎమ్మెల్యే అయ్యారు. దాన్ని ఎందుకు మళ్లీ పట్టించుకోలేదు. మీరు నీతులు చెబితే ప్రజలు

నమ్ముతారు అనుకుంటున్నారా? నైస్‌ కంపెనీతో చేసిన డీపీఆర్‌ మీకు పంపుతాం. చూసుకోమన్నారు 

రూ. 191 కోట్లతో నీటి పథకాన్ని తెచ్చానని అంటున్నావు. 2012లోనే దానికి

సంబంధించి జీవో విడుదలైంది. రాష్ట్రంలో 13 మునిసిపాలిటీలకు వస్తే అనంతపురం 10à°µ స్థానంలో ఉంది. టెండర్లు కూడా 2013 ఫిబ్రవరికే పూర్తయ్యాయి. 6.89 ఎక్సెస్‌కు టెండర్‌

ఖరారైంది. à°† తర్వాత నువ్వు (ప్రభాకర్‌ చౌదరి) ఎమ్మెల్యేగా గెలిచాక ఎందుకు పూర్తి చేయలేదు. ఇప్పటికీ దాదాపు 15 శాతం పనులు పూర్తి కాలేదు. అనంత వెంకట రామిరెడ్డి, ఇతర

నాయకులు à°ˆ స్కీంను తెచ్చారు. మీరు తెచ్చుకున్నట్లు చెప్పుకోవడం సిగ్గుగా లేదా?  à°ªà±ˆà°—à°¾ పనులు పూర్తి కాకుండానే బిల్లులన్నీ చెల్లించారు. ఇప్పుడు మునిసిపాలిటీపై

భారం పడుతోంది. పనులు పూర్తి కాకుండానే ఎందుకు బిల్లులు చెల్లించారో చెప్పాలన్నారు.

శిల్పారామంకు రూ.5 కోట్లు కాంగ్రెస్‌ హయాంలో అనంత వెంకట రామిరెడ్డి

ఎంపీగా ఉన్నప్పుడు, ఎమ్మెల్యే à°—à°¾ గురునాథ రెడ్డి, నేను మేయర్‌à°—à°¾ ఉన్నప్పుడు మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, గీతారెడ్డి వచ్చి శిలాఫలకం వేశాం. రూ.5 కోట్లు మేం

తెచ్చాం. అది కాకుండా మీరు à°Žà°‚à°¤ తెచ్చారో చెప్పండన్నారు. 

ప్రజలకు అవసరమైనవి ప్రాధాన్యత క్రమంలో చేస్తాం. అనంతపురం నగరానికి డంపింగ్‌ యార్డు సమస్య ఉంది.

దాన్ని తరలిస్తాం. నారాయణపురం వద్ద 12 ఎకరాల్లో బయో మైనింగ్‌కు, కంపోస్ట్‌ యార్డుకు 5 ఎకరాలు కేటాయించాం. ఎన్నికల సమయంలో అనంత వెంకట రామిరెడ్డి ఇచ్చిన మొదటి హామీ

ఇది. దాదాపు పూర్తవుతోందని ప్రకటించారు.   

మిగిలిన ఆవశ్యకమైన అంశాలను కూడా త్వరలోనే పూర్తి చేస్తామన్నారు, 
 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam