DNS Media | Latest News, Breaking News And Update In Telugu

28 నుంచి శ్రీకాకుళం యూనివర్సిటీ లో 5వ ఏపీ సైన్స్ కాంగ్రెస్ 

ప్రారంభోత్సవ సభకు గవర్నర్ హరిచందన్ హాజరు 

సూపర్ కంప్యూటర్ సృష్టికర్త విజయ్ భట్కర్ పాల్గొనే అవకాశం?

మూడు రోజుల విద్యా వేడుకలకు వర్సిటీ సిద్ధం :

వీసీ రాంజీ 

బుడితి, ఖాదీ ఉత్పత్తులకు ఆన్ లైన్ విక్రయ సేవలు :

(DNS రిపోర్ట్ : SV ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్, శ్రీకాకుళం) : . .

శ్రీకాకుళం, నవంబర్ 27, 2019

(డిఎన్‌ఎస్‌): à°ˆ నెల  28 నుంచి ప్రారంభం కానున్న  5à°µ  à°†à°‚ధ్ర ప్రదేశ్ సైన్స్ కాంగ్రెస్ సమావేశాలను రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రారంభించనున్నట్టు

శ్రీకాకుళం డా.బి.ఆర్.అంబేద్కర్ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ కె. రాంజీ తెలిపారు. బుధవారం శ్రీకాకుళం (ఎచ్చెర్ల) లోని విశ్వ విద్యాలయం లో నిర్వహించిన

విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ  28 నుండి 30à°µ తేదీ వరకు మూడు రోజులు పాటు సైన్స్ కాంగ్రెస్ ను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు

తెలిపారు.  ఆంధ్ర ప్రదేశ్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, అమరావతి, బి ఆర్ అంబెడ్కర్ విశ్వ విద్యాలయం, శ్రీకాకుళం సంయుక్తంగా à°ˆ ఏపీ సైన్స్ కాంగ్రెస్ ను నిర్వహిస్తున్నట్టు

తెలిపారు.  à°°à°¾à°·à±à°Ÿà±à°°à°‚లోని 18 విశ్వవిద్యాలయాలకుగాను 12 విశ్వవిద్యాలయాల ఉపకులపతులు హాజరుకానున్నారని, ఆరుగురు రిజిస్ట్రార్ లు పాల్గొంటారన్నారు.  à°ªà±à°°à°¾à°°à°‚భోత్సవ

సభలో రాష్ట్ర గవర్నర్ కీలక ఉపన్యాసం చేయనున్నారన్నారు. ఈ విద్యా వేడుకలలో కంప్యూటర్ మాన్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన సూపర్ కంప్యూటర్ సృష్టికర్త విజయ భాట్కర్

పాల్గొనే అవకాశం ఉందని తెలియచేసారు. రాష్ట్ర స్థాయి విద్యా వేడుకల నిర్వహణ తమ విద్యాలయానికి లభించడం గౌరవంగా భావిస్తున్నామన్నారు.  à°µà°¿à°¦à±à°¯à°¾à°°à±à°¥à±à°²à±, అధ్యాపకులు,

ప్రజలు, ఆసక్తి గలవారు అందరూ సదస్సుల్లో పాల్గొని విజ్ఞానాన్ని ఆస్వాదించవచ్చని చెప్పారు.

విద్యాలయం రిజిస్ట్రార్ రఘుబాబు మాట్లాడుతూ ఈ సదస్సులో పాల్గొనే

ప్రతినిధులు భాగస్వామ్య ధ్రువీకరణ పత్రం కోసం విద్యాసంస్థలు, విద్యార్థులు రూ. 2500 రిజిస్ట్రేషన్ రుసుము చెల్లించాలన్నారు. అయితే శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు

చెందిన విద్యా సంస్థలు, విద్యార్థులను ప్రోత్సహించేందుకు à°ˆ రెండు జిల్లాల వారికీ కనీస రుసుముగా  à°µà°¿à°¦à±à°¯à°¾à°°à±à°¥à±à°²à°•à± రూ.250 గాను, విద్యాసంస్థలకు రూ.500  à°²à°¨à± తగ్గించినట్టు

తెలిపారు. 

ప్రసంగాలు - ఉపన్యాసాలు :

మొదటి రోజున 7 కీలక ప్రసంగాలు, 4 విశిష్ట ఉపన్యాసాలు, 38 ఉపన్యాసాలు వివిధ అంశాలపై ఉంటాయని చెప్పారు. 100కు పైగా ప్రదర్శన

శాలలు ఉంటాయని తెలిపారు. 253 పోస్టర్ల ప్రదర్శన, 167 ఓరల్ ప్రదర్శనలు వెరసి 400కు పైగా పరిశోధన పత్రాలు ప్రదర్శన ఉంటాయని చెప్పారు. 

బుడితి, ఖాదీ ఉత్పత్తులకు ఆన్ లైన్

సేవలు :
 
శ్రీకాకుళం జిల్లా లో అత్యంత ఖ్యాతిగాంచిన బుడితి లోహ విగ్రహ తయారీ ఉత్పత్తులు, ఖాదీ 
వస్త్ర, తదితర ఇతర ఉత్పత్తులకు మరింత ప్రాచుర్యం

కల్పించేందుకు ఈ ఏపీ సైన్స్ కాంగ్రెస్ వేదికగా ఆన్ లైన్ విక్రయ సంస్థలతో అనుసంధానం చేస్తున్నట్టు తెలిపారు. దీనిలో భాగంగా అమెజాన్, ఫ్లిప్ కార్ట్ తదితర ఆన్

లైన్ దిగ్గజాలతో జిల్లాలో ప్రఖ్యాతి చెందిన ఉత్పత్తులను విశ్వవ్యాప్తం చేస్తున్నట్టు వివరించారు. వారి ఉత్పత్తులు తమంతట తాము ఇ -మార్కెటింగ్ కు ఆన్ లైన్ లో

చేరుటకు రూ.2 నుండి రూ.3 కోట్ల వరకు రుసుము చెల్లించాలని అయితే సైన్స్ కాంగ్రెస్ లో భాగంగా విశ్వవిద్యాలయం అనుసంధాన కర్తగా వ్యవహరిస్తూ సహకరిస్తుందని

చెప్పారు.

à°ˆ మూడు రోజుల విద్యా వైభవ సదస్సుకు ఇతర ప్రాంతాల నుంచి 1500 మంది సహా మొత్తం 2500 మంది అతిధులు, విద్యర్ధులు పాల్గొంటున్నారని పేర్కొన్నారు. 

à°ˆ

కార్యక్రమంలో రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారాం, రాష్ట్ర మంత్రులు కొడాలి  à°µà±‡à°‚కటేశ్వర రావు, ఆదిమూలపు సురేష్, ధర్మాన కృష్ణ దాస్ లు, ఉత్తరాంధ్రా జిల్లాలకు

చెందిన శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారని తెలిపారు. 

ఈ విలేకరుల సమావేశం లో విశ్వవిద్యాలయం

రిజిస్ట్రార్ కె. రఘుబాబు, ప్రతినిధులు జి.తులసి రావు, పి.సుజాత, తదితరులు పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam