DNS Media | Latest News, Breaking News And Update In Telugu

గుండు లేదు  గోవిందా. . . గోవిందా.. ​​​​​​​ఆలయాల్లో కత్తి విడిచిన క్షురకులు 

హుండీలు దోచుకునే శాఖ కు పట్టింపు లేదు. 

విశాఖపట్నం, జూన్ 15 2018 (DNS Online) : రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో (తిరుపతి మినహా)  à°µà°¿à°§à±à°²à±  à°¨à°¾à°¯à±€ బ్రాహ్మణులు కత్తి

విడిచిపెట్టడం తో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ కు తలా బొప్పి కట్టింది. నెలకు కనీసం 15000 రూపాయల వేతనం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలనే ప్రధాన డిమాండ్లతో

రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లోని క్షురకులు నిరసన బాట పట్టారు.   
తమ డిమాండ్ల సాధన కోసం శుక్రవారం ఆందోళనకు దిగారు. తిరుమల తిరుపతి తప్ప ఇతర ఆలయాల్లో శుక్రవారం

తెల్లవారుజాము నుంచి విధులు బహిష్క్రరించారు. సింహాచలం, విజయవాడ, ద్వారకా తిరుమల, అన్నవరం, అరసవల్లి శ్రీశైలం, కాణిపాకం, ప్రెనుగంచిప్రాలు 
తదితర ఆలయాల్లో వీరు

చేస్తున్న నిరసన ఫలితంగా భక్తులు నానా అవస్థలు పడుతున్నారు. ఇప్పడికే క్యూలైన్లో ఉన్న భక్తులు సైతం వీరి కోసం వేచి ఉండవలసిన స్థితి ఏర్పడింది. అలాగే ఈఎస్‌ఐ,

పీఎఫ్‌ సౌకర్యం కల్పించాలని.. ఉద్యోగ విమరణ చేసిన వారికి నెలకు రూ.5 వేలు పెన్షన్‌ ఇవ్వాలని కోరుతున్నారు.

కోట్లు వస్తున్నా ఆదుకోరా : వైకాపా...

దేవాదాయ శాఖ

కు కేవలం తలా నీలాలు ద్వారా వచ్చే ఆదాయం కోట్ల రూపాయల్లో ఉంటుందని, అయితే క్షురక సేవ చేసే సిబ్బంది à°•à°¿ మాత్రం  à°¨à°¾à°® మాత్రంగా చేతులు దులుపుతున్నారని వైఎస్సార్

కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు మండిపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తం à°—à°¾ వీరు చేస్తున్ననిరసనలకు,  à°ªà°¾à°°à±à°Ÿà±€ తరపున మద్దతు ప్రకటించినట్టు తెలుస్తోంది. హుండీల ద్వారా

నూ, కేశఖండన టికెట్లు అమ్మడం ద్వారానూ వచ్చిన నిధులు కోట్లలో ఉంటుందని, వాటిని అధికారులు , ఇతర సిబ్బంది వేతనాలు, విలాసాలకు ఖర్చు చేసుకోడవం జరుగుతోందని, అయితే ఈ

ఆదాయం దేవాలయానికి రావడానికి కారణమైన సిబ్బంది à°•à°¿ మాత్రం పూర్తి అన్యాయం జరుగుతోందని మండి పడుతున్నారు. 

భక్తుల అవస్థలు :
వివిధ ఆలయాల్లో క్షురకులు బంద్

లో ఉండడం తో ఆలయాలకు వచ్చిన భక్తులు సింహాచలం, అన్నవరం, ద్వారకా తిరుమల తదితర ఆలయాల్లో అవస్థలు పడుతున్నారు. ఎప్పడికి వీరి నిరసన ముగుస్తుందో, ఎప్పుడు తమ మొక్కు

తీరుతుందో అని ఎదురుచూస్తున్నారు.ఆలయాల్లోని  à°•à±‡à°¶à°–ండనశాలలు బోసిబోయాయి. తలనీలాలు సమర్పించేందుకు వస్తున్న భక్తులు వెనుదిరిగాల్సి వస్తోంది. ప్రభుత్వం

వెంటనే స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని భక్తులు కోరుతున్నారు.

 

Pix : Courtesy to whom so ever it may concern

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam